ఇందుకోసం ప్రభుత్వం రూ.36,585 కోట్లు కేటాయించనుంది. ఒకవేళ రైతులు ఇప్పటికే రుణాలు చెల్లించి ఉంటే వారికి ప్రత్యేక ప్రోత్సాహకాలు అందించాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది. వీరికి రూ.50 వేల వరకు సాయం అందనుంది. అసలు, వడ్డీ కలిపి రూ.2 లక్షల వరకు రైతుల వ్యవసాయ రుణాలు మాఫీ అవుతాయి. ఇందుకోసం భూయాజమాన్య డాక్యుమెంట్లు వంటివేమీ అక్కర్లేదు.
రూ.2 లక్షలకు మించి రుణాలు ఉన్నవారికి కూడా ఈ పథకం వర్తిస్తుంది. అయితే, వారు అదనపు డబ్బు ముందుగానే బ్యాంకులకు చెల్లించాలి. అంటే రూ.2 లక్షలకంటే ఎంత ఎక్కువగా లోన్ తీసుకుంటే అందులో రూ.2 లక్షలు మినహాయించి మిగిలిన డబ్బు చెల్లించాలి. ఒక రైతు రూ.3 లక్షల రుణం తీసుకుంటే అతడు ముందుగా రూ.1 లక్ష రుణం బ్యాంకుకు చెల్లించాలి. అప్పుడు మిగతా రూ.2 లక్షల్ని ప్రభుత్వం చెల్లిస్తుంది.
వచ్చే ఏడాది మార్చి 31 లోపు అదనపు రుణం చెల్లించిన వారికి మాత్రమే ప్రభుత్వ రుణమాఫీ వర్తిస్తుంది. ఏప్రిల్ 1, 2019 నుంచి మార్చి 31, 2025 వరకు రుణం తీసుకున్నవారికి మాత్రమే రుణమాఫీ వర్తిస్తుంది. 2025 మార్చి 30 నాటికి ఉన్న రుణాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు. అలాగే, ఈ ఏడాది మార్చి 31 లోపు రుణం చెల్లించి ఉండకూడదు. మహారాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంపై అక్కడి రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
తమిళనాడులో కూడా కొత్తగా అధికారం చేపట్టిన ముఖ్యమంత్రి విజయ్ అక్కడి రైతులకు రూ.50 వేల వరకు రుణమాఫీ ప్రకటించారు. అధికారకంగా ఏ పదవిలోనైనా ఉన్నా, లేదా రాజకీయ పదవుల్లో ఉన్నా ఈ పథకం వర్తించదు. అలాగే, ప్రభుత్వ ఉద్యోగులకు, ఆదాయపు పన్ను చెల్లించేవారికి, నెలకు రూ.25,000కు పైగా వేతనం పొందుతున్న సహకార సంస్థల సిబ్బందికి కూడా రుణమాఫీ వర్తించదు.

More Stories
భారత్ జీడీపీ వృద్ధి రేటు 7.7 శాతం.. ప్రధాని మోదీ హర్షం
రెండోసారి యధావిధిగా ఆర్బీఐ వడ్డీ రేట్లు
రాజేష్ ఎక్సపోర్ట్స్ రూ.15 లక్షల కోట్ల మాయాజాలం