పాలిమ‌ర్ క‌రెన్సీ నోట్లకు కేంద్రం గ్రీన్‌ సిగ్నల్

పాలిమ‌ర్ క‌రెన్సీ నోట్లకు కేంద్రం గ్రీన్‌ సిగ్నల్

మరోవైపు, దేశంలో రిటైల్ ద్రవ్యోల్బణం క్రమంగా తగ్గుతోందని కేంద్రం వెల్లడించింది. వినియోగదారుల ధరల సూచీ (సిపిఐ) ఆధారంగా నమోదయ్యే సగటు రిటైల్ ద్రవ్యోల్బణం 2023-24లో 5.4 శాతంగా ఉంది. 2024-25లో ఇది 4.6 శాతానికి తగ్గింది. 2025-26లో మరింత తగ్గి 2.1 శాతానికి చేరిందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. అయితే 2026-27 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ద్రవ్యోల్బణం కొంత పెరిగింది. 
 
పశ్చిమాసియా సంక్షోభం కారణంగా వస్తువుల ధరలపై ప్రభావం పడటం, అంతర్జాతీయ ఇంధన ధరలు అధికంగా ఉండటం, కూరగాయల ధరల్లో పెరుగుదల, ఎల్‌నినో పరిస్థితులు వంటి కారణాలతో 2026-27 తొలి త్రైమాసికంలో రిటైల్ ద్రవ్యోల్బణం 3.9 శాతానికి చేరిందని ప్రభుత్వం తెలిపింది. అయినప్పటికీ ఇది ఆర్బీఐ నిర్దేశించిన 4 శాతం ద్రవ్యోల్బణ లక్ష్యానికి దిగువనే ఉందని కేంద్రం స్పష్టం చేసింది.
 
ధరల ఒత్తిడిని తగ్గించేందుకు పరోక్ష పన్నుల విధానంలో కూడా ప్రభుత్వం మార్పులు చేపట్టిందని నిర్మలా సీతారామన్ తెలిపారు. 56వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో రెండు ప్రధాన రేట్లను తీసుకొచ్చినట్లు చెప్పారు. ఇందులో 18 శాతం స్టాండర్డ్ రేటు, 5 శాతం మెరిట్ రేటు ఉండగా, ఎంపిక చేసిన కొన్ని వస్తువులు, సేవలకు 40 శాతం ప్రత్యేక డీమెరిట్ రేటును నిర్ణయించినట్లు తెలిపారు. 
 
గతంలో 28 శాతం జీఎస్టీ ఉన్న అనేక వస్తువులను 18 శాతానికి తగ్గించారు. అలాగే 18 శాతం ఉన్న కొన్ని వస్తువులపై పన్నును 12 లేదా 5 శాతానికి తగ్గించారు. 12 శాతం ఉన్న మరికొన్ని వస్తువులపై పన్నును 5 శాతం లేదా సున్నాకు తగ్గించినట్లు కేంద్రం వెల్లడించింది.