అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియలో ఉన్న మహారాష్ట్ర, జార్ఖండ్‌లలో బిజెపి తన మిత్రపక్షాలతో సీట్లను పంచుకునే కసరత్తులను దాదాపు విజయవంతంగా పూర్తి చేసినప్పటికీ, కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి ఏకాభిప్రాయం సాధించడం కష్టతరంగా ఉంది. శనివారం జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇండియా కూటమిలో లుకలుకలు వెల్లడయ్యాయి. ఆర్జేడీ అసంతృప్తిని వ్యక్తం చేసింది.
ముఖ్యమంత్రి, జేఎంఎం అధినేత హేమంత్ సోరెన్ తన పార్టీ, కాంగ్రెస్ 70 స్థానాల్లో పోటీ చేస్తాయని, మిగిలిన 11 స్థానాలలో ఆర్జేడీ, వామపక్షాలు పోటీ చేస్తాయని చేసిన ప్రకటన ఆర్జేడీతో ఆగ్రహం కలిగిస్తోంది. అయితే ఆ పార్టీలు ఎన్నెన్ని స్థానాలలో పోటీచేస్తాయో చెప్పలేదు.
సోరెన్ ప్రకటనపై ఆర్‌జేడీ అధికార ప్రతినిధి మనోజ్ కుమార్ ఝా స్పందిస్తూ, “మాకు సీట్ల కేటాయింపుపై మేము నిరాశను వ్యక్తం చేస్తున్నాము. నిర్ణయం ఏకపక్షం. మమ్మల్ని సంప్రదించలేదు. అన్ని ఎంపికలు మాకు తెరిచి ఉన్నాయి.” అని స్పష్టం చేశారు. ఆర్జేడీ నేత, బీహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ కూడా జార్ఖండ్‌లోని పార్టీ నాయకులు, కార్యకర్తల మనోభావాలను గమనించినట్లు చెప్పారు.
2019లో ఆర్జేడీ, జేఎంఎం, కాంగ్రెస్‌లు కలిసి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశాయి. ఆర్జేడీ ఏడు స్థానాల్లో పోటీ చేసినా ఒక్కటి కూడా గెలవలేకపోయింది. మొత్తం 43 స్థానాలకు గాను జేఎంఎం 30 సీట్లు గెలుచుకోగా, కాంగ్రెస్‌కు కేటాయించిన 31 స్థానాల్లో 16 స్థానాల్లో విజయం సాధించింది. జార్ఖండ్‌లో 15 నుంచి 18 సీట్లను ఆర్జేడీ గుర్తించిందని, అక్కడ బీజేపీని సొంతంగా ఓడించే అవకాశం ఉందని భావిస్తున్నట్లు తెలిసింది.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా శనివారం రాంచీ పర్యటనలో ఉన్నారు, అక్కడ “రాజ్యాంగాన్ని గౌరవించడం”కు సంబంధించిన సమావేశంలో ప్రసంగించారు. అయితే, సోరెన్ ప్రసంగించిన విలేకరుల సమావేశంలో రాహుల్ హాజరుకాలేదు. జార్ఖండ్‌కు సంబంధించి ఎన్‌డిఎ తన ఫార్ములాను వెల్లడించిన ఒక రోజు తర్వాత సీట్ల పంపకానికి సంబంధించి సోరెన్ ప్రకటన వెలువడింది. బిజెపి 68, ఎజెఎస్‌యు పార్టీ 10, జెడి(యు) రెండు, ఎల్‌జెపి (రామ్‌విలాస్) ఒక చోట పోటీ చేయనున్నాయి.
More Stories
వక్ఫ్ జెపిసి భేటీలో ఒవైసీతో సహా 10 మంది ఎంపీల సస్పెన్షన్
భారతదేశం శక్తివంతంగా ఉండటం అంటే విధ్వంసకారిగా కాదు
మహాకుంభమేళాలో ‘సనాతన బోర్డు’ ముసాయిదా