200కు పైగా సీట్లలో ఏకాభిప్రాయం వచ్చిందని ఎన్సీపీ (శరద్) పార్టీ ప్రకటించినప్పటికీ తాజాగా శివసేన(యూబీటీ) నాయకుడు సంజయ్ రౌత్ చేసిన వ్యాఖ్యలు సీట్ల సర్దుబాటుపై ఏకాభిప్రాయం రానట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో మహారాష్ట్రలో సీట్ల పంపకాలపై నెలకొన్న రాజకీయ గందరగోళంలో శివసేన (యూబీటీ) కీలక నిర్ణయం తీసుకుంది.
ఉద్ధవ్ ఠాక్రే పార్టీ సీట్ల పంపకంపై నేరుగా కాంగ్రెస్ హైకమాండ్‌తో చర్చించనున్నట్లు ఆ పార్టీ నేత సంజయ్ రౌత్ తెలిపారు. త్వరలో రాహుల్ గాంధీతో ఈ విషయమై మాట్లాడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మహారాష్ట్ర కాంగ్రెస్ నేతలు సీట్ల పంపకంపై నిర్ణయం తీసుకోలేకపోతున్నారని, నామినేషన్ల సమయం దగ్గరపడటంతో నేరుగా తాము రాహుల్ గాంధీతోనే మాట్లాడతామని తెలిపారు.
కాంగ్రెస్ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్‌తో ఇప్పటికే రౌత్ సీట్ల పంపంకాలపై చర్చించారు. ముంబైలో సంజయ్ రౌత్ మీడియాతో మాట్లాడుతూ కొన్ని సీట్ల విషయంలో రెండు పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదని తెలిపారు. ఈ విషయమై నేరుగా రాహుల్ గాంధీతో మాట్లాడతామని చెప్పారు. మహారాష్ట్ర కాంగ్రెస్ నేతలు ఒక్కో సీటు గురించి ఢిల్లీ నేతలతో సంప్రదిస్తున్నారని, దీంతో సమయం వృధా అవుతుందని సంజయ్ రౌత్ పేర్కొన్నారు.
శివసేన (యుబిటి), ఎన్సీపీ (శరద్) మధ్య సీట్ల పంపకాలపై ఏకాభిప్రాయం వచ్చినప్పటికీ కాంగ్రెస్‌తో సీట్ల పంచాయితీ తెగనట్లు కనిపిస్తోంది. మహారాష్ట్ర కాంగ్రెస్ నేతలు సీట్ల పంపకంపై నిర్ణయం తీసుకోలేకపోతున్నారని, నామినేషన్ల సమయం దగ్గరపడటంతో నేరుగా తాము రాహుల్ గాంధీతోనే మాట్లాడతామని తెలిపారు. కాంగ్రెస్ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్‌తో ఇప్పటికే రౌత్ సీట్ల పంపంకాలపై చర్చించారు.
కాగా, రౌత్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత నానా పటోలే ఆచితూచి స్పందించారు. ఆయన ఏం చెప్పారో తనకు తెలియదని, ఈ సమయంలో ఎలాంటి వ్యాఖ్యలు చేయదలచుకోలేదని పేర్కొన్నారు. రౌత్ ప్రకటను తాను చూడలేదని, సీట్ల పంపకాలపై హైకమాండ్ మిత్రపక్షాలతో చర్చిస్తుందని చెప్పారు.
More Stories
బంగ్లా హిందువుల రక్షణకై భారత్ నిర్దిష్ట చర్యలు అవసరం
బంగ్లాదేశ్ లో మైనారిటీలపై హింస, అణచివేతలపై నిరసన
ఈ సమావేశాల్లోనే జమిలి ఎన్నికల బిల్లు