ఎం. సుందరరామిరెడ్డి
* పార్లమెంట్ ను పేల్చి, ఎర్రకోటపై పాక్ జెండా ఎగరేసే కుట్ర భగ్నం
స్వతంత్రం వచ్చిన నెల రోజుల లోపే రక్తపాతం సృష్టించి ఢిల్లీని స్వాధీనం చేసుకొని, ఎర్రకోటపై పాకిస్తాన్ జెండాను ఎగరవేయాలనే కుట్ర జరిగింది. ప్రభుత్వంలో కీలక పదవులలో ఉన్న ముస్లిం అధికారుల పర్యవేక్షణలోనే ఈ కుట్ర జరిగింది. అందుకు పెద్ద ఎత్తున ఆయుధాలను సమీకరించుకొని మసీదులలో భద్రపరిచారు. అయితే నాటి ప్రభుత్వ నిఘా అధికారులకు గాని, ప్రభుత్వంలోని కీలక వ్యక్తులకు గాని ఈ విషయం గురించి కించిత్తు సమాచారం కూడా లేదు.
సెప్టెంబరు 10న పార్లమెంట్ భవనాన్ని పేల్చివేసి మంత్రులందరినీ చంపి, ఎర్రకోటపై పాకిస్తాన్ జెండాను ఎగురవేయాలని ఢిల్లీలోని ముస్లింలు ప్లాన్ చేస్తున్నారని 1947 సెప్టెంబర్ 9వ తేదీ అర్ధరాత్రి నాటి ప్రధాని, హోంమంత్రి సర్దార్ పటేల్‌కు ఆర్‌ఎస్‌ఎస్ సమాచారం అందించింది. సంఘ్ నుంచి వచ్చిన సమాచారం కాబట్టి సందేహించే ప్రశ్నే లేదు.
పటేల్ వెంటనే అడ్డుకొనే చర్యకు ఉపక్రమించారు. కమాండర్ అకిన్ లేక్‌ను పిలిచి సైనిక పరిస్థితి గురించి అడిగారు. ఆ సమయంలో ఢిల్లీలో చాలా తక్కువ మంది సైనికులు ఉండేవారు. ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో మోహరించిన బలగాలను ఢిల్లీకి పిలిపించినా ప్రమాదం నుంచి బయటపడలేమని ఓ విధంగా చేతులెత్తేశారు. మొత్తం మీద, ఆ బలగాలను మోహరించడానికి కొంచెం సమయం కావాలని స్పష్టం చేశారు.
ఈ చర్చ అంతా వైస్రాయ్ మౌంట్ బాటన్ ముందు జరిగింది. వెంటనే సర్దార్ పటేల్ పటేల్ ఆకిన్ లేక్‌తో ఇలా అన్నారు: “వివిధ కంటోన్మెంట్‌లకు సందేశం పంపండి. వారి వద్ద ఉన్న విడి దళాలను వెంటనే ఢిల్లీకి పంపించమనండి”. చివరికి అదే జరిగింది. అదే రోజు సాయంత్రం నుంచి బలగాలు రావడం ప్రారంభించాయి. మరుసటి రోజు నాటికి తగినంత మంది సైనికులు ఢిల్లీకి చేరుకున్నారు.
సైనిక చర్య
ఇక, సైనిక చర్య ప్రారంభమైంది. సంఘ్ సమాచారం ఇచ్చిన ఢిల్లీలోని అన్ని ప్రదేశాలపై ఏకకాలంలో దాడులు నిర్వహించి ఒక్కో ప్రదేశం నుంచి పెద్ద ఎత్తున ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. పహర్‌గంజ్ మసీదు, సబ్జీ మండి మసీదు, మెహ్రౌలీ మసీదు నుండి గరిష్ట సంఖ్యలో ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు.
చాలా చోట్ల, ముస్లింలు స్టెన్ తుపాకులు, బ్రెన్ తుపాకులతో పోరాడారు. కానీ వారు సైన్యం ముందు నిస్సహాయంగా మిగిలిపోయారు. సబ్జీ మండి ప్రాంతంలో ఉన్న ‘కక్వాన్ భవనం’లో అత్యంత భీకరమైన పోరాటం జరిగింది. ఈ ఒక్క భవనాన్ని స్వాధీనం చేసుకోవడానికి సైన్యానికి 24 గంటల కంటే ఎక్కువ సమయం పట్టింది.
మెహ్రౌలీ మసీదు నుండి స్టెన్ గన్‌లు, బ్రెన్ గన్‌లతో సైన్యం కూడా తలపడింది. నాలుగు నుంచి ఐదు గంటల నిరంతర పోరాటం తర్వాతే సైన్యం మసీదును స్వాధీనం చేసుకోగలిగింది. అప్పటి కాంగ్రెస్ అధ్యక్షుడు ఆచార్య కృపలానీ ప్రకారం:
“ముస్లింలు ఆయుధాలు సేకరించారు. వారి ఇళ్లలో సోదాలు చేయగా బాంబులు, మారణాయుధాలు, మందుగుండు సామాగ్రి లభ్యమయ్యాయి. స్టెన్ గన్‌లు, బ్రెన్ గన్‌లు, మోర్టార్లు, వైర్‌లెస్ ట్రాన్స్‌మిటర్లు పెద్దఎత్తున దొరికాయి. వీటిని రహస్యంగా తయారు చేస్తున్న ఫ్యాక్టరీలు కూడా పట్టుబడ్డాయి. చాలా చోట్ల భీకర పోరాటాలు జరిగాయి. ఈ ఆయుధాలను బహిరంగంగా ఉపయోగించారు”.
“పోలీసుల ఆధిపత్యం ముస్లింలదే. దీంతో అల్లర్లను అణచివేయడంలో ప్రభుత్వం చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చింది. వీరిలో చాలా మంది పోలీసులు తమ యూనిఫారాలు, ఆయుధాలతో పారిపోయి తిరుగుబాటుదారులతో చేరారు. మిగిలిన వారి విధేయత కూడా సందేహాస్పదంగా ఉంది. ప్రభుత్వం ఇతర ప్రావిన్సుల నుండి పోలీసులను, సైన్యాన్ని పిలవాల్సి వచ్చింది”. (కృపలానీ, గాంధీ, పేజీ 292-293)
ముస్లిం ప్రభుత్వ అధికారుల ప్రణాళికలు
ఢిల్లీని పట్టుకోవాలని ప్లాన్ వేసిన ఈ వ్యక్తులు ఎవరు? వాళ్ళు మామూలు మనుషులు కాదు. వారిలో సీనియర్ ముస్లిం ప్రభుత్వ అధికారులు ఉన్నారు. వీరిపై భారత ప్రభుత్వం గొప్ప విశ్వాసం కలిగి ఉంది. వారిలో ఆ సమయంలో ఢిల్లీలోని సీనియర్ పోలీసు అధికారులు, ఢిల్లీ విశ్వవిద్యాలయ సీనియర్ అధికారులు ముస్లింలు ఉన్నారు.
ఈ కుట్రకు సంబంధించిన ప్రణాళిక గురించి ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా ఆలోచించి రాసి ఆ రాత పత్రాలను యూనివర్సిటీలోని ఓ సీనియర్ అధికారి నివాసంలో భద్రంగా భద్రపరిచారు. ఆ రోజుల్లో, ముస్లింలుగా నటిస్తూ ముస్లిం అధికారులపై గూఢచర్యం చేస్తున్న ఆర్‌ఎస్‌ఎస్ స్వయంసేవక్ లు ఈ విషయం తెలుసుకుని ఆర్‌ఎస్‌ఎస్ అధికారులకు సమాచారం అందించారు.
ఆర్ఎస్ఎస్ అధికారులు ఈ పథకంకు సంబంధించిన పత్రాలను పొందే బాధ్యతను ఖోస్లా అనే స్వయంసేవక్ కు అప్పగించారు. ఖోస్లా తగినంతమంది స్వయంసేవక్ ల బృందాన్ని సిద్ధం చేసుకున్నారు. వారందరూ ముస్లిం వేషధారణలో రాత్రికి విశ్వవిద్యాలయ అధికారి నివాసానికి చేరుకున్నారు. అక్కడ ముస్లిం నేషనల్ గార్డ్ కార్మికులు కాపలాగా ఉన్నారు.
ఖోస్లా వారికి ‘వలైకుమ్ అస్సలామ్’ అని పలకరిస్తూ, “మేము అలీఘర్ నుండి వచ్చాము. ఇప్పుడు ఇక్కడ కాపలాగా ఉండటం మా బాధ్యత. మీరు వెళ్లి పడుకోండి.” అంటూ వారిని పంపించివేశారు. ఖోస్లా మనుషులు ఆ భవనం నుండి ఆ పత్రాలను తీసుకొని ఓ ట్రక్కులో వేసి తీసుకెళ్లారు. ఆ కాగితాలు బయటకు తీసి చూడగానే అందరూ ఉలిక్కిపడ్డారు.
ఆ రోజుల్లో న్యూఢిల్లీలోని పార్లమెంట్ సభ్యుల బంగ్లాలలో ఒకదానిలో రాత్రిపూట కొంతమంది స్వచ్ఛంద ప్రభుత్వ అధికారుల సమావేశం నిర్వహించారు. ఆ పేపర్లలో నమోదు చేసిన దాని ప్రకారం ఢిల్లీని స్వాధీనం చేసుకునే ప్రణాళిక గురించి చర్చించారు. ఈ చర్చ నుండి, ఈ ప్రణాళిక చాలా పెద్దది, విస్తృతమైనది అని స్పష్టమైనది. సంఘ్ స్థాయిలో తాము దానిని విఫలం చేయలేమని, సైన్యం మాత్రమే దానిని తిప్పికొట్టగలదని గ్రహించారు.
కాబట్టి ఈ విషయాన్ని సర్దార్ పటేల్‌కు తెలియజేయాలి. దీంతో ఆ సమావేశంలోని ఇద్దరు, ముగ్గురు కార్యకర్తలు నేరుగా రాత్రి ఒంటి గంట ప్రాంతంలో సర్దార్ పటేల్ బంగ్లాకు వెళ్లి ఆయన్ను నిద్రలేపి ఈ సమాచారం అంతా ఇచ్చారు. పటేల్, “ఇది నిజం కాకపోతే?” అని ప్రశ్నించారు. “మమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టి, మీ ఇంటెలిజెన్స్ డిపార్ట్‌మెంట్‌తో విచారణ చేయించండి. ఇది నిజం కాదని రుజువైతే మమ్మల్ని జైలులో పెట్టండి” అని కార్యకర్తలు బదులిచ్చారు. దానితో తక్షణమే సర్దార్ పటేల్ రంగంలోకి దిగారు.
ఒకసారి ఊహించండి. సర్దార్ పటేల్ సంఘ్ కార్యకర్తలు అందించిన ఈ సమాచారాన్ని విశ్వసించకపోతే లేదా అకిన్ లేక్ మాటలకు ప్రభావితమై వెంటనే చర్యకు ఉపక్రమించకుండా ఉంటె? అప్పుడు భారత ప్రభుత్వం హడావిడిగా లక్నో, కలకత్తా లేదా ముంబైలలో తన రాజధానిని నిర్మించవలసి వచ్చేది. ఫలితంగా, ఈ రోజు పాకిస్తాన్ సరిహద్దు ఖచ్చితంగా ఢిల్లీ వరకు విస్తరించి ఉండేది. 1947లో ముస్లిం అధికారుల నేతృత్వంలోని ఈ దారుణమైన తిరుగుబాటు నుండి స్వయంసేవకులు ఢిల్లీని ఆ విధంగా రక్షించారు.
సౌజన్యం: పుస్తకం: “విట్నెస్ ఆఫ్ పార్టిషన్ ఇండియా” (పేజీ నెం. 92-93)
More Stories
ప్రొటోకాల్ ఉల్లంఘనలపై బీజేపీ ఎమ్మెల్యేల నిరసన
చెన్నమనేని జర్మనీ పౌరుడే…తేల్చిచెప్పిన హైకోర్టు
చైనా జలవిద్యుత్ డ్యామ్ లతో 12 లక్షల మంది టిబెటన్ల నిరాశ్రయం