ప్రస్తుతం ఈ రైళ్లు అక్టోబరు 1 నుంచి నవంబర్ 30 వరకు వేర్వేరు తేదీల్లో నడుపుతున్నట్లు తెలిపారు. ప్రజల పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చడానికి రాబోయే రోజుల్లో మరిన్ని ప్రత్యేక రైళ్లను ప్రకటించాలని దక్షిణ మధ్య రైల్వే యోచిస్తున్నట్లు తెలిపారు. ప్రయాణికుల సౌకర్యార్థం అదనపు బుకింగ్ కౌంటర్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
రిజర్వ్ చేయని కోచ్‌ల ద్వారా ప్రయాణించాలనుకునే వారి కోసం జనరల్ కౌంటర్ల వద్ద క్యూలో నిలబడకుండా తమ టిక్కెట్లను మొబైల్ యాప్‌లో యూటీఎస్ ద్వారా కొనుగోలు చేసుకొనే అవకాశం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. దక్షిణ మధ్య రైల్వే అధికార పరిధిలోని హైదరాబాద్, సికింద్రాబాద్, తిరుపతి స్టేషన్లతో సహా మొత్తం రైల్వే వ్యవస్థలో 150కి పైగా రైల్వే స్టేషన్లలో ప్రయాణికుల కోసం “నవరాత్రి స్పెషల్ థాలి” పేరుతో ప్రత్యేక భోజన సదుపాయం అందుబాటులోకి తెచ్చినట్లు వెల్లడించారు.
ప్రయాణికులు ఈ రుచికరమైన థాలిని ఐఆర్సీటీసీ మొబైల్ యాప్, రైల్వే అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో ఆర్డర్ చేసుకొనవచ్చని తెలిపారు. పండుగ సెలవులతో తెలుగు రాష్ట్రాలలోని ప్రధాన స్టేషన్లలో భారీగా రద్దీ పెరిగింది. సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లితో పాటు ఇతర స్టేషన్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. వెయిటింగ్ లిస్ట్ వందల సంఖ్యలో దర్శనమిస్తోంది.
ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ వైపునకు వెళ్లే రైళ్లలో నిలబడి వెళ్లేందుకు సైతం ఇబ్బందులు పడుతున్నామని ప్రయాణికులు వాపోతున్నారు. జనరల్ బోగీల్లోకి కనీసం వెళ్లే పరిస్థితి ఉండటం లేదంటూ ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రయాణికుల డిమాండ్ల దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే భారీగా ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది.
More Stories
పూర్వ క్షేత్ర సంఘచాలక్ జస్టిస్ పర్వతరావు కన్నుమూత
తెలంగాణాలో వేదిక్ యూనివర్సిటీకి సన్నాహాలు
ఓయూ ఈఎంఆర్‌సీకి అంతర్జాతీయ గుర్తింపు