టాటా గ్రూప్ లోని విమానయాన సంస్థల్లో రెండు విమానయాన సంస్థలు విలీనమయ్యాయి. ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌లో ఏఐఎక్స్ కనెక్ట్ విలీన ప్రక్రియ విజయవంతంగా పూర్తయ్యింది. పౌర విమానయాన నియంత్రణ సంస్థ (డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ – డీజీసీఏ) ఈ విషయాన్ని మంగళవారం వెల్లడించింది.
అక్టోబర్ 1 నుంచి ఏఐఎక్స్ కనెక్ట్ కింద నమోదైన విమానాలన్నీ ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ పేరుతో నడవనున్నాయి. విలీన ప్రక్రియ పూర్తికావడంతో విలీనం అనంతర కార్యకలాపాలను పరిశీలిస్తామని డీజీసీఏ తెలిపింది. అదేవిధంగా ఎయిరిండియా – విస్తారా విలీన ప్రక్రియ జరుగుతోందని పేర్కొంది.
ఎయిరిండియా, ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్, విస్తారా, ఏఐఎక్స్ కనెక్ట్.. ఈ నాలుగు టాటా గ్రూపునకు చెందిన విమానయాన సంస్థలే. ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌లో ఏఐఎక్స్ కనెక్ట్‌ను, ఎయిరిండియాలో విస్తారాను విలీనం చేయాలని టాటా గ్రూప్ నిర్ణయించింది. ప్రస్తుతం ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్, ఏఐఎక్స్ కనెక్ట్ విలీనం పూర్తయ్యింది.ప్రస్తుతం ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్, ఏఐఎక్స్ కనెక్ట్‌లో రోజువారీగా సుమారు 400 విమాన సర్వీసులు నడుస్తున్నాయి. విలీన సంస్థలో సుమారు ఆరు వేల మంది ఉద్యోగులు ఉన్నారు. ఇక ఎయిరిండియాలో విస్తారా విలీన ప్రక్రియ నవంబర్ నాటికి పూర్తయ్యే అవకాశం ఉంది. ఈ విలీన ప్రక్రియ దేశంలో పెరుగుతున్న విమాన ప్రయాణ డిమాండ్‌ను కొంత మేర తగ్గించగలదు. విస్తారా-ఎయిరిండియాలో విలీన ప్రక్రియ కూడా పూర్తయితే మరిన్ని సేవలు అందుబాటులోకి రానున్నాయి.
More Stories
రెండు రైతు సంక్షేమ పథకాలకు రూ.లక్ష కోట్లు
స్టాక్ మార్కెట్లలో రూ.11లక్షల కోట్ల సంపద ఆవిరి
చైనా సీసీటీవీ కెమెరాలు, ఇతర నిఘా పరికరాలపై ఆంక్షలు!