* ఏపీకి రూ.1036 కోట్లు, తెలంగాణకు రూ.416 కోట్లు
కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ 14 వరద బాధిత రాష్ట్రాలకు రాష్ట్ర విపత్తు స్పందన నిధి (ఎస్‌డిఆర్‌ఎఫ్) నుంచి కేంద్రం వాటాగా, జాతీయ విపత్తు స్పందన నిధి (ఎన్‌డిఆర్‌ఎఫ్) నుంచి అడ్వాన్స్‌గా రూ. 5858.60 కోట్లు విడుదల చేసినట్లు ఢిల్లీలో అధికారులు వెల్లడించారు.
ఆ నిధుల్లో మహారాష్ట్రకు రూ. 1492 కోట్లు, ఆంధ్ర ప్రదేశ్‌కు రూ. 1036 కోట్లు, తెలంగాణకు రూ. 416.80 కోట్లు, అస్సాంకు రూ. 716 కోట్లు, బీహార్‌కు రూ. 655.60 కోట్లు, గుజరాత్‌కు రూ. 600 కోట్లు, పశ్చిమ బెంగాల్‌కు రూ. 468 కోట్లు విడుదల చేసినట్లు ఒక అధికార ప్రకటన తెలియజేసింది. అత్యధికంగా మహారాష్ట్రకు రూ.1492 కోట్లు ప్రకటించింది.
హిమాచల్ ప్రదేశ్, కేరళ, మణిపూర్, త్రిపుర, సిక్కిం, మిజోరామ్, నాగాలాండ్ రాష్ట్రాలకు కూడా కేంద్రం నిధులు విడుదల చేసింది. నైరుతి రుతుపవనాల సమయంలో భారీ వర్షాలు, వరదలు, కొండచరియలు విరిగిపడిన ఘటనల వల్ల ఆ రాష్ట్రాలు నష్టపోయాయి. నైరుతి రుతుపవనాల ప్రభావంతో భారీ వర్షాలు, వరదలు, కొండచరియలు విరిగిపడటం వల్ల 14 రాష్ట్రాలు వరద ప్రభావానికి గురయ్యారు.
కేంద్ర బృందాలు పర్యటించి ఇచ్చిన ప్రాథమిక నివేదిక ఆధారంగా అడ్వాన్స్‌గా నిదులు విడుదల చేస్తున్నట్టు హోం శాఖ తాజా ప్రకటనలో పేర్కొంది. ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో, కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా మార్గదర్శకత్వంలో మోదీ ప్రభుత్వం ప్రజల ఇక్కట్లు తీర్చేందుకు ప్రకృతి వైపరీత్యాల బాధిత రాష్ట్రాలతో భుజం భుజం కలిపి సాగుతోందని ఆ ప్రకటన పేర్కొంది.
More Stories
రెండు రైతు సంక్షేమ పథకాలకు రూ.లక్ష కోట్లు
స్టాక్ మార్కెట్లలో రూ.11లక్షల కోట్ల సంపద ఆవిరి
చైనా సీసీటీవీ కెమెరాలు, ఇతర నిఘా పరికరాలపై ఆంక్షలు!