నిర్మలా సీతారామన్‌కు హైకోర్టులో ఊరట

నిర్మలా సీతారామన్‌కు హైకోర్టులో ఊరట
ఎన్నికల బాండ్ల కొనుగోలు చేయాలంటూ బెదిరింపుల కేసులో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌తో పాటు పలువురు బీజేపీ అగ్రనేతలకు సోమవారం కర్ణాటక హైకోర్టు భారీ ఊరట నిచ్చింది. ఈ కేసు విచారణను నిలిపివేస్తూ హైకోర్టు సోమవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. 
 
ఎన్నికల బాండ్ల కొనుగోలు చేసేందుకు బెదిరింపులకు పాల్పడ్డారనే ఆరోపణల నేపథ్యంలో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌, పలువురు బీజేపీ అగ్రనేతలతోపాటు ఈడీ ఉన్నతాధికారులపై బెంగళూరులోని తిలక్ నగర్‌ పోలీస్‌‌ స్టేషన్‌లో కేసు నమోదు చేయాలని ప్రత్యేక కోర్టు ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో తిలక్ నగర్ పీఎస్‌లో వీరిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
 
ఎన్నికల బాండ్లు కొనుగోలు చేసేందుకు వివిధ సంస్థలను బెదిరించినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌, బీజేపీ అగ్రనేతలు, పలువురు ఈడీ ఉన్నతాధికారులపై ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ ఆరోపణల నేపథ్యంలో వారిపై జ్జానధికార్ సంఘర్ష పరిషత్ సంస్థ సహా అధ్యక్షుడు అదర్ష్ అయ్యార్ తిలక్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 
 
ఐపీసీలోని 120బీ, 384 సెక్ష‌న్ల ప్ర‌కారం కుట్ర‌పూరితంగా వ‌సూళ్ల‌కు పాల్ప‌డిన‌ట్లు ఆరోపించారు. కానీ ఆ సెక్ష‌న్ల కింద ఫిర్యాదుదారుడు న‌మోదు చేసిన కేసు చెల్ల‌ద‌ని కోర్టు తెలిపింది.  దాంతో గతేడాది ఏప్రిల్‌లో చట్టసభ ప్రతినిధుల కోర్టును ఆయన ఆశ్రయించి పిటిషన్ దాఖలు చేశారు. కేంద్ర మంత్రి సీతారామ‌న్‌తో పాటు బీజేపీ నేత‌ల‌పై న‌మోదు అయిన కేసును సీఐడీకి అప్ప‌గించాల‌ని బెంగుళూరు పోలీసులు భావిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో హైకోర్టు ఆ కేసులో స్టే ఇస్తూ మ‌ధ్యంత‌ర ఉత్త‌ర్వులు జారీ చేసింది.