
ఈ సినిమా నిజానికి సెప్టెంబర్ 6న విడుదల కావలసింది. కానీ సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ లభించనందున ఈ సినిమా విడుదలకు బ్రేక్ పడింది. ఈ సినిమాను స్వయంగా కంగనా రనౌత్ నిర్మాత, దర్శకత్వం వహించి నటించి తీసింది. ఈ సినిమాలో కంగనా రనౌత్ మాజీ ప్రధాని ఇందిరా గాంధీ పాత్రలో నటించింది. శిరోమణి అకాలీదళ్ సహా కొన్ని సిక్కు సంస్థలు ఈ సినిమా మీద ఆక్షేపణలు తెలిపాయి.
తమ వర్గాన్ని ఈ సినిమాలో తప్పుగా చిత్రీకరించారని వారు అంటున్నారు. దాంతో సిబిఎఫ్ సి ఈ సినిమాకు సర్టిఫికెట్ జారీ చేయకుండా నిలిపి ఉంచింది. కాగా ఈ సినిమాపై సెప్టెంబర్ 25లోగా నిర్ణయం తీసుకోవాలని కోర్టు సిబిఎఫ్ సిని ఆదేశించింది. ఈ సినిమాకు సహ నిర్మాత అయిన జీ ఎంటర్ టైన్ మెంట్ ఎంటర్ ప్రైజెస్ హైకోర్టును ఆశ్రయించి సిబిఎఫ్ సి సర్టిఫికెట్ జారీ అయ్యేలా ఆదేశాలివ్వాలని కోరింది.
సిబిఎఫ్ సి తరఫున అభినవ్ చంద్రచూడ్, జీ ఎంటర్ టైన్మెంట్ తరఫున శరణ్ జగత్యానీ తమ వాదనలు చేశారు. చివరికి కట్స్ తో విడుదల చేసినట్టయితే సర్టిఫికేట్ ఇస్తామని సెన్సార్ బోర్డు అంటోంది. అయితే జీ తరఫు న్యాయవాది కట్స్ కు అంగీకరించాలా వద్దా అనేది నిర్ణయించుకోవడానికి సమయం కోరారు.
More Stories
దౌర్జన్యాలు చేసే వారికి గుణపాఠం నేర్పడమే హిందూ మతం
ఆర్మీ హిట్ లిస్ట్ లో 14 మంది ఉగ్రవాదులు!
విద్యార్థి వీసాపై పాక్ కు వెళ్లి శిక్షణ తీసుకున్న ఆదిల్ థోకర్!