కాగా, షిండే శివసేన (7), అజిత్ పవార్ ఎన్సీపీ (1) కంటే బీజేపీకి ఎక్కువ సీట్లు వచ్చాయని, 9 సీట్లు గెలుచుకున్నట్లు దేవేంద్ర ఫడ్నవీస్ తెలిపారు. విడిపోయిన ఆ రెండు పార్టీలు ఒక విధంగా కొత్త పార్టీలని చెప్పారు. స్థిరమైన ఓటర్లు లేకపోవడం లోక్‌సభ ఎన్నికల్లో ఆ రెండు పార్టీలకు కష్టంగా మారిందని తెలిపారు. ‘ఎన్సీపీతో పొత్తు పెట్టుకోవడం బీజేపీ ‘కోర్ ఓటర్ బేస్’కు నచ్చలేదు’ అని మాజీ ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
మరోవైపు ప్రస్తుతం రాజకీయంగా రాజీలు అవసరమన్నది 80 శాతం బీజేపీ ఓటర్లు నమ్ముతున్నారని దేవేంద్ర ఫడ్నవీస్ తెలిపారు. అలాగే ప్రస్తుతం షిండే శివసేన, అజిత్ పవార్ ఎన్సీపీలో కూడా ఓటర్ల శాతం స్థిరత్వానికి చేరిందని చెప్పారు. ఈ నేపథ్యంలో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఈ సమస్యలు పునరావృతం కావని ఆశాభావం వ్యక్తం చేశారు.

More Stories
బెంగాల్లో భారీగా 90 శాతం పోలింగ్ నమోదు
పశ్చిమ బెంగాల్లో మళ్లీ దీదీదే అధికారం?
అస్సాంలో హ్యాట్రిక్ దిశగా బీజేపీ… పుదిచ్చేరిలో మళ్లీ ఏన్డీఏనే