హత్యాచారంలో నిందితుడి ప్రమేయం ఉందని తెలిసినా అతడికి సంబంధించిన దుస్తులను ఘటన జరిగిన 2 రోజుల తర్వాత స్వాధీనం చేసుకున్నారని ఆరోపించింది. దీంతో ఆధారాల సేకరణ కష్టంగా మారిందని స్పష్టం చేసింది. ఆర్జీ కర్ వైద్యకళాశాలకు చెందిన ట్రైనీ డాక్టర్ హత్యాచారం కేసును విచారిస్తున్న సీబీఐ పలు కీలక విషయాలను వెల్లడించింది.
నిందితుడు సంజయ్ రాయ్‌కు చెందిన దుస్తులను స్వాధీనం చేసుకోవడంలో కోల్‌కతా పోలీసులు తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆరోపించింది. హత్యాచారంలో నిందితుడి ప్రమేయం ఉందని తెలిసినా, అతనికి సంబంధించిన దుస్తులు, వస్తువులను ఘటన జరిగిన రెండు రోజుల తర్వాత స్వాధీనం చేసుకున్నారని తెలిపింది.
ఘటన జరిగిన రోజే దుస్తులు, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకొని ఉంటే బలమైన సాక్ష్యాధారాలు దొరికే అవకాశం ఉండేదని పేర్కొంది. అప్పుడు కేసులో కొంత వరకు పురోగతి కనిపించేదని వెల్లడించింది. ఆర్జీ కర్ వైద్యకళాశాల మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్, తాలా పోలీసు స్టేషన్ ఎస్‌హెచ్‌ఓ అభిజిత్ మోండల్‌లు సాక్ష్యాలను చెరిపివేసేందుకు ప్రయత్నించారని సీబీఐ అధికారులు ఆరోపిస్తున్నారు.
సందీప్ ఘోష్, అభిజిత్ మోండల్‌లకు నిందితుడితో సంబంధాలు ఉన్నాయా? అనే కోణంలో సీబీఐ విచారణ చేస్తోంది. తాలా పోలీసు స్టేషన్, నేరం జరిగిన ప్రదేశం, ఆర్జీ కర్ మెడికల్ కాలేజీలోని సీసీటీవీ కెమెరాలను సీబీఐ పరిశీలిస్తోందని ఓ అధికారి తెలిపారు. నిందితుడికి, ఇద్దర సహ నిందితుల మధ్య ఫోన్ కాల్స్ ఏమైనా జరిగియా? అనే కోణంలోనూ విచారణ జరుగుతోందని ఆయన వెల్లడించారు.
బాధితురాలి మృతదేహానికి శవపరీక్ష పూర్తి అవ్వగానే తాలా పోలీసు స్టేషన్ ఎస్‌హెచ్‌ఓ అభిజిత్ మోండల్ హడావుడిగా అంత్యక్రియలు జరిపించారని చెప్పారు. మరోసారి శవపరీక్ష నిర్వహించాలని బాధితురాలి తల్లిదండ్రులు కోరినా పట్టించుకోలేదని తెలిపారు. తొలుత ఈ కేసును బంగాల్ పోలీసులు దర్యాప్తు చేశారు. అయితే ఆ విచారణపై అనుమానాలు వ్యక్తమైన నేపథ్యంలో కలకత్తా హైకోర్టు ఆ కేసును సీబీఐకి బదిలీ చేసింది.
More Stories
సచివాలయంపై నుంచి దూకేసిన డిప్యూటీ స్పీకర్
తిరుమల లడ్డూ వివాదంలో ప్రత్యేక సిట్ దర్యాప్తు
జాతీయ స్థాయిలో తాజా పౌరుల రిజిస్టర్ అవసరం