బుల్డోజర్ న్యాయం పేరిట దేశంలో చాలా చోట్ల అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నారు. ముఖ్యంగా ఉత్తర్ ప్రదేశ్‌లో ఈ కూల్చివేతలు ప్రధానంగా సాగుతున్నాయి. తాజాగా ఈ బుల్డోజర్ న్యాయం చేయడంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా అత్యున్నతస్థాయి ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది.
నేరగాళ్ల ఇళ్లు, ప్రైవేటు ఆస్తులపైకి బుల్డోజర్లను నడిపించే విషయంలో బాధితులకు ఉపశమనం ఇవ్వడం కోసం ఈ ఆపరేషన్ చేపట్టారు. ఈ మార్గదర్శకాల జారీపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. అనధికారికంగా జరిపే ఇటువంటి బుల్డోజర్ చర్యలను అక్టోబర్ 1వ తేదీ వరకు నిలిపివేయాలని పేర్కొంది.
ఆక్రమణల తొలగింపు ఆగితే ఈ చర్యలు ఆలస్యం అవుతాయని ప్రభుత్వ తరఫు నుంచి వాదనలు రాగా వచ్చే విచారణ వరకు మీ చర్యలను ఆపమని కోరినంత మాత్రాన కొంపలేం మునిగిపోవు అంటూ సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ నెలలో ఇప్పటికే రెండు సార్లు వివిధ రాష్ట్రాలు చేపట్టిన ‘బుల్డోజర్ చర్యల’పై న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
హీరోయిజంగా చూపే యత్నం చేయవద్దని హెచ్చరించింది. తమ అనుమతులు లేకుండా ఎటువంటి కూల్చివేతలు చేపట్టొద్దని సూచించింది. దీనిపై సుప్రీంకోర్టు దీనిపై ఎన్నికల కమిషన్‌కు కూడా నోటీసులు జారీ చేస్తామని చెప్పింది. మహారాష్ట్ర, ఝార్ఖండ్, జమ్మూ కశ్మీర్, హర్యానాలో అసెంబ్లీ ఎన్నికలు ఉండటంతో ఈసీకి నోటీసీలు ఇస్తామని చెప్పడం ప్రాధాన్యం సంతరించుకొంది.
బుల్డోజర్ న్యాయంపై వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో దాఖలు చేసిన ప్రధాన పిటిషనర్‌గా జామత్ ఉలేమా హింద్ వ్యవహరిస్తోంది. కూల్చివేతలకు ముందు కనీసం 40-60 రోజుల ముందుగా నోటీసులు జారీ చేయాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఇక యూపీ ప్రభుత్వం తరఫున సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు.
More Stories
వైవాహిక అత్యాచారాన్ని నేరంగా పరిగణించలేం
ఐదేళ్లలో 200 రైల్వే ప్రమాదాలు .. 351 మంది మృతి
ఖైదీలలో కులవివక్ష పట్ల సుప్రీంకోర్టు ఆగ్రహం