దేశంలో నిఫా వైరస్ కలకలం సృష్టిస్తున్నది. నిఫా వైరస్‌తో 23 ఏండ్ల వ్యక్తి మరణించటంతో, కేరళలోని మలప్పురం జిల్లాలో తీవ్ర భయాందోళన నెలకొన్నది. వైరస్ ప్రభావిత ప్రాంతాల్లో స్కూల్స్, కాలేజీలు, అంగన్‌వాడీ కేంద్రాలు, సినిమా థియేటర్లను ప్రభుత్వం మూసేయించింది.
ప్రస్తుతం జిల్లాలో ముగ్గురు వ్యక్తులు నిఫా వైరస్ లక్షణాలతో దవాఖానలో చికిత్స పొందుతున్నారు. దీంతో పలు వార్డులను కంటైన్‌మెంట్ జోన్లుగా ప్రకటించారు. ఇక్కడి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. అందరూ మాస్క్‌లు తప్పనిసరిగా ధరించాలని, జనం ఎక్కడా గుమికూడరాదంటూ జిల్లా కలెక్టర్ వీఆర్ వినోద్ నిషేధాజ్ఞలు జారీచేశారు.
వైరస్ వ్యాప్తికి సంబంధించి కాంటాక్ట్ ట్రేసింగ్, పర్యవేక్షణ, ఫీవర్ సర్వే కోసం ఆరోగ్య శాఖ 16 కమిటీలను ఏర్పాటుచేసింది. మిలాద్-ఉన్-నబీ సందర్భంగా సోమవారం తలపెట్టిన ఊరేగింపును రద్దు చేసుకోవాల్సిందిగా మలప్పురం జిల్లా కలెక్టర్ మసీదు కమిటీలను కోరారు. దుకాణాలు, షాపింగ్ మాల్స్ ఉదయం 10 నుంచి రాత్రి 7 గంటల వరకు తెరిచి ఉంచుతున్నారు.
ఈ క్రమంలో వైరస్‌ని అదుపులో చేసేందుకు అధికారులు ముందుజాగ్రత్త చర్యలు చేపట్టారు. మలప్పురం జిల్లాలో మరోసారి మాస్క్‌లను తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు మాస్క్ నిబంధన కొనసాగుతుందని అధికారులు తెలిపారు. అయితే, పుణేలోని వైరాలజీ నమూనాలను పంపగా నిఫా పాజిటివ్‌గా తేలిందని ఆరోగ్యశాఖ మంత్రి వీణాజార్జ్ తెలిపారు.
మృతుడితో సన్నిహితంగా ఉన్న వ్యక్తులను గుర్తించేందుకు వైద్య ఆరోగ్యశాఖ, రెవెన్యూ అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఇక కేరళలో ఇప్పటివరకు 2018 నుంచి ఆరు కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం 150 మందిని అబ్జర్వేషన్‌లో పెట్టగా.. ఇద్దరిలో జ్వరం లక్షణాలు ఉన్నట్లు సమాచారం. నిపా వెలుగు చూసిన నేపథ్యంలో ప్రోటోకాల్ మేరకు కఠిన నిబంధనలు అమలులోకి తీసుకువచ్చారు.
తిరువలి పంచాయతి పరిధిలో ఉన్న నాలుగు సినిమా థియేటర్లు, విద్యాసంస్థలను మూసివేయాల్సిందిగా ఆదేశించారు. ఒకేచోట జనం గుమిగూడొద్దని అధికారులు తెలిపారు. నిపా వైరస్ జంతువుల నుంచి మనుషులకు సోకుతుంది.
ఇది జునోటిక్ వైరస్. ఈ వైరస్‌ను తొలిసారిగా 1999లో గుర్తించారు. వైరస్ ఫ్రూట్ బ్యాట్స్‌లో ఎక్కువగా కనిపిస్తుంది. వాటిపై వైరస్ ఎలాంటి ప్రభావం చూపదు. కానీ.. బ్యాట్స్ పండ్లను కొరికిన సమయంలో వాటిని జంతువులు తిన్న సందర్భాల్లో వైరస్ ప్రవేశిస్తుంది. జంతువుల నుంచి మనుషులకు సోకేందుకు అవకాశం ఉంటుంది.
More Stories
వైవాహిక అత్యాచారాన్ని నేరంగా పరిగణించలేం
ఐదేళ్లలో 200 రైల్వే ప్రమాదాలు .. 351 మంది మృతి
ఖైదీలలో కులవివక్ష పట్ల సుప్రీంకోర్టు ఆగ్రహం