చైనాలో బెబింకా టైఫూన్ బీభత్సం సృష్టిస్తోంది. సోమవారం ఉదయం 25 మిలియన్ జనాభా గల మెగా సిటీ షాంఘై నగరాన్ని ఈ టైఫూన్ తాకడంతో ప్రజాజీవితం అస్తవ్యస్తమైంది. గత 75 ఏళ్లలో ఈ నగరాన్ని తాకిన తీవ్ర తుపాను ఇదేనని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. గంటకు 151 కిమీ వేగంతో తుపాన్ గాలులు వీస్తుండడంతో ఆదివారం రాత్రి నుంచి అక్కడి పుడోంగ్, హాంగ్‌కియావో ఈ రెండు విమానాశ్రయాల నుంచి వందల విమానాల సర్వీసులు రద్దయ్యాయి.
ఈ నగరాన్ని తుపాన్లు నేరుగా తాకడం అరుదు. 1949లో టైఫూన్ గ్లోరియా తర్వాత షాంఘైను తాకిన తీవ్ర తుపాను ఇదే. దీంతో ఆదివారం రాత్రి నుంచి అక్కడి రెండు విమానాశ్రయాల నుంచి రాకపోకలు సాగించాల్సిన వందల విమానాలు రద్దయ్యాయి. పలు రైళ్లు నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. పలు పార్కులు, వినోద ప్రదేశాలను తాత్కాలికంగా మూసివేశారు.
షాంఘై డిస్నీ రిసార్ట్‌తో సహా నౌకలను రీకాల్ చేశారు. పర్యాటక ప్రదేశాలను ఆదివారం మూసివేశారు. తూర్పు చైనాలో ఈదురుగాలులు, భారీ వర్షాలు కురుస్తాయని చైనా వాతావరణ యంత్రాంగం ఆదివారం మధ్యాహ్నం టైఫూన్ రెడ్ అలర్ట్ ప్రకటించింది.
ఈ ఏడాది చైనాను తాకిన అతి భీకర తుపాన్లలో ఇది 13 వది. షాంఘైలో 4,14,000 మందిని ఆదివారం సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
మరోవైపు చైనాలోని హైనాన్ ప్రావిన్స్‌ను యాగి తుపాను కలవరం రేపింది. బలమైన ఈదురుగాలులు, భారీ వర్షాలు కురవడంతో విద్యుత్తు సరఫరాకు తీవ్ర అంతరాయం కలిగింది. సెల్‌ఫోన్‌లలో ఛార్జింగ్ అయిపోవడంతో డిజిటల్ చెల్లింపులకు ప్రజలు నానాతంటాలు పడ్డారు. అంధకారంలో గడిపారు. కనీసం నిత్యావసర సరకులను కూడా కొనుగోలు చేయలేని పరిస్థితులు ఎదుర్కొన్నారని పలు మీడియా కథనాలు వివరించాయి.
More Stories
గాజా హమాస్ అప్రకటిత ప్రధాని ముష్తాహాను చంపేశాం
2050 నాటికి అగ్రరాజ్యాలుగా భారత్, అమెరికా, చైనా
ఇజ్రాయెల్‌పై క్షిపణులతో విరుచుకుపడ్డ ఇరాన్