ట్రంప్ గోల్ఫ్ కోర్సులో కాల్పుల శబ్దం కచ్చితంగా వినిపించింది. ఓ వ్యక్తి తుపాకీతో కాల్పులు జరిపి, అనంతరం అక్కడి నుంచి ఎస్‌యూవీలో పారిపోయాడు. అనంతరం అతడిని లా ఎన్ఫోర్స్మెంట్ అధికారులు అరెస్ట్ చేశారు. అతడి పేరు ర్యాన్ వెస్లీ రౌత్ అని ఓ అధికారి తెలిపారు. దుండగుడి వద్ద రెండు బ్యాక్ ప్యాక్‌లు కంచెకు వేలాడుతూ కనిపించాయని, ఒక గో-ప్రో కెమెరా కూడా ఉందని స్థానిక అధికారులు తెలిపారు.
నార్త్ కరోలినా డిపార్ట్మెంట్ ఆఫ్ అడల్ట్ కరెక్షన్ ఆన్లైన్ రికార్డుల ప్రకారం.. డొనాల్డ్ ట్రంప్‌పై కాల్పులకు పాల్పడిన రౌత్ 2002లో సామూహిక విధ్వంసక ఆయుధాన్ని కలిగి ఉన్నాడన్న అంశంలో దోషిగా తేలాడు. ట్రంప్‌ను లక్ష్యంగా చేసుకునే కాల్పులు జరిగాయా? అనే కోణంలో విచారణ చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను రికార్డుల్లో పేర్కొనలేదు.
కానీ 2002 నాటి న్యూస్ అండ్ రికార్డ్ కథనం ప్రకారం అదే పేరుతో ఉన్న వ్యక్తి మూడు గంటల పాటు పోలీసులతో వాగ్వాదం చేసిన తర్వాత అరెస్టు అయ్యడు. మీడియా కథనం ప్రకారం ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర పోలీసులు అతడిని పట్టుకున్నారు. కానీ అతను గన్‌పై చేతులు వేసి, తర్వాత పక్కనే రూఫింగ్ బిజినెస్‌లోకి వెళ్లి దాకున్నాడు. అనంతరం అతడిని పోలీసులు పట్టుకున్నారు. సామూహిక విధ్వంసం సృష్టించే ఆయుధం అతడి దగ్గర ఉందని పోలీసులు అభియోగాలు మోపారు.
ఈ ఘటనపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్పందించారు. ‘ట్రంప్ సురక్షితంగా ఉన్నట్లు తెలిసింది. ఆయనపై హత్యాయత్నానికి పాల్పడేందుకు సిద్ధమైన అనుమానితుడు భద్రతా సిబ్బంది అదుపులో ఉన్నాడు. దీనిపై పూర్తిస్థాయి విచారణ చేపట్టాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశాం. మన దేశంలో రాజకీయ హింసకు చోటు లేదని పునరుద్ఘాటిస్తున్నా. ట్రంప్‌నకు అన్ని విధాలా కట్టుదిట్టమైన భద్రత కల్పించాలని భద్రతా సిబ్బందిని ఆదేశించా’ అని పేర్కొన్నారు. ట్రంప్ క్షేమంగానే ఉన్నట్లు తమకు సమాచారం అందిందని ఉపాధ్యక్షురాలు, డెమొక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి కమలా హారిస్ ఎక్స్ వేదికగా స్పందించారు.
More Stories
తిరుమల లడ్డూ వివాదంలో ప్రత్యేక సిట్ దర్యాప్తు
జాతీయ స్థాయిలో తాజా పౌరుల రిజిస్టర్ అవసరం
సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటు చేసి నిధులివ్వాలి