* తెలంగాణ రైతులకు కళ్ళు చెదిరే ఆదాయం
తెలంగాణలోని పామాయిల్ పంట వేసిన రైతులందరికీ భారీ ఊరట లభించింది. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విజ్ఞప్తితో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో తెలంగాణలోని పామాయిల్ రైతులకు కళ్లు చెరిదే ఆదాయం వచ్చే అవకాశం ఉంది. ముడి పామాయిల్ దిగుమతిపై పన్నును 5.5 శాతం నుంచి ఏకంగా 27.5 శాతానికి పెంచింది కేంద్రం.
ఈ సందర్భంగా కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్‌కు రాష్ట్ర పామాయిల్ రైతుల తరఫున మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు కృతజ్ఙతలు తెలిపారు. గతంల ముడి పామాయిల్ దిగుమతిపై సుంకం ఎత్తివేయడంతో ఆయిల్‌పామ్ గెలల ధర పూర్తిగా పడిపోయింది. దీంతో పామాయిల్ పంట వేసిన రైతులు తీవ్ర నిరాశ చెందారు.
దీంతో కొత్తగా పంట సాగు చేయాలనుకున్న రైతులు అంతగా ఆసక్తి చూపించలేదు. ఈ అంశాలను పరిగణలోకి తీసుకుని రైతులకు అధిక ధర అందించటంతో పాటు తెలంగాణలో పామాయిల్ సాగు లాభసాటిగా మార్చాలని నిర్ణయించుకున్నట్లు మంత్రి తుమ్మల వివరించారు. అంతేకాకుండా కొత్త రైతులను కూడా పామాయిల్ సాగువైపు ప్రోత్సహించాలని నిర్ణయించుకున్నట్టు తెలిపారు.
ఈ ఉద్దేశంతోనే ముడి పామాయిల్‌పై దిగుమతి సుంకం తిరిగి విధించి, దేశీయ పామాయిల్ రైతులను ఆదుకునేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసినట్టు తెలిపారు.భారీ వర్షాల కారణంగా పోటెత్తిన వరదలతో తీవ్ర నష్టం వాటిల్లిన సమయంలో తెలుగు రాష్ట్రాల్లో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహన్ పర్యటించిన విషయం తెలిసిందే.
ఆ సమయంలో శిరాజ్ సింగ్ చౌహాన్‌తో మంత్రి తుమ్మలతో పాటు ఆయిల్‌పామ్ రైతులు కూడా ఈ విషయంపై విజ్ఞప్తులు చేశారు. దీంతో కేంద్రం ముడి పామాయిల్ దిగుమతిపై పన్నును 5.5 నుంచి 27.5 శాతానికి పెంచుతూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం కేంద్రం తీసుకున్న నిర్ణయంతో ఆయిల్‌పామ్ గెలల ధర 1500 నుంచి 1700 వరకు పెరిగితే టన్ను 16500 దాటే అవకాశం ఉందని మంత్రి తుమ్మల చెప్పుకొచ్చారు.
ప్రస్తుతం తెలంగాణలో 44,400 ఎకరాల్లో పామాయిల్ తోటల నుంచి 2.80 లక్షల టన్నుల ఆయిల్‌పామ్ గెలల దిగుబడి వస్తుందని అంచనా. ఈ దిగుమతి సుంకం పెంపుదల 9,366 మంది ఆయిల్‌పామ్ సాగుదారులకు అదనంగా లబ్ధి చేకూరే అవకాశం ఉంది. పామాయిల్ దిగుమతిపై కేంద్రానికి ఏడాదికి రూ. 80 వేల కోట్ల రూపాయల విదేశీ మారక ద్రవ్యం ఖర్చవుతుందని అంచనా. కాగా ఇప్పుడు దిగుమతి పన్నులు భారీగా విధించడంతో అటు దేశంతో పాటు తెలంగాణలోనూ పామాయిల్ రైతులు పెద్దఎత్తున ప్రయోజనం పొందనున్నారు.
More Stories
కాంగ్రెస్ మహిళా వ్యతిరేక మనస్తత్వానికి నిదర్శనం
మూసీ బాధితులు రేవంత్ ను మెచ్చుకుంటే రాజకీయాలకు స్వస్తి!
ఎమ్మెల్యేల అనర్హతపై స్టేకు హైకోర్టు తిరస్కారం