గల్ఫ్ కార్మికుల కోసం గల్ఫ్ సంక్షేమ బోర్డు ఏర్పాటు ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం తీసుకోవాల్సిన చర్యలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో మంత్రి పొన్నం ప్రభాకర్ అధ్యక్షతన గల్ఫ్ కార్మికులు అధికంగా ఉండే నియోజకవర్గ ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నేతలతో సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, టీపీసీసీ ఎన్ఆర్ఐ సెల్ వినోద్ ఆధ్వర్యంలో రూపొందిన గల్ఫ్ బాధితులకు సంబంధించిన 5 అంశాలపై చర్చించారు. ప్రధానంగా గల్ఫ్ కార్మికుల సంక్షేమంపై అధ్యయనం చేయడానికి ప్రభుత్వం ఒక సలహా కమిటీని ఏర్పాటు చేయాలని, అందులో గల్ఫ్ ప్రభావిత ప్రాంత ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నాయకులు సభ్యులుగా నియమించి, ఇందుకోసం జీవో విడుదల చేయాలని సూచించారు.
హైదరాబాద్ ప్రజా భవన్‌లో ప్రతి మంగళవారం, శుక్రవారం నిర్వహించే ప్రజావాణిలో గల్ఫ్ కార్మికుల కోసం ప్రవాసి ప్రజావాణి నిర్వహిస్తే బాగుంటుందని పేర్కొన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ప్రస్తుతం నిర్వహిస్తున్న ప్రజావాణిలో ఈనెల 20 నుంచి గల్ఫ్ కోసం ప్రత్యేక కౌంటర్ ప్రారంభిస్తామని తెలిపారు.
గురుకుల పాఠశాల, కళాశాలల్లో గల్ఫ్ కార్మికుల పిల్లలకు 100 శాతం అడ్మిషన్ ఇచ్చేలా చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి (7 డిసెంబర్ 2023) నుంచి గల్ఫ్ దేశాల్లో మరణించిన కార్మికుల కుటుంబాలకు 5 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇచ్చేలా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు.
గతంలో చనిపోయిన వారి కుటుంబాలకు మానవతా దృక్పథంతో లక్ష రూపాయల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని ఎన్ఆర్ఐ సూచించింది. దీనిని తెలంగాణ ఏర్పడినప్పటి రోజు జూన్ 2 ,2014 లేదా ఏరోజు తీసుకుంటే బాగుంటుందనే దానిపై పలువురు సూచనలు చేశారు.
ఇప్పటికే తన వేములవాడ నియోజకవర్గానికి చెందిన ఇద్దరు కార్మికులు గల్ఫ్‌లో మృతి చెందగా వారి కుటుంబాలకు సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో సీఎంఆర్ఎఫ్ నుంచి పరిహారం అందిచ్చినట్లు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తెలిపారు. రైతు భీమా మాదిరిగానే గల్ఫ్ భీమా ఉండాలని సూచించారు. ఏజెన్సీల పేరుతో మోసం జరుగుతుందని, అలా జరగకుండా కఠినంగా వ్యవహరించాలని సూచించారు.
గల్ఫ్ కార్మికులు చనిపోతే మృతదేహం రావడానికి వారం రోజులకు పైగా సమయం పడుతుందని, 48 గంటల్లో ఇక్కడికి వచ్చేలా చూడాలని తెలిపారు. దేశంలో బెస్ట్ గల్ఫ్ పాలసీ కేరళ రాష్ట్రంలో ఉందని చెబుతూ అక్కడ ఉన్న దానిని అధ్యయనం చేయాలని సమావేశం దృష్టికి తీసుకొచ్చారు. కేరళలో జీడీపీకి ప్రధానంగా గల్ఫ్ కార్మికుల ద్వారా వస్తుందని, తెలంగాణలో కూడా జీడీపీ గల్ఫ్ కార్మికుల ద్వారా అభివృద్ధి జరగాలని సూచించారు.
పలువురు ఎమ్మెల్యేలు మాట్లాడుతూ ఈ మధ్యకాలంలో సింగపూర్, మలేషియా కార్మికులు ఇబ్బందులు పడుతున్నారని సూచించారు. టీపిసిసి ఎన్‌ఆర్‌ఐ కన్వీనర్ ఇమిగ్రేషన్ 1982 యాక్ట్ లో గల్ఫ్ దేశాల్లో 18 దేశాలు ఉంటాయని, అందులో సింగపూర్ లాంటి దేశాలు కూడా గల్ఫ్ కిందకి వస్తాయని పేర్కొన్నారు. తెలంగాణ లో 150 ట్రెడ్ లైసెన్స్‌మన్ పవర్ ఎక్సపోర్ట్ కంపెనీలు ఉన్నాయని, సెట్విన్, టాంటం, న్యాక్ లాంటి వాటిపై ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించారు.
ఎమ్మెల్యేలు మేడిపల్లి సత్యం (చొప్పదండి), డా. మాకునూరి సంజయ్ కుమార్ (జగిత్యాల), కెఆర్ నాగరాజు (వర్ధన్నపేట), డా. ఆర్. భూపతి రెడ్డి (నిజామాబాద్ రూరల్), జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కార్, కార్పొరేషన్ చైర్మన్లు అనిల్ ఈరవత్రి, సుంకేట అన్వేష్ రెడ్డి, నాయకులు పి. వినయ్ రెడ్డి (ఆర్మూర్), కూచాడి శ్రీహరి రావు (నిర్మల్), వెలిచాల రాజేందర్ రావు (కరీంనగర్) వలస నిపుణులు అంబాసిడర్ డా. బిఎం వినోద్ కుమార్, గల్ఫ్ వలస కార్మిక నాయకులు మంద భీంరెడ్డి, సింగిరెడ్డి నరేష్ రెడ్డి, చెన్నమనేని శ్రీనివాస రావు తదితరులు పాల్గొన్నారు.
More Stories
కాంగ్రెస్ మహిళా వ్యతిరేక మనస్తత్వానికి నిదర్శనం
తిరుమల లడ్డూ వివాదంలో ప్రత్యేక సిట్ దర్యాప్తు
జాతీయ స్థాయిలో తాజా పౌరుల రిజిస్టర్ అవసరం