* జైనూరులో ఉద్రిక్తత పరిస్థితులు, కర్ఫ్యూ విధింపు
దీంతో ఆమె స్పృహతప్పి పడిపోయింది. ఆమె మరణించిందనుకుని రోడ్డుపై వదిలేసి ఆటో డ్రైవర్ వెళ్లిపోయాడు. అటుగా వెళ్తున్న స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఆమెను స్థానిక ఆసుపత్రిలో చేర్పించి కుటుంబీకులకు సమాచారం అందించారు. స్థానిక ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందించి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరళించారు.
బాధితురాలి సోదరుడు జరిగిన సంఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వెంటనే పోలీసులు హైదరాబాద్ వెళ్లి చికిత్స పొందుతున్న మహిళ వాంగ్మూలం తీసుకుని అత్యాచార యత్నానికి పాల్పడిన వ్యక్తిపై కేసు నమోదు చేశారు. పోలీసులు ఎటువంటి ముందు జాగ్రత్త చర్యలు చేపట్టకపోవడంతో కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలంలో బుధవారం పెద్ద ఎత్తున హింస ప్రజ్వరిల్లింది. ఐదు గృహాలు అగ్నికి ఆహుతయ్యాయి. మండల కేంద్రంలో 50కిపైగా దుకాణాలు కాలి బూడిదయ్యాయి. ఓ స్కార్పియో సహా అనేక వాహనాలు దగ్ధమయ్యాయి.
ప్రత్యర్థి వర్గానికి చెందినవారు ఆయుధాలు, కట్టెలు, రాళ్లు తీసుకొని రోడ్లపైకి వచ్చారు. పరస్పరం రాళ్ల దాడులు, ఇండ్లు, షాపుల దగ్ధంతో జైనూర్ మండల కేంద్రం రణరంగాన్ని తలపించింది. ఇటీవలి కాలంలో మతకల్లోలాలకు దారితీసే ఘటనలు వరుసగా నాలుగు జరిగాయి. అయినప్పటికీ హింసను అరికట్టడంలో నిఘావర్గాల వైఫల్యం, పోలీసుల నిర్లక్ష్యంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఈ ఘటనపై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తెలంగాణ రాష్ట్ర డిజిపి జితేందర్‌కి ఫోన్ చేసి ఈ సంఘటనపై ఆరా తీశారు. గత నెల 31న ఘటన జరిగితే ఇంత ఆలస్యంగా వెలుగులోకి రావడానికి గల కారణాలపై డిజిపిని అడిగి తెలుసుకున్నారు. మహిళలపై హత్య, అత్యాచారాలకు పాల్పడే వారు ఎంతటివారైనా కఠిన శిక్షలు తప్పవనే సంకేతాలు పంపాలని సూచించారు.
గాయాలతో హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధిత మహిళను ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి పరామర్శించి ఆరోగ్య బాగోగులను అడిగి తెలుసుకున్నారు. గాంధీ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న బాధిత మహిళను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ నేరెళ్ల శారద బుధవారం పరామర్శించారు. ఆమెకు అందుతున్న చికిత్స గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు.
జైనూరు మండలంలో ఆదివాసి మహిళపై అత్యాచారం,హత్యాయత్నం చేసిన ముస్లిం వ్యక్తి మద్దుమ్ తో పాటు మిగతా ముగ్గురు నిందితులను వెంటనే ఉరితీయాలని బిజెపి గిరిజన మోర్చా రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కళ్యాణ్ నాయక్ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఆదివాసి గిరిజన మహిళలపై అత్యాచారాలు పెరిగిపోయాయని, గిరిజన ఆదివాసి మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
కాగా, బిజెపి మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు డాక్టర్ మేకల శిల్పారెడ్డి నేతృత్వంలో బిజెపి మహిళా మోర్చా బృందం గురువారం ఉదయం 10:30 గంటలకు ఆసిఫాబాద్ జిల్లా జైనూరు మండలంలో అత్యాచారం,హత్యాయత్నం జరిగి హైదరాబాద్ గాంధీ వైద్యశాలలో చికిత్స పొందుతున్న ఆదివాసి మహిళను పరామర్శించనున్నట్లు తెలిపారు.
More Stories
సామరస్యంతోఅస్పృస్యతను పూర్తిగా నిర్ములించాలి
డొనాల్డ్ ట్రంప్ సమీపంలో కాల్పులు.. మరోసారి హత్యాయత్నం?
ప్రజాపాలన దినోత్సవం కాదు… ప్రజావంచన దినోత్సవం