క్రమంగా ఆర్గనైజర్‌గా, కమాండర్‌గా నియమితులయ్యారు. 1995లో వరంగల్ జిల్లా కమిటీ సభ్యుడిగా.. 2001లో తెలంగాణ కమిటీ ప్రెస్, రక్షణ వ్యవహారాల కోసం ఏర్పాటైన ప్లటూన్ కమాండర్‌గా పనిచేశారు. 2004లో కేంద్ర కమిటీ రక్షణ కోసం ఏర్పాటైన కంపెనీ కమాండర్‌గా.. 2012లో ఛత్తీ్‌సగఢ్‌లో జనతన సర్కార్‌లో వ్యవసాయాభివృద్ధి కమిటీ నేతగా అబూజ్‌మఢ్‌లో పనిచేశారు.
ఆ తర్వాత కేంద్ర కమిటీ సభ్యుడిగా.. మహారాష్ట్ర-ఛత్తీస్‌గఢ్ సరిహద్దు ఇన్‌చార్జిగా, కేంద్ర కమిటీ మిలటరీ ఇన్‌చార్జిగా మావోయిస్టు పార్టీలో అంచెలంచెలుగా ఎదిగారు. మంగళవారం ఎన్‌కౌంటర్‌లో జగన్ మృతిచెందినట్లు పోలీసులు ప్రకటించారు. జగన్ అజ్ఞాతంలోకి వెళ్లాక.. ఎన్నడూ సొంత ఊరికి రాలేదని గ్రామస్థులు చెబుతున్నారు.
మాచర్ల ఏసోబు భార్య లక్ష్మక్క కూడా కొంతకాలం దళంలో పని చేసింది. 1965 సుమారులో ఏసోబు, లక్ష్మక్కకు వివాహం జరగగా.. వారికి ముగ్గురు ఆడ పిల్లలు, ఒక కొడుకు పుట్టాడు. నలుగురు పిల్లలు పుట్టిన కొంతకాలానికే భార్య లక్ష్మక్క ను తీసుకుని ఏసోబు అడవి బాట పట్టాడు. కొంతకాలం దళంలో పని చేసిన లక్ష్మక్క ఆ తరువాత ఉద్యమాలకు స్వస్తి చెప్పింది.
దళం నుంచి బయటకు వచ్చి ధర్మసాగర్ మండల కేంద్రానికి మకాం మార్చి పిల్లలను చదివించి, పెంచి పెద్ద చేసింది. తన చేతుల మీదుగా పిల్లలందరి పెళ్లిళ్లు కూడా చేసింది. ఏడాదిన్నర కిందట గుండెపోటుతో మరణించింది.
కాగా.. జగన్‌పై రూ.25 లక్షల రివార్డు ఉంది. గురువారం మధ్యాహ్నానికి ఆయన మృతదేహం టేకులగూడెం చేరుకుంటుందని, ఆయనకు నివాళులు అర్పించేందుకు పెద్ద సంఖ్యలో మాజీ నక్సలైట్లు, హక్కుల కార్యకర్తలు తరలివచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ ఎన్‌కౌంటర్‌లో మృతిచెందిన మిగతా 8 మంది మావోయిస్టులను గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.
మృతుల్లో శాంతికుమారి(రూ.5లక్షల రివార్డు), మడకం సుశీల (5లక్షలు), ముచకి గంగి(5లక్షలు), కోసా మాద్వి(5లక్షలు), లలిత (5లక్షలు), కవిత (5లక్షలు), మకం హిడ్మే(2లక్షలు), కమలేశ్(2లక్షలు) ఉన్నారు. జగన్ సహా.. 9మందిపై రూ.59లక్షల రివార్డు ఉన్నట్లు వివరించారు.
More Stories
సామరస్యంతోఅస్పృస్యతను పూర్తిగా నిర్ములించాలి
డొనాల్డ్ ట్రంప్ సమీపంలో కాల్పులు.. మరోసారి హత్యాయత్నం?
సినీ నటి జేత్వాని వేధింపుల కేసులో ముగ్గురు ఐపీఎస్‌లపై వేటు