బీహార్‌లో అధికారంలో ఉన్న జనతాదళ్ (యునైటెడ్) సీనియర్ నాయకుడు కేసీ త్యాగి ఆ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి పదవికి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ నాయకత్వానికి రాసిన లేఖలో పేర్కొన్నారు. బీహార్ ముఖ్యమంతిర్ నితీష్ కుమార్ పార్టీ ఆదివారం ఈ విషయాన్ని తెలిపింది.
త్యాగి స్థానంలో రాజీవ్ రంజన్ ప్రసాద్‌ను పార్టీ జాతీయ అధికార ప్రతినిధిగా నియమించనున్నట్లు ప్రకటించింది. కాగా, కేసీ త్యాగి ఇటీవల పలు అంశాలపై చేసిన ప్రకటనలు వివాదస్పదమయ్యాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న జెడియు భాగస్వామిగా ఉన్న ఎన్డీయే ప్రభుత్వ విధానాలకు భిన్నంగా తరచూ ప్రకటనలు ఇస్తుండటం ఇబ్బందికరంగా మారింది.
ఇజ్రాయెల్‌కు ఆయుధాల సరఫరాను నిలిపివేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. అలాగే గాజాలో శాంతి, కాల్పుల విరమణకు భారత్ మద్దతు ఇస్తుందని పేర్కొన్నారు. అదేవిధంగా, కామన్ సివిల్ కోడ్, వక్ఫ్ సవరణ బిల్లు వంటి అంశాలలో కేంద్ర ప్రభుత్వ విధానాలకు భిన్నంగా ప్రకటనలు ఇస్తూ వస్తున్నారు.
అయితే పార్టీ నాయకత్వాన్ని సంప్రదించకుండానే త్యాగి ఈ ప్రకటనలు చేసినట్లు జేడీ(యూ) విమర్శించింది. ఆయన వ్యాఖ్యల కారణంగా నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్డీయే)లో విభేదాలు తలెత్తినట్లు ఆ పార్టీ వర్గాలు ఆరోపించాయి. ఈ నేపథ్యంలో జాతీయ అధికార ప్రతినిధి పదవికి కేసీ త్యాగి రాజీనామా చేసినట్లు తెలుస్తున్నది.
More Stories
బాలీవుడ్ సెలబ్రిటీలకు హత్య బెదిరింపులు
ఢిల్లీ ఎన్నికల్లో 50 శాతం పైగా బూత్లు గెలవాలి
‘జాతీయ ఆరోగ్య మిషన్’ మరో ఐదేళ్లు పొడిగింపు