
సిక్కు సమాజ నాయకుల నుండి తీవ్ర బెదిరింపులు ఎదుర్కొంటున్న ప్పటికీ తన రాబోయే చిత్రం `ఎమర్జెన్సీ’ నుండి ఇందిరా గాంధీ హత్య చిత్రీకరణను తొలగించబోనని బిజెపి ఎంపి, బాలీవుడ్ నటి కంగనా రనౌత్ స్పష్టం చేశారు.
ఇండియా టివిలో ‘ఆప్ కీ అదాలత్’లో రజత్ శర్మ అడిగిన ప్రశ్నలకు ఆమె సమాధానమిస్తూ, “నేను ఎస్ జిపిసి నేతలను సంప్రదించాను. వారికి నా సినిమా చూపించాను. ఇందిరా గాంధీని సిక్కులు చంపినట్లు చూపించకూడదని వారు కోరుకుంటున్నారు. అప్పుడు నేను ఏమి చూపించాలి? పిడుగుపాటు వల్ల చనిపోయినట్లు చూపించాలా?” అని ఆమె ప్రశ్నించారు.
‘ఎమర్జెన్సీ’ చిత్రం “సిక్కు వ్యతిరేక కథనాన్ని” వ్యాప్తి చేస్తోందని, సిక్కులను “వేర్పాటువాదులు”గా తప్పుగా చిత్రీకరిస్తోందని ఆరోపిస్తూ శిరోమణి గురుద్వారా పర్బంధక్ కమిటీతో సహా పలు సంస్థలు ‘ఎమర్జెన్సీ’ చిత్రాన్ని నిషేధించాలని డిమాండ్ చేస్తున్నాయి.
ఆగస్టు 27న సిబిఎఫ్ సికి ఎస్ జిపిసి పంపిన నోటీసులో, “ఇటువంటి వర్ణనలు తప్పుదారి పట్టించేవిగా ఉండటమే కాకుండా, పంజాబ్, యావత్ దేశ సామాజిక వర్గానికి తీవ్ర అభ్యంతరకరమైనవి, హానికరమైనవి. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా నిజమైన రాజకీయ లేదా చారిత్రక ప్రకటన చేయండి, కానీ సిక్కు సమాజాన్ని లక్ష్యంగా చేసుకోండి” అని హెచ్చరించింది.
ఆమెను జైలుకు లేదా మానసిక ఆశ్రమానికి పంపాలని బిజెపి నాయకుడు మంజీందర్ సింగ్ సిర్సా చేసిన వ్యాఖ్యపై కంగనా రనౌత్ మాట్లాడుతూ, “సినిమా నుండి అభ్యంతరకరమైన ఒక్క షాట్ అయినా నాకు చూపించమని నేను అతనిని సవాలు చేస్తున్నాను. అతని ప్రతిభ గురించి ఎవరికీ ఏమీ తెలియదు. కానీ వారు అమాయక ప్రజల మనోభావాలను ఉపయోగించుకుంటున్నారు” అని విమర్శించారు.
ఈ సినిమా ట్రైలర్ కొన్ని వర్గాల ప్రజల మనోభావాలను దెబ్బతీసిందని రజత్ శర్మ పేర్కొనగా, కంగనా నిర్మొహమాటంగా ఇలా బదులిచ్చారు: “హత్యకు గురైన మాజీ ప్రధానిపై సినిమా తీస్తే, ఆమె పిడుగుపాటుకు మరణించినట్లు చిత్రీకరించలేము” అని తేల్చి చెప్పారు.“ఒక చెట్టు పడి చనిపోయిందని చూపించండి అని సిర్సా జీ అంటున్నారు. నేను చరిత్రను మార్చలేను. నాకు ఏ సంఘంతోనూ సమస్య లేదు. సినిమా ఎప్పుడు విడుదలవుతుందనే విషయంపై స్పష్టత వస్తుంది. ఈ సినిమా నా సీరియస్ ప్రయత్నం’’ అని చెప్పారు.
సోషల్ మీడియాలో తమకు వస్తున్న హత్య బెదిరింపులపై స్పందిస్తూ ఆమె ఇళ్ల చెప్పారు: “సోషల్ మీడియాలో, వారు ఇందిరా గాంధీని ఎలా హత్య చేశారో గర్వంగా చూపిస్తున్నారు. వారు ఇప్పుడు ఈ రోజు ‘గార్దన్ కాట్ డెంగే’ (నా మెడ నరికి) అంటున్నారు. చాలా మంది వ్యక్తులు నా స్వరాన్ని అణచివేయడానికి ప్రయత్నిస్తున్నారు (బహుత్ లోగ్ కోషిష్ కర్ రహే హైన్ కి ముఝే చుప్ కారయా జాయే)”.
కాగా, సిక్కుల మతపరమైన మనోభావాలను దెబ్బతీశారంటూ ఆమెపై చండీగఢ్ జిల్లా కోర్టులో ఓ క్రిమినల్ ఫిర్యాదు దాఖలైంది. లాయర్స్ ఫర్ హ్యుమానిటీ ప్రెసిడెంట్ రవీందర్ సింగ్ బస్సీ దాఖలు చేసిన ఫిర్యాదులో రనౌత్ తన సినిమా “ఎమర్జెన్సీ”లో సిక్కుల ప్రతిష్టను కించపరిచారని ఆరోపించారు.
More Stories
బెంగాల్ ప్రతిపక్ష నేత బడ్జెట్ సమావేశాల్లో సస్పెన్షన్
జాతీయ పార్టీల ఆదాయాలలో 74 శాతం బీజేపీకే
`చైనా శత్రువు’ కాదన్న పిట్రోడా వాఖ్యలపై దుమారం