మరో వైపు జమ్మూ డివిజన్‌లోని రాజోరి జిల్లాలో అనుమానాస్పద కాల్పుల్లో ఓ సైనికుడు గాయపడ్డాడని తెలిపారు. చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. సైనికుడి కాలుకు బుల్లెట్ గాయాలయ్యాయని సమాచారం. రాజోరి జిల్లా మంజాకోట్‌లో ఉన్న సైనిక శిబిరంలో అనుమానాస్పద కాల్పుల్లో సైనికుడు గాయపడ్డాడు.
ఆ తర్వాత సంఘటనా స్థలంలో దాదాపు అరగంటపాటు కాల్పులు కొనసాగాయి. అనంతరం గాయపడ్డ సైనికుడిని గుర్తించి చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. భద్రతా బలగాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి. సైనికుడు ఉగ్రవాదుల కాల్పుల్లో గాయపడ్డాడా? లేదంటే ప్రమాదవశాత్తు కాల్పులు జరిపాడా? అన్నది స్పష్టంగా తెలియరాలేదు.
అయితే, కుల్గామ్‌లో ఫ్రిసల్ చిన్నిగాంలో నలుగురు ఉగ్రవాదులు హతమైనట్లుగా ఐజీ బీకే బిర్డి తెలిపారు. ఆదివారం మరో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారని చెప్పారు. ఎన్‌కౌంటర్ స్థలంలో నలుగురు ఉగ్రవాదుల మృతదేహాలతో పాటు మూడు ఏకే47, ఓ పిస్టల్ స్వాధీనం చేసుకున్నారు.
సమాచారం ఈ ఉగ్రవాదులు హిజ్బుల్ ముజాహిదీన్‌కు చెందిన టీఆర్ఎఫ్ వర్గానికి చెందినవారుగా తెలుస్తున్నది. ఖైమోహ్‌లోని బషీర్ అహ్మద్ దార్ తనయుడు యావర్ బషీర్, యారిపొరా నివాసి గంహౌద్ దార్ కుమారుడు జాహిద్ అహ్మద్ దార్, అబ్ సతార్ రాథర్‌కు చెందిన తౌహిద్ అహ్మద్ రాథర్ కుమారుడు, కుల్గామ్ నివాసి మహ్మద్ షరీఫ్ వానీ కుమారుడు షకీల్ అహ్మద్ వానీగా గుర్తించారు.
మిగిలిన ఇద్దరు ఉగ్రవాదులు ఎవరనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఫ్రిసల్ చిన్నిగాం, ముదర్గాం ప్రాంతంలో ఎన్‌కౌంటర్ జరిగిన ఎన్‌కౌంటర్‌లో పారా కమాండో లాన్స్ నాయక్ ప్రదీప్ నైన్, ఫ్రిసల్‌లో జాతీయ రైఫిల్స్ సైనికుడు ప్రవీణ్ ప్రభాకర్ గాయపడ్డారు. అనంతరం చికిత్స పొందుతూ మృతి చెందారు. అయితే వీరి పేర్లను సైన్యం అధికారికంగా ధ్రువీకరించలేదు. ఆదివారం వీరిద్దరికీ సైనిక లాంఛనాలతో అంతిమ వీడ్కోలు పలికారు.
More Stories
ప్రార్థనా స్థలాల వద్ద సర్వేలు నిలిపివేయాలి
ఛత్తీస్‌గఢ్‌లో ఏడుగురు మావోయిస్టులు మృతి
వరకట్న వేధింపుల కేసుల్లో చట్ట దుర్వినియోగంపై సుప్రీం సీరియస్