లష్కర్ గ్రూప్ గురించి ఆర్మీకి సమాచారం అందడంతో భద్రతా బలగాలు ఆ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి. ఈ క్రమంలో సైనికులకు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు ప్రారంభమయ్యాయి. ఇరువైపులా కాల్పులు కొనసాగుతున్నాయి. డ్రోన్ ద్వారా చనిపోయిన ఉగ్రవాదుల మృతదేహాలను గుర్తించినా ఇంకా కాల్పులు జరుగుతూ ఉండడంతో అక్కడకు సైన్యం చేరుకోలేకపోయింది.
ఈ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు సైనికులు గాయపడగా, క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ వారిద్దరూ వీరమరణం పొందారు. కుల్గామ్ జిల్లా మోడెర్గాంలో భద్రతా బలగాలు, ఎన్‌కౌంటర్ జరిగింది. ఉగ్రవాదులకు సంబంధించిన సమాచారం అందడంతో భద్రతా బలగాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి.
ప్రస్తుతం సంఘటనా స్థలంలో కాల్పులు జరుగుతున్నాయని కశ్మీర్ జోన్ పోలీసులు తెలిపారు. పోలీసు, ఆర్మీ9 ఆర్‌ఆర్, సీఆర్పీఎఫ్ సంయుక్త బృందం ఈ ప్రాంతంలో తీవ్రవాదుల ఉనికి గురించి నిర్ధిష్ట సమాచారం ఆధారంగా కార్డన్, సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించినట్లు అధికారి తెలిపారు. సైనికుల ఉమ్మడి బృందాలు అనుమానాస్పద స్థలం వైపు వెళ్లగానే దాక్కున్న ఉగ్రవాదులు వారిపై కాల్పులు జరిపారని, దాంతో ప్రతీకారంగా ఎన్‌కౌంటర్‌కు దారితీసిందని ఆయన చెప్పారు.
దీంతో పాటు శనివారం జమ్మూ కాశ్మీర్‌లోని కతువా, ఉధంపూర్ జిల్లాల్లో జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్‌తో సహా ఇద్దరు బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బిఎస్‌ఎఫ్) జవాన్లు వీరమరణం పొందారని అధికారులు తెలిపారు. కతువా జిల్లాలోని రాజ్‌బాగ్ సమీపంలో వాహనం రోడ్డుపై నుంచి జారి ఉజ్ కాలువలో పడిపోయిందని.. ఈ ప్రమాదంలో, హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన ఏఎస్‌ఐ పర్షోతమ్ సింగ్ వీరమరణం పొందారు.
More Stories
జమ్ముకాశ్మీర్ లో ఆర్మీ జెసిఓ వీరమరణం
పిల్లల సోషల్ మీడియా వినియోగంపై ఆస్ట్రేలియా నిషేధం
మణిపూర్లో గిరిజనుల ఇళ్లకు నిప్పు.. మంటల్లో మహిళ మృతి