![10 సీట్లకే పరిమితమైన సీఎం జగన్ రాజీనామా 10 సీట్లకే పరిమితమైన సీఎం జగన్ రాజీనామా](https://nijamtoday.com/wp-content/uploads/2024/06/YCP-1024x576.jpg)
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాజీనామా చేశారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఓటమిని అంగీకరిస్తూ సీఎం పదవికి రాజీనామా చేశారు. గవర్నర్‌కు తన రాజీనామా లేఖ పంపించారు. ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు అనుగుణంగానే వైసీపీ ఘోర పరాభవం పాలైంది. కనీసం జనసేన పార్టీ సాధించినన్ని సీట్లు కూడా చేజిక్కించుకోకపోయింది.
ఎన్నికల ముందు ‘వై నాట్ 175’ అన్న వైసీపీ నేతలు ఇప్పుడు ఎన్నికల ఫలితాలు చూసి ఒక్కసారిగా ఖంగుతింటున్నారు. బహుశా దేశంలో మరే నాయకుడికి ఎదురుకాని పరాభవం ఎన్నికలలో ఎదురైంది. ఏపీలోని 26 జిల్లాల్లో 18 జిల్లాల్లో అయితే ఖాతా కూడా తెరవలేదు. ఆయన తప్ప మంత్రులు, మాజీ మంత్రులు అందరూ ఓటమి చెందారు.
టిడిపి 136 సీట్లలో గెలుపొందగా, మిత్రపక్షాలైన జనసేన 21, బిజెపి 8 స్థానాలలో గెలుపొందాయి. ముఖ్యంగా గత అసెంబ్లీ ఎన్నికల్లో క్లీన్‌స్వీప్ చేసిన విజయనగరం, నెల్లూరు జిల్లాల్లో ఈసారి వైసీపీ ఒక్క సీటు కూడా గెలవలేదు. వీటితో పాటు శ్రీకాకుళం, మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి, , కాకినాడ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, అనంతపురం, శ్రీసత్యసాయి, నంద్యాల జిల్లాల్లో ఒక్క సీటు కూడా వైసీపీ గెలవలేదు.అల్లూరి సీతారామరాజు జిల్లాలో రెండు, తిరుపతిలో 1, చిత్తూరులో 1, అన్నమయ్యలో 2, కర్నూలులో 2 సీట్లు మాత్రమే గెలుచుకుంది. ఇక అసెంబ్లీ ఎన్నికలకు ముందు అభ్యర్థులను ప్రకటించే ముందు వైఎస్ జగన్ భారీ కసరత్తే చేశారు. దాదాపు 80కి పైగా సీట్లలో అభ్యర్థుల స్థానాలను మార్చారు. కానీ ఆ వ్యూహం ఫలించలేదు. అసెంబ్లీ స్థానాలు మార్చిన అందరూ ఓడిపోవడం గమనార్హం.
గత ఎన్నికల్లో 151 సీట్లు గెల్చుకున్న వైసీపీ, చివరకు అందులో పదో శాతం కూడా గెల్చుకోలేక బొక్కబోర్లా పడింది. గత ఎన్నికల్లో ఒక్క సీటు మాత్రమే గెల్చిన జనసేన ఈసారి తెలుగుదేశంలో జట్టుగా వచ్చి అధికార పార్టీని చావుదెబ్బ కొట్టింది. పొతే చేసిన 21 స్థానాల్లో కూడా గెలుపొంది రెండో అతిపెద్ద పార్టీగా అవతరించింది. 10 స్థానాల్లో పోటీచేసిన బిజెపి కూడా కూటమి పార్టీల అండతో 8చోట్ల గెలుపొందింది.
ఫలితాలు చూస్తే ఆశ్చర్యకరంగా ఉన్నాయని జగన్ చెప్పుకొచ్చారు. ఫలితాలు ఇలా వస్తాయని ఊహించలేదని అంటూ విస్మయం వ్యక్తం చేశారు. ప్రతీ ఇంటికి వివక్ష లేకుండా..అవినీతి లేకుండా రూ. 2.70 లక్షల కోట్లు అందించామని గుర్తు చేసారు. వాలంటీర్ల వ్యవస్థ ద్వారా ఇంటికే సేవలు అందించామని చెప్పారు. ఇంతగా ఆలోచించిన మార్పులు తీసుకు వస్తే ఆ ప్రేమ..అభిమానం ఏమందోనని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రతిపక్షంలో పోరాటాలు కొత్త కాదని చెబుతూ పోరాటాలే చేసామని గుర్తు చేశారు. రాజకీయ పోరాటంలో చూడకూడని కష్టాలే చూసామని అంటూ ఎలాంటి కష్టాలైనా ఎదుర్కోవటానికి సిద్దంగా ఉంటామని జగన్ స్పష్టం చేసారు.
More Stories
అన్న క్యాంటీన్లు ప్రయోజనమే… నిర్వహణకు ఓ కార్పొరేషన్ ఉండాలి!
జిహెచ్ఎంసి మేయర్ విజయలక్ష్మిపై అవిశ్వాసం?
ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ప్రమాణంలో ప్రత్యేక ఆకర్షణగా ఉష