అధికారంలోకి వస్తే కాంగ్రెస్, సమాజ్‌వాది పార్టీ (ఎస్‌పి) అయోధ్యలోని రామాలయాన్ని బుల్ డోజర్‌తో కూల్చివేస్తాయని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. బుల్ డోజర్లను ఎక్కడ ఎక్కించాలో ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ దగ్గర ట్యూషన్ చెప్పించుకోవాలని ఆ రెండు పార్టీలకు ఆయన సూచించారు.
శుక్రవారం ఉత్తర ప్రదేశ్ లోని బారాబంకిలో ఒక ఎన్నికల ప్రచార సభలో ప్రధాని ప్రసంగిస్తూ ఒక్కో దశ ఎన్నికలు ము కొద్దీ ప్రతిపక్ష ఇండియా కూటమి పేకముక్కల్లా కూలిపోతోందని, దానితో దేశంలో అస్థిరతను సృష్టించేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. తన ప్రభుత్వం హ్యాట్రిక్ సాధించడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కొత్త ప్రభుత్వంలో పేదలు, యువజనులు, మహిళలు, రైతుల కోసం అనేక కీలక నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుందని ఆయన వెల్లడించారు.
అందు కోసమే తాను బారాబంకి, మోహన్‌లాల్ గంజ్ ప్రజల ఆశీస్సులు తీసుకునేందుకు వచ్చానని మోదీ తెలిపారు. జూన్ 4వ తేదీకి ఎంతో దూరం లేదని, మోదీ ప్రభుత్వ హ్యాట్రిక్ కొట్టనున్నదని యావత్ దేశానికి తెలుసునని ఆయన చెప్పారు. ఒక వైపున జాతీయ ప్రయోజనాలకు కట్టుబడిన బిజెపి- ఎన్‌డిఎ కూటమి ఉండగా మరో వైపున దేశంలో అస్థిరతను సృష్టించేందుకు ఇండియా కూటమి ఉందని ఆయన చెప్పారు.
ఎన్నికలు జరుగుతున్న కొద్దీ ఈ ఇండియా కూటమి నాయకులు పేక ముక్కల్లా కూలిపోతున్నారని ఆయన విమర్శించారు. మీ కోసం పనిచేసే ఎంపీలు మీకు అవసరం. ఐదేళ్ల పాటు మోదీని తిట్టే ఎంపీలు కాకుండా మీ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే ఎంపీలు మనకు అవసరం. ఇందుకు మీకు కమలం గుర్తు ఒక్కటే ప్రత్యామ్నాయం అని స్పష్టం చేశారు. మీకు 1000 సిసి ఇంజిన్ కావాలా 100 సిసి ఇంజిన్ కావాలా ? అని ప్రశ్నించారు.
శీఘ్ర అభివృద్ధి కోరుకునేటట్లయితే శక్తిమంతమైన బీజేపీ ప్రభుత్వాన్నే ఎన్నుకోవాలని ప్రధాని పిలుపిచ్చారు. శ్రీరామనవమి రోజు ఎస్పీ సీనియర్ నేత ఒకరు రామాలయం పనికిమాలినదని అన్నారని పేర్కొంటూ రామాలయానికి అనుకూలంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును మార్పించేందుకు కాంగ్రెస్ సన్నద్ధంగా ఉందని మోదీ ఆరోపించారు. వారికి కుటుంబం, అధికారం తప్ప ఇంకేవీ పట్టవని ధ్వజమెత్తారు.
More Stories
ఐక్యత, సమానత్వం అసాధారణ సంగమంగా మహాకుంభ మేళా
రైతులతో 14న చర్చలకు కేంద్రం సిద్ధం.. చికిత్సకు జగ్జీత్ సింగ్ అంగీకారం
సైఫ్ అలీఖాన్‌పై దాడి చేసిన బంగ్లాదేశ్ వాసి అరెస్ట్!