ఐపీఎల్లో వరుసగా రెండోసారి కప్పు నెగ్గేందుకు ఆర్సీబీ అడుగు దూరంలో నిలిచింది.మంగళవారం జరిగిన క్వాలిఫయర్-1 మ్యాచ్‌లో 92 రన్స్ తేడాతో గుజరాత్ టైటాన్స్‌ను చిత్తు చేసి టైటిల్ ఫైట్‌కు దూసుకెళ్లింది. ఆర్సీబీ ఫైనల్ చేరడం ఇది ఐదోసారి. గతేడాది విజేతగా నిలిచిన ఆ టీమ్ 2009, 2011, 2016లో రన్నరప్‌గా నిలిచింది.
ఈహై స్కోరింగ్ పోరులో తొలుత ఆర్సీబీ 20 ఓవర్లలో 254/5 స్కోరు చేసింది. పాటిదార్ 93కు తోడు విరాట్ కోహ్లీ (25 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్‌తో 43), కృనాల్ పాండ్యా (28 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 43) రాణించారు. అనంతరం జీటీ 19.3 ఓవర్లలో 162 రన్స్‌కే కుప్పకూలి చిత్తుగా ఓడిపోయింది.
రాహుల్ తెవాటియా (68),జోస్ బట్లర్ (29) టాప్ స్కోరర్లు. జాకబ్ డఫీ మూడు, రసిఖ్ దార్, భువీ, కృనాల్ రెండేసి వికెట్లతోదెబ్బకొట్టారు. పాటిదార్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ అవార్డు లభించింది. ఈ మ్యాచ్‌లో ఓడిన గుజరాత్ ఫైనల్ చేరేందుకు మరో చాన్స్ ఉంది. బుధవారం సన్‌రైజర్స్-రాజస్థాన్ మధ్య ఎలిమినేటర్ మ్యాచ్‌లో నెగ్గే జట్టుతో శుక్రవారం జరిగే క్వాలిఫయర్-2లో తలపడనుంది.
కెప్టెన్ రజత్ పాటిదార్ ముందుండి నడిపించడంతో ఆర్సీబీ భారీ స్కోరు చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆ టీమ్ ఆరంభం నుంచే పవర్ హిట్టింగ్తో అదరగొట్టింది. సిరాజ్ తొలి ఓవర్లోనే మూడు ఫోర్లు కొట్టిన ఓపెనర్ వెంకటేశ్ అయ్యర్ (19).. రబాడ బౌలింగ్‌లో సిక్స్ కొట్టి వెంటనే ఔటయ్యాడు. వన్‌డౌన్‌లో వచ్చిన దేవదత్ పడిక్కల్ (30) తోడుగా కింగ్ కోహ్లీ జట్టుకు బలమైన పునాది వేశాడు
బ్యాటర్లు విజృంభించిన పిచ్‌పై బౌలర్లూ సత్తా చాటడంతో ఆర్సీబీ విజయం తేలికైంది. భారీ ఛేదనలో గుజరాత్ ఆరంభంలోనే తడబడింది. ఫామ్‌లో ఉన్న టాప్-3 బ్యాటర్లను పవర్ ప్లేలోనే కోల్పోయిన జీటీ ఏ దశలోనూ ప్రత్యర్థికి పోటీ ఇవ్వలేకపోయింది. 38 ఆర్సీబీ ఇన్నింగ్స్‌లో బౌండరీలు. ఓ ప్లేఆఫ్ మ్యాచ్‌లో అత్యధికం. 2012లో ఢిల్లీపై చెన్నై కొట్టిన 33 బౌండరీల రికార్డు బద్దలైంది.254/4 ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ స్కోరు ఐపీఎల్ ప్లేఆఫ్స్/నాకౌట్ దశలో అత్యధికం. 2023లో ముంబైపై గుజరాత్ చేసిన 233/3 స్కోరు రికార్డు బ్రేక్ అయింది.

More Stories
ముఖ్యమంత్రి సిద్దరామయ్యను తప్పుకోమన్న అధిష్టానం!
ఇండో- పసిఫిక్ ప్రాంత వ్యాప్తంగా క్వాడ్ నిఘా పెంపు
జనాభాలో అనవసర మార్పులు, అక్రమ వలసలపై అత్యున్నత కమిటీ