
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ ఎంపీ స్వాతి మాలీవాల్‌పై దాడి కేసులో ప్రధాన నిందితుడు, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పిఎ బిభవ్ కుమార్‌ను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. బిభవ్ కుమార్ తనపై దాడి చేశాడని స్వాతి మలివాల్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు అయనను అరెస్ట్ చేశారు.
శనివారం ముఖ్యమంత్రి నివాసానికి వెళ్లిన పోలీసులు బిభవ్‌ను అదుపులోకి తీసుకుని వెనుక గేటు నుంచి తీసుకెళ్లారు. మరోవైపు ఈ కేసులో వైద్య నివేదిక కీలకంగా మారింది. దిల్లీలోని ఎయిమ్స్‌లో స్వాతి మలివాల్‌కు వైద్య పరీక్షలు నిర్వహించగా ఇందులో కీలక విషయాలు వెల్లడయ్యాయి.
మే 16వ తేదీ రాత్రి స్వాతి మాలీవాల్‌ను పరిశీలించిన తర్వాత వైద్య బృందం నివేదికను పోలీసులకు సమర్పించింది. వైద్య బృందం ఇచ్చిన నివేదిక ప్రకారం స్వాతి మాలీవాల్‌కు ఎడమ కాలు, కుడి చెంపపై గాయాలు ఉన్నాయని వెల్లడైంది. ఎడమకాలుపై 3×2 సెంటీమీటర్ల పరిమాణంలో గాయం ఉందని, కుడి కన్ను కింద 2×2 సెంటీమీటర్ల పరిమాణంలో గాయం ఉందని వైద్య నివేదిక పేర్కొంది.
దాదాపు 3 గంటల వైద్యపరీక్షల అనంతరం ముఖంపై గాయాలతో పాటు శరీరం లోపల కూడా గాయాలైనట్టు వైద్యులు గుర్తించారు. తనపై దాడి జరిగిందన్న స్వాతి మలివాల్ ఆరోపణలకు ఈ వైద్య నివేదిక బలం చేకూర్చే విధంగా ఉంది.
సీఎం నివాసంలో బిభవ్ కుమార్ తనపై దాడి చేశాడంటూ స్వాతి మలివాల్ ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు స్వాతి వాంగ్మూలాన్ని కూడా రికార్డు చేశారు. ఈ నేపథ్యంలో కేసు నమోదు చేసిన రెండు రోజుల తర్వాత బిభవ్‌ను అరెస్ట్ చేశారు.
సోమవారం నాడు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ నివాసంలో ఆయన వ్యక్తిగత సహాయకుడు బిభవ్ కుమార్ తనపై దాడి చేసినట్లు స్వాతి మలివాల్ ఆరోపిస్తోంది. ఈ మేరకు ఘటనకు సంబంధించి పోలీసులకు చేసిన ఫిర్యాదులో స్వాతి మలివాల్ కీలక విషయాలను వెల్లడించారు.
‘నేను ముఖ్యమంత్రిని కలిసేందుకు వెళ్లినప్పుడు బిభవ్ కుమార్ నాపైకి ఒక్కసారిగా దూసుకొచ్చి ఏడెనిమిది సార్లు బలంగా కొట్టాడు. నన్ను లాగేయడంతో టేబుల్‌కు నా తల తగిలి కింద పడిపోయాను. కావాలని నా చొక్కా పైకి లాగాడు. నా చొక్కా గుండీలు ఊడిపోయాయి. నా కడుపు, పొత్తికడుపు, ఛాతిపై తన్నాడు. నేను పీరియడ్‌లో ఉన్నానని, నొప్పి భరించలేకపోతున్నానని చెప్పినా వినకుండా దాడి చేశాడు.’ అని స్వాతి ఫిర్యాదు చేశారు.
మరోవైపు, సీఎం నివాసంలోకి అనధికారికంగా ప్రవేశించేందుకు మలివాల్ యత్నించారని, తనను దూషించారంటూ ఆమెపై బిభవ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
More Stories
జమ్ముకశ్మీర్‌లో 12 మంది పాక్ చొరబాటుదారులు కాల్చివేత
రామ జన్మభూమిలో తొలి `కరసేవక్’ కామేశ్వర చౌపాల్ మృతి
ఐదేళ్లలో తొలిసారి వడ్డీ రేట్లు తగ్గింపు