నేడు 92 స్థానాల్లో మూడో ద‌శ ఎన్నిక‌ల పోలింగ్

* ఓటు హ‌క్కును వినియోగించుకున్న ప్ర‌ధాని
 
దేశవ్యాప్తంగా 18 లోక్ సభకు సంబంధించి 543 లోక్ సభ స్థానాలకు ఎన్నికలు జరగుతున్నాయి. ఇప్పటికే తొలి విడతలో భాగంగా ఏప్రిల్ 19న 102 లోక్ సభ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. అటు రెండో విడతలో భాగంగా 88 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. తాజాగా లోక్‌సభ ఎన్నికల్లో మూడో విడతలో భాగంగా మంగళవారం 96 పార్లమెంట్ స్థానాలకు పోలింగ్ జరగనుంది.
 
మూడో దశలో అసోంలో నాలుగు, బీహార్‌లో ఐదు, ఛత్తీస్‌గఢ్‌లో ఏడు, గోవాలో రెండు, గుజరాత్‌లో 26, కర్ణాటకలో 14, మధ్యప్రదేశ్‌లో 8, మహారాష్ట్రలో 11, ఉత్తరప్రదేశ్‌లో 10, పశ్చిమ బెంగాల్‌లో 4 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అలాగే జమ్మూ కాశ్మీర్‌లో ఒకటి, దాద్రా నగర్ హవేలీ, డామన్ డయ్యూలో రెండు స్థానాల్లో పోలింగ్ జరగనుంది. 
 
మొత్తం 1,351 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మంగ‌ళ‌వారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఈ ఎన్నికలతో దేశంలో గుజరాత్, అస్సామ్, కర్ణాటక, మధ్య ప్రదేశ్‌ రాష్ట్రాలకు ఎన్నికల ప్రక్రియ పూర్తవుతోంది. కాగా ఈ ద‌శ‌లో మొత్తం 95 లోక్ సభ స్థానాల‌కు ఎన్నిక‌లు జ‌ర‌గాల్సి ఉండ‌గా గుజ‌రాత్ సూర‌త్ స్థానం నుంచి బిజెపి అభ్య‌ర్ధి ఏక‌గ్రీవంగా ఎన్నిక‌య్యారు.
 

ప్రజాస్వామ్యంలో ఓటుకు విశేష ప్రాధాన్యం ఉందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. దేశ ప్రజలు పెద్ద సంఖ్యలో ఓటు హక్కు వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. కొత్త రికార్డు సృష్టించాలని చెప్పారు. అందరి భాగస్వామ్యంతోనే ప్రజాస్వామ్యం మరింత పటిష్ఠమవుతుందని వెల్లడించారు.  లోక్‌సభ ఎన్నికల మూడో విడుత పోలింగ్‌ సందర్భంగా గాంధీనగర్‌ లోక్‌సభ పరిధిలోని అహ్మదాబాద్‌లో ఉన్న నిషాన్‌ హైస్కూల్‌లో ప్రధాని మోదీ తన ఓటుహక్కు వినియోగించుకున్నారు. అంతకు ముందే హోమ్ మంత్రి అమిత్ షా ఇక్కడ ఓటుహక్కు ఉపయోగించుకున్నారు.

 
ఈ సందర్భంగా మీడియాతో ప్రధాని మాట్లాడుతూ  ఎండల్లో ప్రజలు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారని చెప్పారు. ఎన్నికల వేళ ప్రజలు తమ ఆరోగ్యంపై దృష్టిపెట్టాలని సూచించారు. వీలైనంత ఎక్కవ నీళ్లు తాగితే ఆరోగ్యం బాగుంటుందని చెప్పారు. సమయంతో పోటీపడుతూ మీడియా మిత్రులు రాత్రింబవళ్లు శ్రమిస్తున్నారని కొనియాడారు.

 
ఈ సారి ఎన్నికల బరిలో గుజరాత్ నుంచి కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో గుజరాత్‌లోని గాంధీ నగర్ నుంచి బరిలో ఉన్నారు. కేంద్ర మంత్రుడు జ్యోతిరాధిత్య సింధియా (గుణ – మధ్య ప్రదేశ్‌) నుంచి బరిలో ఉన్నారు. పురుషోత్తం రూపాల రాజ్‌కోట్ నుంచి బరిలో ఉన్నారు. ప్రహ్లాద్ జోషి కర్ణాటకలోని ధార్వాడ్ నుంచి పోటీ చేస్తున్నారు. 
 
అటు మధ్య ప్రదేశ్ నుంచి మాజీ ముఖ్యమంత్రులు శివరాజ్ సింగ్ చౌహాన్ విదిశ నుంచి బరిలో ఉంటే,  రాజ్ ఘర్ నుంచి మరో మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్ పోటీ ఉన్నారు. అటు కర్ణాటకలోని హవేరి నుంచి మాజీ ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై బరిలో ఉన్నారు. ఇప్పటికే గుజరాత్‌లోని సూరత్‌కు ఏకగ్రీవ ఎన్నిక జరిగింది.
 
మూడో విడత ఎన్నికలు బీజేపీకి కీలకంగా మారనున్నాయి. ఈ దశలో పోలింగ్ జరగనున్న గుజరాత్‌, కర్ణాటక, బిహార్‌, మధ్యప్రదేశ్‌ల్లోని అన్ని సీట్లను 2019 లోక్‌భ ఎన్నికల్లో బీజేపీయే దక్కించుకుంది. ఈసారి వాటిని నిలబెట్టుకునేందుకు ఆ  పార్టీ తీవ్రంగా కృషిచేస్తోంది. ప్రజ్వల్‌ రేవణ్ణ సెక్స్‌స్కాండల్‌ ఆరోపణలు, గుజరాత్‌లో బీజేపీపై రాజ్‌పుత్‌ల ఆగ్రహం నేపథ్యంలో బీజేపీకి ఈ దశ ఎన్నికలు సవాల్ గా మారాయి. కర్ణాటకలో ఈ విడత ఎన్నికలు జరిగే 14 సీట్లనూ గత ఎన్నికల్లో బీజేపీ కైవసం చేసుకున్నది.
 
యూపీలో ములాయంసింగ్‌ యాదవ్‌ కుటుంబానికి ఈ దశ చాలా కీలకం. ఆ కుటుంబం నుంచి ముగ్గురు బరిలో ఉన్నారు. మైన్‌పురీలో డింపుల్‌ యాదవ్‌ పోటీ చేస్తుండగా.. ములాయం మరణం తర్వాత అక్కడ ఉప ఎన్నికల్లో ఆమె గెలుపొందారు. ఎస్పీ జాతీయ ముఖ్య ప్రధాన కార్యదర్శి రామ్‌గోపాల్‌ యాదవ్‌ కుమారుడు అక్షయ యాదవ్‌ ఫిరోజాబాద్‌ నుంచి, శివపాల్‌ యాదవ్‌ కుమారుడు ఆదిత్య యాదవ్‌ బదాయూ నుంచి బరిలో నిలిచారు.
 
  అభ్యర్థుల్లో 120 మందికిపైగా మహిళలు ఉండటం విశేషం. ఈ ఎన్నికలతో దేశ వ్యాప్తంగా 283 స్థానాలకు ఎన్నికల ప్రక్రియ పూర్తవుతోంది. మరో నాలుగు విడతల్లో 262 ఎంపీ సీట్లకు ఎన్నికలు జరగనున్నాయి. మొత్తంగా ఏడు దశల ఎన్నికల తర్వాత జూన్ 4వ తేదిన ఓట్ల లెక్కింపు జరగనుంది.