ఈ ఏడాది జూన్ 29న అమర్‌నాథ్ యాత్ర ప్రారంభంకానున్న నేపథ్యంలో భక్తులు ఇబ్బందులు పడకుండా అధికారులు అన్ని ఏర్పాట్లను ప్రారంభించారు. అమర్‌నాథ్ యాత్రకు రిజిస్ట్రేషన్ ఏప్రిల్ 15 నుండి పార్రంభం అవుతుంది. అమర్‌నాథ్ యాత్ర అత్యంత వ్యయ ప్రయాసలతో కూడినది. హిమ రూపంలో ఉన్న పరమ శివుడిని దర్శించుకునేందుకు దేశ నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు హర హర మహదేవ అంటూ అమర్‌నాథ్‌కు వెళతారు.
ఈ క్రమంలోనే యాత్రలో భద్రతాపరమైన విషయాలపై జమ్మూకాశ్మీర్ అధికార యంత్రాంగం సమీక్ష నిర్వహించింది. అమర్‌నాథ్ యాత్రికులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. జమ్మూకాశ్మీర్ ప్రభుత్వం తాజాగా అమర్‌నాథ్ యాత్ర టైమ్ టేబుల్ ను విడుదల చేసింది. ఈసారి భక్తులు సహజసిద్ధమైన శివ లింగాన్ని 45 రోజులు మాత్రమే దర్శనం చేసుకునే అవకాశం ఉంది.
ఆన్‌లైన్, ఆఫ్‌లైన్లో రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చు. www.jksasb.nic.in వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చు. దక్షిణ కాశ్మీర్‌లోని హిమాలయ పర్వతాల్లో భూమికి 3880 మీటర్ల ఎత్తులో అమర్‌నాథ్ ఆలయం ఉంది. అనంతనాగ్ జిల్లా పహల్గామ్, గండర్ బాల్ జిల్లా బల్టాల్ మార్గాల్లో అమర్‌నాథ్ యాత్ర కొనసాగుతుంది.
అయితే, 13 ఏళ్ల నుంచి 70 ఏళ్ల మధ్య వయస్సులో ఉన్నవారే ఈ యాత్ర చేయాలి. ఆరు నెలల గర్భంతో ఉన్న మహిళలు కూడా యాత్రకు వెళ్లకూడదు. అమర్‌నాథ్ యాత్ర ఆషాఢ మాసంలోని కృష్ణ పక్ష అష్టమి తిథి నాడు ప్రారంభం కానుంది. అంటే జూన్ 29వ తేదీన అష్టమి తిథి మధ్యాహ్నం 02.19 గంటలకు ఈ యాత్ర ప్రారంభం కానుంది.
ఇక, ఆగస్టు 19తో ఈ యాత్ర ముగియనుంది. కాగా, ఈ ఏడాది అధిక సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉందని అమర్‌నాథ్ దేవస్థాన బోర్డ్ అంచనా వేస్తోంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించింది. ఈ యాత్ర వ్యయప్రయాసలతో కూడుకున్నది కావడంతో ప్రభుత్వం పలు షరతులను విధించింది. యాత్ర చేయబోయే ప్రతి ఒక్కరూ శారీరకంగా దృఢంగా ఉండటం తప్పనిసరి. వారు మెడికల్ సర్టిఫికేట్ తీసుకోవడంతోపాటు పలు మార్గదర్శకాలను పాటించాల్సి ఉంటుంది.
అమర్‌నాథ్ యాత్రకు వచ్చేవారు ఇక్కడ ఉష్ణోగ్రతలు చాలా తక్కువ ఉన్న కారణంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. చలిని తట్టుకునేలా ఉన్నితో తయారు చేసిన దుస్తులను తెచ్చుకోవాలి. గొడుగు, హీటర్, రెయిన్ కోట్, వాటర్ ప్రూఫ్ షూ, అవసరమైన సామాగ్రి తెచ్చుకోవాలి. ఐడీ కార్డులు, డ్రైవింగ్ లైసెన్స్, యాత్రకు అనుమతి పత్రాలు తప్పనిసరిగా ఉండాలి.
అంతేగాక, అమర్‌నాథ్ యాత్ర వేళ హెచ్చరికలు ఉన్న చోట ఆగకూడదు. వాహనాలు నిలపకూడదు. స్లిప్పర్లు వేసుకోకూడదు. ట్రెక్కింగ్ షూలు మాత్రమే ధరించాలి. షార్ట్ కట్స్ తో కూడిన మార్గాల కోసం ప్రయత్నించకూడదు. అది ప్రమాదకరం. అమర్‌నాథ్ యాత్ర కోసం నిర్దేశించిన మార్గంలోనే ప్రయాణించాలి. కాలుష్యం, పర్యావరణం దెబ్బతినే విధంగా ఎలాంటి పనులు చేయకూడదు. ప్లాస్టిక్ వస్తువులు వినియోగించకూడదు. నిబంధనలు ఉల్లంఘించరాదు.
More Stories
భారత్ బలం అద్భుతమైన ఏకీకృత స్ఫూర్తిలోనే ఉంది
మహా కుంభమేళాలో భారీ అగ్ని ప్రమాదం
భారత్ లో ఇంటర్నెట్ వినియోగదారులు 90 కోట్లు