ఇథియోపియాలో 8 నెలల్లో 32 లక్షలకు పైగా మలేరియా కేసులు

* ప్రపంచంలో ఆఫ్రికా దేశాల్లోనే మలేరియా మరణాల్లో 95 శాతం  

గత కొద్ది నెలల్లో ఇథియోపియాలో మలేరియాతో మరణాల సంఖ్య భారీగా పెరిగింది. కేవలం ఎనిమిది నెలల్లో 32లక్షలకుపైగా కేసులు నమోదయ్యాయి. తూర్పు ఆఫ్రికా దేశంలోని వివిధ ప్రాంతాల్లో మలేరియా వేగంగా వ్యాప్తి చెందుతుందని స్థానిక ఆరోగ్య మంత్రిత్వ శాఖ హెచ్చరించింది. మలేరియా నివారణకు ప్రయత్నించించాలని సూచించింది. ఇక్కడ ప్రతివారం 70వేల వరకు కేసులు రికార్డవుతున్నాయి.

వర్షాకాలం మరింత వ్యాప్తిని పెరిగే అవకాశం ఉందని, తీవ్ర సంక్షోభానికి దారి తీసే అవకాశం ఉందని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇథియోపియాలో మలేరియా సంబంధిత మరణాల సంఖ్య జనవరిలో 611 ఉండగా.. ఫిబ్రవరి వరకు 764కి పెరిగిందని యూఎన్‌ కార్యాలయం పేర్కొంది. నివేదికల ప్రకారం ఇథియోపియానే కాకుండా కెన్యాతో పాటు ఇతర దేశాల్లో కేసులు పెరుగుతున్నట్లుగా నివేదికలు పేర్కొన్నారు. 

ఇక్కడ సైతం కొద్ది నెలలుగా మరణాలు, కేసులు వేగంగా పెరిగాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ అధికారులు అనేక ఆఫ్రికల్‌ దేశాల్లో మలేరియా ముప్పుపై హెచ్చరికలు జారీ చేశారు. మలేరియా మరణాలు తగ్గించేందుకు చర్యలు తక్షణ చర్యలు తీసుకునేందుకు కట్టుబడి ఉన్నట్లు పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా మలేరియా మరణాల్లో 95 శాతం ఆఫ్రికన్ దేశాల్లో నమోదవుతున్నాయి.

మలేరియా సోకిన దోమల ద్వారా మనుషులకు సోకుతుండగా కొన్ని పరిస్థితుల్లో ప్రాణాంతకంగా మారుతుంది. ఈ ఇన్ఫెక్షన్‌ ఓ వ్యక్తి నుంచి మరో వ్యక్తికి వ్యాపించకపోయినా పరాన్నజీవితో సోకుతుంది. మలేరియా కేసులు శరవేగంగా పెరుగుతున్న ప్రాంతాల్లో దోమలు వృద్ధి చెందకుండా చర్యలు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 

మలేరియా నివారణకు ప్రభావిత ప్రాంతాల్లో టీకాలు వేయాలని నిపుణులు సూచిస్తున్నారు. తాజాగా శాస్త్రవేత్తల బృందం కొత్త వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసింది. దాంతో మంచి ఫలితాలు కనిపించింది. దశాబ్దాల తర్వాత పరిశోధన, ట్రయల్స్‌ తర్వాత మలేరియా నివారణకు కొత్త వ్యాక్సిన్‌ (ఆర్‌టీఎస్‌ ఎస్‌ వ్యాక్సిన్‌) అందుబాటులోకి వచ్చింది.

మలేరియా నివారణలో ప్రభావవంతంగా పని చేస్తుందని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. కామెరూన్ లాంటి దేశాల్లో జనవరి నుంచి బాలింతలకు, ఐదేళ్లలోపు పిల్లలకు వ్యాక్సిన్లు వేస్తున్నారు. మలేరియాను నివారించడంలో ఈ వ్యాక్సిన్ చాలా ప్రభావవంతంగా ఉందని అధ్యయనాల్లో తేలింది. మలేరియా నివారణ దిశలో ఇది గొప్ప విజయాన్ని సాధించగలదని పరిశోధకులు పేర్కొన్నారు. 

అంతకు ముందు ప్రపంచ ఆరోగ్య సంస్థ డిసెంబర్‌లో ఆర్21 వ్యాక్సిన్‌ను ఆమోదించింది. ఈ వ్యాక్సిన్‌ను ఇప్పటికే కొన్ని ఆఫ్రికా దేశాల్లో ఉపయోగిస్తున్నారు. టీకాలు వేయడంతో ఆపటు మలేరియా నివారణకు శరీరానికి కప్పి ఉంచేలా దుస్తులు ధరించాలని, దోమతెరలు వాడాలని సూచిస్తున్నారు. అలాగే దోమలు వృద్ధి చెందకుండా చర్యలు తీసుకోవాలని నిపుణులు చెప్పారు.