గాజాలో తక్షణ కాల్పుల విరమణకు భద్రతా మండలి పిలుపు

ఇజ్రాయెల్, పాలస్తీనా మిలిటెంట్లు హమస్ మధ్య తక్షణం కాల్పుల విరమణ అమలు చేయాలని ఐక్యరాజ్య సమితి భద్రతామండలి (యూఎన్ఎస్సీ) డిమాండ్ చేసింది. బందీలందరినీ భేషరతుగా విడుదల చేయాలని కూడా డిమాండ్ చేసింది. ఈ సమావేశానికి శాశ్వత సభ్యదేశం అమెరికా గైర్హాజరైంది.

కాల్పుల విరమణకు సంబంఢించి మండలి ఇటువంటి తీర్మానం ఆమోదించడం ఇదే మొదటిసారి. ఇంతకు ముందు మూడు పర్యాయాలు కాల్పుల విరమణ తీర్మానాలను తెచ్చినప్పుడల్లా వీటో అధికారాన్ని ఉపయోగించి అడ్డుకున్న అమెరికా ఈసారి ఓటింగ్‌కు గైర్హాజరు కాగా, మండలిలోని మిగతా 14 దేశాలు తీర్మానానికి అనుకూలం గా ఓటు వేశాయి. 

భద్రతా మండలిలోని ఎన్నికైన పది దేశాలు కలసికట్టుగా ఈ తీర్మానాన్ని ప్రతిపాదించాయి. రంజాన్‌ మాసంలో రక్తపాతం సాగిస్తున్న ఇజ్రాయిల్‌ చర్యను అవి నిరసించా యి. కాల్పుల విరమణపై అస్పష్టమైన తీర్మానాన్ని అమెరికా గత వారం తీసుకొచ్చిన ప్పుడు రష్యా, చైనా వీటో చేశాయి. గాజాకు తక్షణమే మానవతా సాయాన్ని విస్తరించాల్సిన ఆవశ్యకతను ఈ తీర్మానం నొక్కి చెప్పింది.

‘పాలస్తీనియన్లు తీవ్రంగా బాధ పడుతున్నారు. ఈ రక్తపాతం సుదీర్ఘంగా కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరింత జాప్యం కాకుండా రక్తపాతానికి ముగింపు పలుకడమే మన బాధ్యత` అని భద్రతా మండలి సమావేశం తర్వాత ఐరాసలో అల్జీరియా రాయబారి అమర్ బెండ్ జామా చెప్పారు.  అయితే ఈ తీర్మానంలో `శాశ్వత కాల్పుల విరమణ’ పదజాలానికి అమెరికా అభ్యంతరం తెలిపింది. `చివరకు కాల్పుల విరమణ’కు  పిలుపు ఇవ్వాలని సూచించింది. ఆ విధంగా చేసిన్నట్లయితే కాల్పుల విరమణకు పరస్పరం షరతుల గురించి చర్చించుకొని అవకాశం రెండు వైపులా ఉంటుందని పేర్కొన్నది.

రంజాన్‌ సందర్భంగా ‘తక్షణ కాల్పుల విరమణ’ డిమాండ్‌ చేస్తూ భద్రతా మండలి మొదటిసారి తీర్మానాన్ని ఆమోదించడం పట్ల అరబ్బు దేశాలు హర్షం వ్యక్తం చేశాయి. శాశ్విత కాల్పుల విరమణ దిశగా వేసిన మొదటి అడుగుగా యెమెన్‌ దీనిని అభివర్ణించింది.

ఇదిలా ఉంటే, ఐరాస భద్రతామండలి తీర్మానంపై అమెరికా తన వీటో అధికారాన్ని వినియోగించుకోకుంటే, వాషింగ్టన్‌కు ప్రతినిధుల టీంను రద్దు చేస్తామని ఇజ్రాయెల్ ఆర్మీ రేడియో ప్రకటించింది. గాజాలో దాదాపు ఆరు నెలలుగా కొనసాగుతున్న యుద్ధ విరమణకు అమెరికా వ్యతిరేకంగా ఉంది. గతంలో ఇటువంటి మూడు తీర్మానాల విషయంలో అమెరికా వీటో అధికారం ప్రయోగించింది.

అక్టోబర్ ఏడో తేదీ దాడి సాకుతో ఇజ్రాయెల్ తన మిత్రపక్షం అమెరికా దన్నుతో పాలస్తీనియన్లపై ప్రతీకార దాడులు చేస్తున్నది. అక్టోబర్ ఏడో తేదీన జరిగిన దాడిలో 1200 మంది మరణించారని ఇజ్రాయెల్ తెలిపింది. హమస్ మిలిటెంట్లు, ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధంలో 32 వేల మందికి పైగా పాలస్తీనియన్లు మరణించడంతో కాల్పుల విరమణకు ప్రపంచ దేశాల నుంచి ఒత్తిడి పెరుగుతున్నది. 

రంజాన్ సందర్భంగా కాల్పుల విరమణ చేయాలని యూఎన్ఎస్సీ తీర్మానించడానికి వీలుగా సమావేశానికి అమెరికా గైర్హాజరైంది. అలాగే బందీలందరినీ బేషరతుగా విడుదల చేయాలని కూడా యూఎన్ఎస్సీ డిమాండ్ చేసింది. అక్టోబర్ ఏడో తేదీ దాడి సందర్భంగా హమాస్ 253 మంది వద్ద బందీలు ఉన్నారని ఇజ్రాయెల్ తెలిపింది.