
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్టయి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కస్టడీలో ఉండడంతో కేజ్రీవాల్ అరెస్టు అక్రమం అంటూ ఆప్ నేతలు, కార్యకర్తలు మంగళవారం ఢిల్లీ వ్యాప్తంగా నిరసనకు దిగారు. మరోవైపు ముఖ్యమంత్రి పదవికి కేజ్రీవాల్ వెంటనే రాజీనామా చేయాలని బిజెపి డిమాండ్ చేస్తోంది. ఈ నేపథ్యంలోనే కాషాయ పార్టీ శ్రేణులు భారీ ర్యాలీ కూడా చేపట్టాయి.
ఇక ఢిల్లీ సీఎం అరెస్టును వ్యతిరేకిస్తూ నిరసన చేపట్టిన ఆప్ నేతలు, కార్యకర్తలను పోలీసులు ఎక్కడికక్కడ అదుపులోకి తీసుకోవడం జరుగుతోంది. ప్రధాని మోదీ ఇంటిని సైతం ముట్టడించేందుకు ఆప్ కార్యకర్తలు ప్రయత్నించారు. కాగా, నిరసన తెలపడానికి అనుమతి లేదని పోలీసులు వెల్లడించారు. “ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు, నేతలు నిరసనలు చేయడానికి అనుమతి లేదు. పటేల్ చౌక్ మెట్రో స్టేషన్ వద్దకు నిరసనకారులు పెద్ద సంఖ్యలో తరలివస్తారని మాకు సమాచారం ఉంది. అందుకే మేము భద్రతా చర్యలు చేపట్టాము” అని ఢిల్లీ డిప్యూటీ పోలీస్ కమిషనర్ దేవేశ్ కుమారు తెలిపారు.
ఈ సందర్భంగా, పంజాబ్ మంత్రి హర్జోత్ సింగ్ బెయిన్స్ , సోమనాథ్ భారతితో సహా పలువురు ఆప్ నాయకులతో పాటు పటేల్ చౌక్ వద్ద కేజ్రీవాల్ అరెస్టును వ్యతిరేకిస్తూ నిరసన తెలుపుతున్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఇక మోదీ నివాసం ముందు ఆప్ శ్రేణులు నిరసనకు దిగడంతో బిజెపి కేజ్రీవాల్ రాజీనామాను డిమాండ్ చేస్తూ ర్యాలీ నిర్వహించింది. ఫిరోజ్‌షా కోట్ల మైదానం నుంచి ఢిల్లీ సెక్రటేరియట్ వైపు బిజెపి మెగా ర్యాలీ చేపట్టింది. జైలు నుంచి పాలన కొనసాగిస్తాననటం సిగ్గుచేటని కాషాయ పార్టీ శ్రేణులు దుమ్మెత్తిపోస్తున్నాయి. అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వ అవినీతికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు.
ఈ క్రమంలో ఇవాళ ఆంళోనలు షురూ చేసిన బీజేపీ నేతలను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు అరెస్ట్ చేసిన వాళ్లలో ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవ కూడా ఉన్నారు.
మరోవంక, ఈడీ కస్టడీలో ఉన్నప్పుడు కేజ్రీవాల్ జారీ చేసిన ఉత్తర్వుల చట్టబద్ధతపై బిజెపి ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ (ఎల్-జి) వినయ్ కుమార్ సక్సేనాకు లేఖ రాసింది. ఈడీ కస్టడీ కింద జలవనరుల శాఖను ఆదేశిస్తూ కేజ్రీవాల్ ఆదివారం తొలి ఉత్తర్వులు జారీ చేశారు. కస్టడీ నుంచి ఆరోగ్య శాఖకు ఆయన మంగళవారం మరో ఆదేశాలు జారీ చేశారు.
కటకటాల వెనుక ఉన్నా ముఖ్యమంత్రి పదవిని వదులుకునేది లేదని ఆప్ పేర్కొంది. అయితే, ఎల్‌జీకి రాసిన లేఖలో, ముఖ్యమంత్రి సంతకం లేనందున కేజ్రీవాల్ ఆదేశాలు నకిలీవి అని బీజేపీ జాతీయ కార్యదర్శి మంజీందర్ సింగ్ సిర్సా ఆరోపించారు. ఉద్దేశించిన కార్యాలయ ఉత్తర్వుల్లో అధికారి ఆర్డర్ నంబర్ లేదా జారీ చేసిన తేదీ లేదని సిర్సా గుర్తు చేశారు.
“అందుకే అతిషి అనధికారికంగా “ఢిల్లీ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కార్యాలయం” “అధికారిక లెటర్-హెడ్”ని అనధికారికంగా ఉపయోగించడం కోసం మంత్రిగా తన అధికారిక సామర్థ్యాన్ని చట్టవిరుద్ధంగా దుర్వినియోగం చేసిందని స్పష్టంగా తెలుస్తుంది” అని సిర్సా లేఖలో ఆరోపించారు. “రిమాండ్ ఆర్డర్” నిబంధనలు, షరతులను మార్చాలని కోరడం ద్వారా కోర్టు నుండి ముందస్తు అనుమతి లేకుండా కేజ్రీవాల్ ఆదేశాలు జారీ చేయలేరని ఆయన స్పష్టం చేశారు. కోర్టు ఆయనకు ఎలాంటి అనుమతి ఇవ్వలేదని గుర్తు చేశారు.
“ఢిల్లీ ముఖ్యమంత్రి కార్యాలయాన్ని రాజ్యాంగ విరుద్ధంగా ఉపయోగించడం ద్వారా అధికారిక రికార్డుల కల్పన, ఫోర్జరీకి” వ్యతిరేకంగా ఎఫ్‌ఐఆర్ నమోదుకు అవసరమైన ఆదేశాలు జారీ చేయాలని సిర్సా ఢిల్లీ ఎల్-జిని
“ఢిల్లీ ముఖ్యమంత్రి కార్యాలయాన్ని రాజ్యాంగ విరుద్ధంగా ఉపయోగించడం ద్వారా అధికారిక రికార్డుల కల్పన, ఫోర్జరీకి” వ్యతిరేకంగా ఎఫ్‌ఐఆర్ నమోదుకు అవసరమైన ఆదేశాలు జారీ చేయాలని సిర్సా ఢిల్లీ ఎల్-జిని కోరారు.ఈ ఉత్తర్వు చట్టవిరుద్ధం, రాజ్యాంగ విరుద్ధం అని పేర్కొంటూ సీఎంఓను ఎవరు వ్యక్తిగత ప్రయోజనాల కోసం దుర్వినియోగం చేస్తున్నారు? అనే విషయమై విచారణ జరపాలని డిమాండ్ చేశారు.
More Stories
జమ్ముకశ్మీర్‌లో 12 మంది పాక్ చొరబాటుదారులు కాల్చివేత
రామ జన్మభూమిలో తొలి `కరసేవక్’ కామేశ్వర చౌపాల్ మృతి
ఐదేళ్లలో తొలిసారి వడ్డీ రేట్లు తగ్గింపు