సీబీఎస్ఈ విద్యార్థులకు ఇక నుంచి కొత్త సిలబస్!

సీబీఎస్ఈ విద్యార్థులకు అలర్ట్! పలు తరగతుల సిలబస్ని మార్చాలని నిర్ణయించింది జాతీయ విద్యాపరిశోధన మండలి (ఎన్సీఈఆర్టీ). ఈ మేరకు 2024-25 విద్యా సంవత్సరంలో 3 నుంచి 6వ తరగతి వరకు సిలబస్, టెక్ట్స్బుక్స్లలో మార్పులు  చేస్తుంది. ఇతర తరగతుల కరికులమ్లో ఎలాంటి మార్పులు ఉండవు.

“క్లాస్ 3 నుంచి క్లాస్ 6 వరకు సిలబస్, టెస్ట్బుక్స్ని మారుస్తున్నట్లు మార్చ్ 18న ఎన్సీఈఆర్టీ మాకు చెప్పింది. ఈ విషయాన్ని అన్ని సీబీఎస్ఈ అనుబంధ సంస్థలకు మేము స్పష్టం చేస్తున్నాము. పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తాము. ఈ కొత్త సిలబస్, టెక్ట్స్బుక్స్నే ఫాలో అవ్వాలని విద్యాసంస్థలకు సూచనలు చేస్తున్నాము,” అని సీబీఎస్ఈ వెల్లడించింది.

 ఎన్సీఎఫ్-ఎస్ఈ 2023 (నేషనల్ కరికూలమ్ ఫ్రేమ్వర్క్ ఫర్ స్కూల్ ఎడ్యుకేషన్)లో భాగంగా ఈ చర్యలు చేపట్టింది ఎన్సీఈఆర్టీ. 2020 నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని దృష్టిలో పెట్టుకుని మార్పులు చేస్తోంది. అయితే అన్ని తరగతు సిలబస్ని మార్చే ఉద్దేశంలో ఎన్సీఈఆర్టీ లేదని ముందు నుంచే వార్తలు జోరుగా సాగాయి. 

అందుకు తగ్గట్టుగానే కేవలం 3 నుంచి 6 తరగతుల వరకు సిలబస్, టెక్ట్స్బుక్స్ని మార్చింది. మిగిలిన తరగతులు విద్యార్థులు ఇప్పుడున్న సిలబస్తోనే కొనసాగుతారు.  ఎన్ఈపీ-2020లో భాగంగా పాఠశాల అధిపతులు, ఉపాధ్యాయులకు ‘కెపాసిటీ బిల్డింగ్ ప్రోగ్రామ్స్’ని ఇవ్వాలని నిర్ణయించుకుంది సీబీఎస్ఈ. 

ఆర్ట్- ఇంటిగ్రేటెడ్ ఎడ్జ్యుకేషన్, ఎక్స్పరిమెంటల్ లర్నింగ్, ఫ్లెక్సిబులిటీ వంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని, సంబంధిత అంశాలను స్కూళ్లల్లో అమలు చేయాలని విద్యాసంస్థలకు సూచించింది. 2020లో క్లాస్ 6 నుంచి క్లాస్ 12 వరకు సిలబస్ని హేతుబద్ధీకరించింది ఎన్సీఈఆర్టీ. కరోనా సంక్షోభం అనంతరం.. విద్యార్థులపై కంటెంట్ లోడ్ని, ఒత్తిడిని తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకుంది.