ఆర్టికల్‌ 370ని రద్దు ఐరాసలో మహారాజ హరి సింగ్‌ మనుమడు మద్దతు

జమ్మూ కశ్మీర్‌లో ఆర్టికల్‌ 370ని రద్దు చేస్తూ భారత ప్రభుత్వం తీసుకున్న సాహసోపేత నిర్ణయాన్ని మహారాజా హరి సింగ్‌ మనువడు ఎంకే అజాతశత్రు సింగ్‌ ఐక్యరాజ్యసమితిలో ప్రశంసించారు. 1947లో భారత్‌తో జరిగిన విలీన ఒప్పందంపై సంతకం చేసిన మహారాజా హరిసింగ్‌ మనుడు, సీనియర్‌ బీజేపీ నేత పాక్‌ అజాతశత్రు పాక్‌ ఆక్రమణలో నివసిస్తున్న ప్రజల దుస్థితిపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ ఐక్యరాజ్య సమితి జోక్యం చేసుకోవాలని కోరారు. 

2019 తర్వాత ఈ ప్రాంతంలో తీవ్రవాద ఘటనలు తగ్గుముఖం పట్టాయని ఐక్యరాజ్య సమితిలో చేసిన ప్రసంగంలో పేర్కొన్నారు.  2004 నుంచి 2014 వరకు జమ్మూ కశ్మీర్‌లో మొత్తం 7,217 ఉగ్రవాద సంఘటనలు జరిగాయి. అయితే, సంస్కరణల కారణంగా ఉగ్రవాద సంఘటనలు 70శాతానికిపైగా తగ్గాయని తెలిపారు. 

గత తొమ్మిదేళ్లలో జమ్మూ కశ్మీర్ మౌలిక సదుపాయాల అభివృద్ధిలో అద్భుతమైన విప్లవాన్ని నమోదు చేసిందని పేర్కొన్నారు. కొత్త వైద్య కళాశాలలు, సొరంగాలు, రైల్వేలైన్లు, పౌర మౌలిక సదుపాయాలున్నాయని చెప్పారు. పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ ప్రజల పరిస్థితిని మెరుగుపరిచేందుకు భద్రతా మండలి తీర్మానాల ప్రకారం కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఐక్యరాజ్యసమితికి విజ్ఞప్తి చేశారు.