ఉక్రెయిన్ పై రష్యా రసాయన ఆయుధాల ప్రయోగం!

రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం కొనసాగుతోంది. మరోవైపు అంతర్జాతీయ రసాయన ఆయుధాల నిషేధాన్ని రష్యా ఉల్లంఘించి రాజయం ఆయుధాలను ఉపయోగిస్తుందని అగ్రరాజ్యం అమెరికా ఆరోపించింది. ఉక్రెయిన్ సైనికులపై ఉక్కిరిబిక్కిరి చేసేలా విషయవాయువు క్లోరోపిక్రిన్‌ను రష్యా ఉపయోగిస్తున్నది అమెరికా పేర్కొంది. 
 
విషపూరితమైన రసాయనాల ఉపయోగం మంచిది కాదని, ఉక్రెనియన్ దళాలను తరిమికొట్టడానికి, యుద్ధంలో వ్యూహాత్మక విజయం సాధించాలనే ఆలోచనతోనే వాటిని ఉపయోగిస్తుండవచ్చని పేర్కొంది. రసాయన ఆయుధాల నిషేధ సంస్థ ద్వారా క్లోరోపిక్రిన్‌ని నిషేధించింది. రష్యాలో క్లోరోపిక్రిన్‌తో పాటు సీఎస్‌, సీఎన్‌ వాయువులతో నింపిన గ్రెనేడ్‌లను సైతం వినియోగిస్తుందని ఉక్రెయిన్‌ సైన్యం ఆరోపించింది.

విష రసాయనాల కారణంగా దాదాపు 500 మంది ఉక్రేనియన్‌ సైనికులు అస్వస్థతకు గురయ్యారని, ఓ సైనికుడు ఊపిరాడక మరణించాడని ఆరోపించింది. ఈ క్రమంలోనే అగ్రరాజ్యం అమెరికా స్పందించింది. ఉక్రేనియన్ దళాలకు వ్యతిరేకంగా రష్యా క్లోరోపిక్రిన్ ఉపయోగించడంతో కెమికల్ వెపన్స్ కన్వెన్షన్-1993ని ఉల్లంఘించిందని ఆరోపిందిచిం.

క్లోరోపిక్రిన్ అనేది ఓ విషవాయువు. దీన్ని తొలిసారిగా ప్రపంచ యుద్ధంలో జర్మన్ దళాలు వినియోగించాయి. దీన్ని పీలిస్తే తీవ్ర అనారోగ్యానికి గురవుతారు. దీంతో 1993లో హేగ్ ఆధారిత సంస్థ ది ఆర్గనైజేషన్ ఫర్ ద ప్రొహిబిషన్ ఆఫ్ కెమికల్ వెపన్స్  దీన్ని నిషేధించారు. అనంతరం 193 దేశాలు క్లోరోపిక్రిన్ నిల్వలను ధ్వంసం చేశాయి.

ఇదిలా ఉండగా, రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం మొదలై రెండేళ్లు దాటింది. 2022 ఫిబ్రవరి 23-24 తేదీల మధ్య కీవ్‌తో పాటు చుట్ట పక్కల నగరాల్లో రష్యా వైమానిక దాడులు ప్రారంభించింది. రష్యా చేసిన ఈ దాడి ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. మరోవైపు ఉక్రెయిన్ కూడా ప్రతీకారం తీర్చుకోవడం ప్రారంభించింది. నాటో సభ్య దేశాలు ఉక్రెయిన్‌కు మద్దతుగా నిలిచాయి. 

అమెరికా, బ్రిటన్, పోలాండ్, ఫ్రాన్స్‌తో సహా అనేక దేశాలు యుద్ధానికి దూరంగా ఉంటూనే ఉక్రేయిన్‌కు సహాయం చేస్తుండగా.. మరోవైపు, చైనా, దక్షిణ కొరియా, ఇరాన్ తదితర దేశాలు ప్రత్యక్షంగా, పరోక్షంగా రష్యాకు అండగా నిలుస్తున్నాయి. భారత్‌ మాత్రం రెండు దేశాల్లో ఏ పక్షం వహించకుండా.. యుద్ధాన్ని ముగించాలని భారత్‌ సూచించింది.