మాస్కోలో ఐఎస్‌ఐఎస్‌ ఉగ్రదాడి.. 60 మంది మృతి

రష్యా రాజధాని మాస్కోలో భారీ ఉగ్రదాడి జరిగింది. క్రాకస్‌ సిటీ కన్సర్ట్‌ హాల్‌లోకి ప్రవేశించిన ఐదుగురు దుండగులు కాల్పులకు తెగబడ్డారు. దీంతో సుమారు 60 మంది మృతిచెందారు. మరో 100 మందికిపైగా గాయపడ్డారు. ప్రముఖ రష్యన్‌ రాక్‌ బ్యాండ్‌ ఫిక్‌నిక్‌ సంగీత కార్యక్రమంలో ఈ దాడి చోటుచేసుకున్నది. 
మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ఫెడరల్‌ సెక్యూరిటీ సర్వీసెస్‌  అధికారులు వెళ్లడించారు.
ఈ కాల్పులకు తామే బాధ్యులమని ఐఎస్‌ఐఎస్‌ ప్రకటించింది. ఈ దాడితో భవనంపై మంటలు చెలరేగాయి. అనంతరం ఆ భవనం మొత్తం వ్యాపించడంతో ప్రాంతం మొత్తం నల్లటిపొగలు కమ్ముకున్నాయి.  తొలుత కన్సర్ట్‌ హాల్‌లోకి ప్రవేశించిన దుండగులు అక్కడున్నవారిపై కాల్పులు జరిపి బీభత్సం సృష్టించారు. మ్యూజిక్‌ షో ముగియడంతో బయటకు వెళ్తున్న సమయంలో ఒక్కసారిగా కాల్పులు జరిపారు.
అయితే ఏం జరుగుతుందో తెలియక అక్కన్నవారు సీట్ల మధ్య దాక్కున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు భారీ సంఖ్యలో అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. హాలులో చిక్కుకున్నవారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. దాడికి పాల్పడినవారిలో ఒకరిని పోలీసులు పట్టుకున్నట్లు తెలుస్తున్నది.  రష్యా భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి.
ఈ దాడిలో తమ దేశం హస్తం లేదని ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ ప్రకటించారు. అయితే దాడి తర్వాత ఉగ్రవాదులు ఏమయ్యారనేది స్పష్టంగా తెలియరాలేదుమాస్కో మేయర్ సెర్గీ సోబ్యానిన్ ఈ దాడిని “భారీ విషాదం”గా అభివర్ణించారు.   రష్యన్ రాక్ బ్యాండ్ పిక్నిక్ ప్రదర్శన కోసం ప్రేక్షకులు గుమిగూడుతుండగా ఈ దాడి జరిగింది. ఉగ్రవాదులు హాలులోకి పేలుడు పదార్థాలను విసిరారు, ఆ తర్వాత మంటలు చెలరేగాయి, అనేక మంది చిక్కుకున్నారు.
 
చనిపోయినవారి కొత్త మృతదేహాలు టాయిలెట్లు, ఫీడింగ్ గదులు, క్లీనర్ల జాబితాను నిల్వ చేసిన గదులలో కనుగొన్నారు.  ఈ దాడి కచేరీ హాలును కూలిపోతున్న పైకప్పుతో మంటల్లోకి నెట్టింది. అనేక సంవత్సరాలలో రష్యాలో అత్యంత ఘోరమైన ఉగ్రదాడిగా భావిస్తున్నారు.  మాస్కో పశ్చిమ శివారులో 6,200 మందికి వసతి కల్పించే పెద్ద సంగీత వేదిక అయిన క్రోకస్ సిటీ హాల్‌లోకి దుండగులు చొరబడిన నిమిషాల తర్వాత దాడి గురించి పుతిన్‌కు సమాచారం అందిందని క్రెమ్లిన్ తెలిపింది.

కాగా, ఈ ఘటనపై అమెరికా అధ్యక్ష భవనం స్పందించింది. ఘటన దృష్యాలు చాలా భయంకరంగా ఉన్నాయని ఆ దేశ జాతీయ భద్రతా సలహాదారు జాన్‌ కిర్బీ తెలిపారు. దీనిపై ఇప్పుడే తాము ఏం మాట్లాడలేమని చెప్పారు. దాడి జరిగే అవకాశం ఉన్నట్లు తాము ఇదివరకే రష్యాను హెచ్చరించినట్లు తెలిపారు.