
రాష్ట్రంలో కులాల గురించి ఎక్కువ ప్రస్తావన జరగడం పట్ల విచారకరం వ్యక్తం చేశారు. కులాలకు అతీతంగా పనిచేసే నేత లేరని ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో చాలామంది నేతలు కుల మతాలకు అతీతంగా సమాజం కోసం పనిచేశారని తెలుపుతూ కొందరు మూర్ఖులు, అజ్ఞానులుగా మారారని ధ్వజమెత్తారు.
తప్పు ఎత్తి చూపితే చాలు కులం, మతం, ప్రాంతం పేరు తెరపైకి తీసుకొస్తున్నారని అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలో ఉన్నవారు నియంతలా వ్యవహరిస్తున్నారని జేపీ మండిపడ్డారు. మద్దతుగా ఉంటే పూల బాట, ప్రత్యర్థిగా ఉంటే ముళ్ల మార్గంగా మారుస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రభుత్వం ఖర్చు చేసే ప్రతి రూపాయి ప్రజలదే అని చెబుతూ మన డబ్బు మన హక్కు అని వివరించారు.
‘దేశానికి, ప్రజలకు మంచి జరగాలంటే ఆర్థిక ప్రగతి అవసరం. గత ఐదేళ్లుగా ఆంధ్రప్రదేశ్‌లో ప్రగతి మాట లేకుండా పోయింది. ఐదేళ్లలో ఏపీ పేరు దిగజారిపోయింది. పెట్టుబడులు పెట్టేందుకు భయపడే పరిస్థితి వచ్చింది. దోపిడీ చేస్తూ.. సంక్షేమ పథకాలు అమలు చేశామని చెబుతున్నారు. ప్రజా పాలన ఇది కాదు అని’ జేపీ ధ్వజమెత్తారు.
ఒడిశా కన్నా దారుణంగా ఆంధ్రప్రదేశ్ పరిస్థితి మారిందని జేపీ మండిపడ్డారు. ‘ఒడిశాలో రూ.26 వేల కోట్ల రెవెన్యూ ఉంది. అవసరం మేరకు అప్పులు చేస్తారు. హంగు లేదు. ఆర్బాటం లేదు. ప్రచారం అంతకన్నా లేదు. ఆర్థికాభివృద్ధి, మౌలిక వసతుల కల్పన సుపరిపాలన అందిస్తోంది’ అని గుర్తు చేశారు.
సంస్కరణలు సాధ్యం కాదు అనేవారు అవినీతి పరులు, అసమర్థులని అంటూ జెపి ధ్వజమెత్తారు. వెయ్యి కిలోమీటర్ల తీర ప్రాంతం ఉండి రెవెన్యూ పెంచుకోలేక పోయారు. కుల, మతం, హింస రాజ్యమేలిన ఉత్తర ప్రదేశ్ తీరు కూడా మారింది. ఏపీ పరిస్థితి మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నచందంగా మారిందని జేపీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
More Stories
బిజెపిపై విషం కక్కడమే వారి అజెండా!
నియోజకవర్గాల పునర్విభజనను 25 ఏళ్లపాటు వాయిదా
ఎఐ 90 శాతం కోడ్ను రాస్తుంది