తెలంగాణ గవర్నర్ గా ఝార్ఖండ్ గవర్నర్ పొన్నుస్వామి రాధాకృష్ణన్ అదనపు బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్ రాజ్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అలోక్ అధారే గవర్నర్‌తో ప్రమాణం చేయించారు. అంతకు ముందు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమార్ గవర్నర్ నియమకానికి సంబంధించి రాష్ట్రపతి ఉత్తర్వులను ప్రకటించారు.
అనంతరం గవర్నర్‌గా రాధాకృష్ణన్‌తో సీజే ప్రమాణం చేయించారు. గవర్నర్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేవంత్ తో పాటు రాధాకృష్ణన్ కుటుంబ సభ్యులు, మంత్రులు, అధికారులు పాల్గొన్నారు. తెలంగాణతో పాటు పుదుచ్చేరికి ఝార్ఖండ్ గవర్నర్ కు అదనపు బాధ్యతలను అప్పగిస్తూ మార్చి 18న రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణ గవర్నర్‌గా విధులు నిర్వర్తిస్తున్న తమిళసై సౌందరాజన్ రాజీనామా చేయడంతో తెలంగాణ బాధ్యతలను ఝార్ఖండ్ గవర్నర్‌కు అప్పగించారు.
రాధాకృష్ణన్ 20204-07 మధ్య కాలంలో తమిళనాడు బీజేపీ అధ్యక్షుడిగా పనిచేశారు. తమిళనాడు బీజేపీలో సీనియర్ నాయకుల్లో ఒకరు. 2023 నుంచి ఝార్ఖండ్ గవర్నర్‌గా ఉన్నారు గతంలో రెండు సార్లు కోయంబత్తూరు నుంచి ఎంపీగా గెలిచారు. కేరళా బీజేపీ ఇన్‌చార్జిగా పని చేశారు. 2016-19 మధ్య ఆలిండియా కాయిర్ బోర్డు ఛైర్మన్‌గా కూడా పనిచేశారు.
రాధాకృష్ణన్ 16ఏళ్ల వయసు నుంచి ఆర్‌ఎస్‌ఎస్‌ల కొనసాగుతున్నారు. దాదాపు నాలుగు దశాబ్దాలుగా బీజేపీతో అనుబంధం ఉంది. రాధాకృష్ణన్ 1957 మే 4న జన్మించారు. 1998, 199లో కోయంబత్తూరు నుంచి ఎంపీగా గెలిచారు. 1998 కోయంబత్తూరు పేలుళ్ల తర్వాత రాధాకృష్ణన్ ఎంపీగా గెలుపొందారు. 98 ఎన్నికల్లో లక్షన్న ఓట్లు, 9లో 55వేల ఓట్ల ఆధిక్యంతో గెలిచారు. 1973 నుంచి ఆయన ఆర్‌ఎస్‌ఎస్‌లో కొనసాగతుున్నారు. 2004, 2014, 2019 ఎన్నికల్లో కోయంబత్తూరు నుంచి పోటీ చేసి ఓడిపోయారు.
More Stories
ఇన్కాయిస్కు సుభాష్ చంద్ర బోస్ పురస్కారం
20 మున్సిపాలిటీలు గ్రేటర్ హైదరాబాద్ లో విలీనం?
తెలంగాణకు రూ.1.32 లక్షల కోట్ల పెట్టుబడులు