మార్చి 15న ప్రారంభమైన ఎన్నికల పోలింగ్ మూడు రోజుల పాటు జరిగి 17న ముగిశాయి. 1999 నుంచి దేశ అధ్యక్షుడిగా కొనసాగుతున్న పుతిన్.. తాజా విజయంతో మరో ఆరేండ్లపాటు అదే పదవిలో ఉండనున్నారు. దీంతో రష్యాలో ఎక్కువ కాలం అధ్యక్షుడిగా పనిచేసిన వ్యక్తిగా జోసెఫ్ స్టాలిన్‌ను అధిగమించనున్నారు.
అధ్యక్షుడిగా మరోసారి ఎన్నికైన తర్వాత పుతిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. రష్యా, నాటో మిలిటరీ కూటమి మధ్య యుద్ధం జరిగితే మూడో ప్రపంచ యుద్ధం ముప్పు ఉంటుందని హెచ్చరించారు. ఈ యుద్ధాన్ని ఎవరూ కోరుకోవడం లేదని చెప్పారు. ప్రస్తుతం ప్రపంచంలో అన్నీ సాధ్యమేనని పేర్కొన్నారు. ఉక్రెయిన్‌తో రష్యా యుద్ధం చేస్తున్న విషయం తెలిసిందే. దీనిపై చర్చించేందుకు ఫ్రాన్స్ తో పాటు ఇంగ్లండ్‌ను ఎంచుకున్నామని పుతిన్ తెలిపారు.
ఉక్రెయిన్‌తో జరుగుతోన్న యుద్ధంలో అణ్వాయుధాలను వాడాల్సిన అవసరం తమకు లేదని అన్నారు. ఇలాంటి ఆలోచన తమకు ఎన్నడూ రాలేదని చెప్పారు. కాగా, ఈ ఎన్నికల్లో పుతిన్‌తో కలిపి నలుగురు అధ్యక్ష పదవికి పోటీపడ్డారు. ప్రధాన రాజకీయ ప్రత్యర్థి అలెక్సీ నావల్నీ గత నెలలో అంటార్కిటికా జైలులో మరణించడంతో 71 ఏండ్ల పుతిన్‌కు దాదాపుగా ఎన్నికల్లో ఎదురు లేకుండా పోయింది. చివరిరోజు ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు పోటెత్తారు.
ఉక్రెయిన్ యుద్ధాన్ని, పుతిన్ విధానాలను వ్యతిరేకిస్తున్నవారు పోలింగ్ కేంద్రాలకు రావాలని దివంగత విపక్ష నేత నావల్నీ మద్దతుదారులు పిలుపునివ్వడంతో ఈ పరిణామం చోటుచేసుకుంది. పలు పోలింగ్ కేంద్రాల్లో ఘర్షణలు కూడా జరిగాయి. కొన్నిచోట్ల బ్యాలెట్ పెట్టెల్లో ఇంకు, ఆకుపచ్చ రంగు యాంటీసెప్టిక్ ద్రావణాలను పోసేశారు.
దేశంలోని పలు ప్రాంతాల్లో నిరసనకారులు అరెస్టయ్యారు. కేరళలోని తిరువనంతపురంతోపాటు పలు యూరప్ దేశాల్లోని ప్రధాన నగరాల్లో ఉన్న రష్యా దౌత్య కార్యాలయాల్లో ఆ దేశ ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్న విషయం తెలిసిందే. ఉక్రెయిన్ యుద్ధ ప్రభావిత ప్రాంతంలో ఆన్‌లైన్ ఓటింగ్‌కు అవకాశం కల్పించారు. 60 శాతానికి మించి పోలింగ్ శాతం నమోదయింది. పుతిన్‌పై మూడు స్నేహపూర్వక పార్టీలకు చెందిన అభ్యర్థులు పోటీకి దిగారు.
More Stories
ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ప్రమాణంలో ప్రత్యేక ఆకర్షణగా ఉష
ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి అమెరికా ఉపసంహరణ
అమెరికాకు స్వర్ణయుగం ప్రారంభం