ఈ వేసవిలో జరగనున్న 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందే ఈ పని చేస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా హామీ ఇచ్చిన కొన్ని నెలల తర్వాత ఈ నిబంధనలను రూపొందించి నోటిఫై చేశారు. 2019 డిసెంబర్ 11న పార్లమెంట్ సీఏఏను ఆమోదించి, 24 గంటల్లోనే చట్టాన్ని నోటిఫై చేసింది.
పార్లమెంటరీ విధానాల ప్రకారం రాష్ట్రపతి ఆమోదం పొందిన ఆరు నెలల్లోపు ఏదైనా చట్టానికి నిబంధనలు రూపొందించాలి, లేదంటే లోక్ సభ, రాజ్యసభలోని సబార్డినేట్ లెజిస్లేషన్ కమిటీల నుంచి పొడిగింపు అవసరం. అర్హులైన వారు భారత పౌరసత్వం కోసం దరఖాస్తులు సమర్పించడానికి నిబంధనలను రూపొందించడానికి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ.. సదరు కమిటీల నుండి క్రమం తప్పకుండా పొడిగింపులు తీసుకుంది.
సీఏఏను ఆమోదించడం వివక్షాపూరితమైనదని, రాజ్యాంగ విరుద్ధమని, ఇది ముస్లింలను వదిలేసి, లౌకిక దేశంలో పౌరసత్వానికి విశ్వాసాన్ని ముడిపెట్టిందని చట్ట వ్యతిరేకులు ఆందోళనలకు దిగారు. 2019లో సీఏఏకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన జ్వాలలు ఎగసిపడ్డాయి. దాదాపు 100 మంది చనిపోయారు. చాలా మంది గాయపడ్డారు.
ప్రతిపక్ష రాజకీయ పార్టీల నాయకులు తీవ్రంగా స్పందించారు. బీజేపీయేతర పాలిత రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమైంది. ఈ చట్టాన్ని అమలు చేయబోమంటూ పలు రాష్ట్రాలు శాసన సభలో తీర్మానం కూడా చేశాయి. మొత్తంగా తీవ్ర ప్రతిఘటన పరిస్థితుల మధ్య ఈ బిల్లు పార్లమెంటు ఆమోదం పొందింది. కాగా సీఏఏని అమలు చేస్తామని 2019 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ హామీ ఇచ్చింది. దీంతో 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందే బీజేపీ తన వాగ్దానాన్ని అమలు పరిచినట్టయ్యింది.
More Stories
అన్న క్యాంటీన్లు ప్రయోజనమే… నిర్వహణకు ఓ కార్పొరేషన్ ఉండాలి!
జిహెచ్ఎంసి మేయర్ విజయలక్ష్మిపై అవిశ్వాసం?
పార్లమెంట్లో ఎన్ఆర్ఐలకు ప్రాతినిధ్యం కల్పించాయి