సూపర్‌ ట్యూస్‌డే ప్రైమరీల్లో బిడెన్, ట్రంప్ సత్తా

సూపర్‌ ట్యూస్‌డే ప్రైమరీల్లో డెమోక్రటిక్‌ పార్టీ అభ్యర్థి, ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌, రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్‌ విజయం సాధించారు. మరో భారతీయ అమెరికన్‌ అభ్యర్థి నిక్కీ హెలీ ఈ రేసు నుండి తప్పుకోనున్నారు. దీంతో వచ్చే నవంబర్‌లో జరగనున్న తుది పోరులో వీరిద్దరి మధ్య పోటీ ఖాయమైనట్లు కనిపిస్తోంది.  

‘సూపర్‌ ట్యూస్‌డే ప్రైమరీ’ కింద మంగళవారం దేశంలోని 15 రాష్ట్రాలు, ఒక టెరిటరీలో ప్రైమరీ ఎన్నికలు జరిగాయి. సూపర్‌ ట్యూస్‌డే ఎన్నికల ఫలితాల్లో   బైడెన్‌ సుమారు అన్ని ప్రాథమిక రాష్ట్రాలను కైవసం చేసుకున్నారు. అయితే సమోవాలో జానస్‌ పామర్‌చేతిలో ఓటమిపాలయ్యారు.  ట్రంప్‌ వెర్మొంట్‌ మినహా అన్ని రాష్ట్రాల్లో గెలుపొందారు. వెర్మొంట్‌లో ఆయన ప్రత్యర్థి నిక్కీ హేలీ విజయం సాధించారు. అయితే పార్టీ తరఫున నామినేషన్‌ పొందడానికి ట్రంప్‌ ఈ నెల 12 వరకు, బైడెన్‌ 19 వరకు వేచిచూడాల్సి వుంది.

తాజా రిపోర్టు ప్రకారం డెమోక్రటిక్ అభ్యర్థి జో బైడెన్‌ సుమారు 14 రాష్ట్రాల్లో విజ‌యం సాధించారు. ఐయోవాలో కూడా త‌మ పార్టీ త‌ర‌పున ప్రైమ‌రీ నెగ్గిన‌ట్లు తెలుస్తోంది. ఇక మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుమారు 12 రాష్ట్రాల్లో రిప‌బ్లిక‌న్ నేత‌గా విజ‌యం సాధించారు. దీంతో నిక్కీ హేలీకి ఆయ‌న గట్టి పోటీగా మారారు. అయితే వెర్మోంట్ రాష్ట్రంలో మాత్రం అనూహ్యంగా నిక్కీ హేలీ ప్రైమ‌రీ రేసులో గెలుపొందారు.

ప్రారంభ పోటీలు ముగిసిన అనంతరం సూపర్‌ ట్యూస్‌డే అనేది అధ్యక్ష ఎన్నికల్లో ముఖ్యమైన దశ. అనేక రాష్ట్రాలకు చెందిన ఓటర్లు ఒకే తేదీన జరిగే ప్రైమరీలలో బ్యాలెట్లు వేస్తారు. కాగా, రిబ్లికన్‌ పార్టీలో అధ్యక్ష అభ్యర్థిత్వానికి ఎంపిక కావడానికి 1,215 మంది ప్రతినిధుల మద్దతు కావాల్సి ఉంటుంది.  అయితే, ఈ ప్రైమరీల్లో ట్రంప్‌ విజయ పరంపర కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం ఆయనకు మద్దతు పలికే డెలిగేట్ల సంఖ్య 893గా ఉంది. నిక్కీ హేలీకి 66 మంది డెలిగేట్లు మాత్రమే మద్దతిస్తున్నారు.

మంగ‌ళ‌వారం జ‌రిగే ప్రైమ‌రీ ఎన్నిక‌ల‌ను అంటారు. మార్చి 5వ తేదీన అమెరికాలోని 15 రాష్ట్రాల్లో ఆ ఎన్నిక‌లు జ‌రిగాయి. అమెరికా అధ్యక్ష అభ్య‌ర్థి కోసం జ‌రిగే ప్రైమ‌రీ ఎన్నిక‌ల క్యాలెండ‌ర్‌లో ఓకే రోజు ఎక్కువ రాష్ట్రాల్లో ఓటింగ్ నిర్వ‌హిస్తారు. దాన్నే సూపర్‌ ట్యూస్‌డే అంటారు. అల‌బామా, అల‌స్కా, కాలిఫోర్నియా, కొల‌రాడో, మెయిన్‌, మ‌సాచుసెట్స్‌, మిన్న‌సొట‌, నార్త్ క‌రోలినా, ఓక్ల‌హామా, టెన్నిస్సీ, టెక్సాస్‌, ఉటాహ్‌, వెర్మోంట్‌, వ‌ర్జీనియా రాష్ట్రాల్లో ఓటింగ్ జ‌రుగుతుంది.

నిక్కీ హేలీ ఖాతాలో మరో విజయం

రిపబ్లికన్‌ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థిత్వం ఆశిస్తున్న భారత సంతతికి చెందిన నిక్కీ హేలీ ప్రైమరీల్లో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. మంగళవారం వెర్మోంట్ రాష్ట్రంలో జరిగిన రిపబ్లికన్‌ ప్రైమరీ ఎన్నికల్లో తన ప్రత్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌పై ఆమె గెలుపొందారు. దీంతో ఇప్పటి వరకూ జరిగిన ప్రైమరీ ఎన్నికల్లో హేలీకి ఇది రెండో విజయం. ఆదివారం జరిగిన వాషింగ్టన్‌ డీసీ  ప్రైమరీ ఎన్నికల్లో కూడా ట్రంప్‌పై హేలీ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే.