
విశ్వహిందూ పరిషత్ వజ్రోత్సవ సంవత్సరం (షష్ఠి పూర్తి/60వ వార్షికోత్సవం) సందర్భంగా భారత్‌లోని లక్ష ప్రదేశాలకు సంస్థను విస్తరింపజేయనున్నట్లు పరిషత్ అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శి మిలింద్ పరాండే వెల్లడించారు. అయోధ్య ధామ్ లో ప్రారంభమైన మూడు రోజుల వీహెచ్‌పీ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్, సెంట్రల్ గవర్నింగ్ కౌన్సిల్ వార్షిక సంయుక్త సమావేశం సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ హిందూ సమాజాన్ని మరింత పటిష్టం చేయాలనే సంకల్పాన్ని బలోపేతం చేయడానికి, జనాభా అసమతుల్యత వంటి తీవ్రమైన సమస్యలపై చర్చించడానికి మేధోమథనం జరుపుతున్నట్లు తెలిపారు.
దేశంలో జరుగుతున్న లవ్ జిహాద్, విదేశీ ముస్లిం చొరబాట్లు, క్రైస్తవ మిషనరీలు గుట్టుగా సాగిస్తున్న అక్రమ మత మార్పిడులు వంటి పరిస్థితులను ఎదుర్కొనేందుకు కార్యాచరణ ప్రణాళికలు రూపొందిస్తామని చెప్పారు. శ్రీ రామ్ లాలా దివ్య మహాభిషేక కార్యక్రమం అనంతరం అయోధ్య ధామ్‌లో నిర్వహిస్తున్న ఈ షష్టిపూర్తి వర్ష సమావేశం సంస్థ కార్యకర్తలలో కొత్త ఉత్సాహాన్ని నింపుతుందని తెలిపారు.
ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ ఏడాది కూడా విశ్వహిందూ పరిషత్‌తో పాటు అనుబంధ సంఘాలైన భజరంగ్‌దళ్, దుర్గావాహిని, మాతృ-శక్తి తదితర సంస్థల శిక్షణా శిబిరాలను కూడా నిర్వహించనున్నట్లు తెలిపారు. దేశంలోని వేలాది మంది హిందూ యువకులు శిబిరాల్లో పాల్గొని జాతి ఉద్ధరణకు కట్టుబడి ఉంటారని చెప్పారు.
కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సీఏఏ చట్టాన్ని సద్వినియోగం చేసుకుంటూ పాకిస్థాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్‌లకు చెందిన హిందూ, జైన, బౌద్ధ, సిక్కు సోదరులకు భారతీయ పౌరసత్వం అందించేందుకు వీహెచ్‌పీ పూర్తి నిబద్ధత, అంకితభావంతో ముందుంటుందని ఆయన తెలిపారు.
ఇప్పటికే భారత్ చేరుకున్న పశ్చిమ బెంగాల్‌లోని సందేశ్‌ఖాలీలోని తల్లులు, సోదరీమణులు, సాధుసంతులపై గజ్వా-ఎ-హింద్ జిహాదీలు కొంతకాలంగా జరుపుతున్న దుర్మార్గమైన, క్రూరమైన దౌర్జన్యాలను ఆయన తీవ్రంగా ఖండించారు. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం, స్థానిక పాలనా యంత్రంగం మానవత్వానికి వ్యతిరేకంగా ఇలాంటి నేరాలకు పాల్పడుతున్న జిహాదీ వేటగాళ్లను ఉరితీయాలని వీహెచ్‌పీ గట్టిగా డిమాండ్ చేసింది.
పశ్చిమ బెంగాల్‌లో అస్థిరత నెలకొందని, నేరస్థులకు చట్టం పట్ల భయం ఉండటం లేదని అంటూ నేరాలు, అఘాయిత్యాలకు పాల్పడేవారు అధికార పార్టీ కార్యకర్తలే కావడంతో అధికార పక్షం నేరుగా వారికి రక్షణ కవచంగా వ్యవహరిస్తోందని మిలింద్ పరాండే ఆరోపించారు. హిందూ సమాజం వారి దారుణమైన చర్యలను ఎన్నటికీ మరచిపోకూడదని హెచ్చరించారు.
భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు సవాళ్లుగా ఎదురుకాకుండా ఉండాలంటే భారత జాతీయ సమాజం అంతా ఐక్యతతో, సంస్థతో కలిసి రావాలని, ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసే శక్తిని గుర్తుపెట్టుకుని హిందూమత భావాలు కలిగిన వ్యక్తులు అధికారంలోకి వచ్చేలా చూడాలని ఆయన పిలుపిచ్చారు. దౌర్జన్యాలు, అకృత్యాలు, దుష్ప్రవర్తనను అంతం చేయడానికి, మన సార్వత్రిక ఓటు హక్కును మనం బాగా ఉపయోగించుకోవాలని సూచించారు.
ఈ సమావేశాల్లో విశ్వహిందూ పరిషత్ కేంద్ర అధ్యక్షుడు డా.ఆర్.ఎన్. సింగ్, (పద్మశ్రీ), వర్కింగ్ ప్రెసిడెంట్ అలోక్ కుమార్, ఉపాధ్యక్షుడు చంపత్ రాయ్ కూడా పాల్గొంటున్నారు. హాజరవుతారు.
More Stories
రైళ్ల పేర్లలో గందరగోళంతో ఢిల్లీలో తొక్కిసలాట!
అక్రమ వలసదారులతో అమృత్సర్ కు మరో రెండు విమానాలు
భారతదేశ వారసులు హిందువులే