స్వతంత్ర భారతదేశ చరిత్రలోనే మునుపెన్నడూ లేని విధంగా అనేక రైతు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రైతుల ప్రధానిగా చరిత్ర పుటలకెక్కనున్నారని బిజెపి కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్ రెడ్డి తెలిపారు.
బిజెపి కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో గత పది సంవత్సరాల నరేంద్ర మోదీ పాలనలో అమలు చేసిన రైతు సంక్షేమ కార్యక్రమాలను గ్రామస్థాయిలో రైతులను కలిసి వివరించేందుకు చేపట్టిన గ్రామ పరిక్రమ యాత్ర ఉత్తర ప్రదేశ్ లోని ముజఫర్ నగర్ నుండి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చేతుల మీదుగా కిసాన్ మోర్చా జాతీయ అధ్యక్షుడు రాజ్ కుమార్ చాహర్ ఆధ్వర్యంలో సోమవారం ప్రారంభించారు.
దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమ ప్రత్యక్ష ప్రసారాన్ని వివిధ జిల్లాలలో రైతులతో బిజెపి కిసాన్ మోర్చా నాయకులు కలిసి వీక్షించే కార్యక్రమంలో భాగంగా రంగారెడ్డి జిల్లా మహేశ్వరం అసెంబ్లీ నాగారం గ్రామంలోని ఒక వ్యవసాయ క్షేత్రంలో ఏర్పాటుచేసిన ప్రత్యక్ష ప్రసార వీక్షణ కార్యక్రమంలో రైతులు, బిజెపి నాయకులతో కలిసి శ్రీధర్ రెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ మాట్లాడుతూ యూపీఏ 1, యూపీఏ 2 హయాంలో కుదేలైన వ్యవసాయ రంగాన్ని నరేంద్ర మోడ్ పట్టాలెక్కించారని, అందులో భాగంగా వ్యవసాయ ఉత్పత్తులకు మద్దతు ధరను గణనీయంగా పెంచారని తెలిపారు. కిసాన్ సమ్మాన్ నిధి పేరుతో చిన్న సన్న కారు రైతులకు ఏటా రూ 6,000 పెట్టుబడి కార్యక్రమాన్ని అమలు చేశారని చెప్పారు.
అంతర్జాతీయ మార్కెట్లో రసాయన ఎరువుల ధరలు విపరీతంగా పెరిగినప్పటికీ వ్యవసాయ రంగానికి మద్దతుగా నిలవాలని పాత దరలకే డిఎపి యూరియాను అందుబాటులో రైతులకు ఉంచిన ఘనత ఈ ప్రభుత్వానిదే అని శ్రీధర్ రెడ్డి పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా సేంద్రియ వ్యవసాయాన్ని ప్రాకృతిక వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తూ మన వ్యవసాయ ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెట్లో గిరాకీ పెరిగేలా ప్రభుత్వం చర్యలు చేపడుతుందని తెలిపారు.
ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించడంతోపాటు వ్యవసాయంలో నూతన సాంకేతిక ఆవిష్కరణలను కూడా మోదీ ప్రభుత్వం వేగంగా ముందుకు తీసుకు వెళుతున్నదని శ్రీధర్ రెడ్డి గుర్తు చేశారు ఈ నేపథ్యంలోనే కిసాన్ మోర్చా జాతీయ అధ్యక్షుడు రాజ్ కుమార్ చాహర్ నేతృత్వంలో దేశవ్యాప్తంగా బిజెపి కిసాన్ మోర్చా నాయకులు కార్యకర్తలు గ్రామాలకు వెళ్లి రచ్చబండ వద్ద మోదీ ప్రభుత్వ రైతు సంక్షేమ పథకాలను వివరించనున్నమని చెప్పారు.
ఈ క్రమంలో ఆయా గ్రామాల్లో ఉత్తమ రైతులను మిలటరీ రిటైర్డ్ జవాన్లను సన్మానించబోతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ పనిముట్లకు పూజలు నిర్వహించడంతోపాటు సహచర బిజెపి నాయకులతో కలిసి గోపూజలు నిర్వహించారు. బిజెపి రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు బొక్కా నరసింహారెడ్డి ,కిసాన్ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యులు పాపన్న గౌడ్, జిల్లా అధ్యక్షుడు రవీందర్ రెడ్డి కూడా పాల్గొన్నారు.
More Stories
అల్లు అర్జున్ కు హైకోర్టులో మధ్యంతర బెయిల్
సంధ్య థియేటర్ ఘటనలో అల్లు అర్జున్ అరెస్ట్
అత్యంత శక్తిమంతమైన మహిళగా నిర్మలా సీతారామన్