సొంత భూమిలోనే పరాయివారైన ఆదివాసీయులు

డాక్టర్ దాసరి శ్రీనివాసులు, ఐఏఎస్ (రిటైర్డ్)
 
కొన్ని చారిత్రక కారణాల ఫలితంగా  ఆదివాసీల భూమి అన్యాక్రాంతమవుతూ వచ్చింది.  ఈ సమస్యలు నేటికీ కూడా కొనసాగుతూ ఆదివాసీలకు, వారి అభివృద్ధికి నష్టం కలిగిస్తూనే ఉన్నాయి. స్థానికంగా `పట్లాల్’ అని పిలువబడే గోండ్ పటేల్ ఆత్రం జంగు గిరిజన నాయకుడు.  పూర్తిగా ఆదివాసీ గిరిజనులు నివసించే ఓ గ్రామంలో రెవెన్యూ గ్రామంలో విస్తారమైన సారవంతమైన భూమి అతనికి ఉంది.
 
ఈ రోజు నిర్మల్ పట్టణం అని పిలవబడే ఆదిలాబాద్ జిల్లా నుండి విభజించి జిల్లా కేంద్రంగా చేసిన నగరానికి ఇదెంతో దూరంలో లేదు. ఈ శతాబ్దపు మలుపులో, అప్పటి నిజాం ప్రభుత్వం జిల్లాలోని పశ్చిమ కనుమల గుండా ‘గొప్ప రహదారి’ నిర్మాణాన్ని ప్రారంభించింది. జాతీయ రహదారి నెం. 7గా పిలువబడే ఈ రహదారి నేడు తెలంగాణ, మహారాష్ట్రలోని పొరుగు జిల్లాల నుండి సంపన్నులు, వడ్డీ వ్యాపారులు, వ్యాపారుల రాకపోకలకు సౌకర్యవంతంగా ఉంది.
 
పచ్చని అటవీ భూములు కలిగించే ఆర్థిక ప్రయోజనాలను వారు ఈ ప్రాంతం చూడగానే గ్రహించారు. ఆ విధంగా ఆదివాసీలపై నిర్దాక్షిణ్యంగా దోపిడీకి తెర లేపారు. నిజాయితీ, విశ్వసనీయత, ఆప్యాయతలతో పాటు సంప్రదాయ ఆతిథ్యంతో మోసపూరిత,  దుష్ట గిరిజనేతర అతిథులను ముక్తకంఠంతో జంగు స్వాగతించాడు. ఈ హనీమూన్ తక్కువ కాలమే కొనసాగి ఆ తర్వాత చేదు గుళికగా మారింది.
 
వలసరాజ్యంలో కొన్ని సంవత్సరాల్లోనే ఈ ఆహ్వానించబడని అతిథులతో జంగు, అతని పరివారంలోని వారి భూములు హరించుకు పోయాయి.  తమ పూర్వీకుల నుండి వస్తున్న భూముల నుండి జంగు, అతను బంధువులను తరిమి వేసేందుకు ఒక ప్రకాశవంతమైన ఉదయాన్నే ‘గిర్దావర్’ (రెవెన్యూ ఇన్స్పెక్టర్) వచ్చాడు.
 
‘షాహూకర్లకు’ ప్రభుత్వం పట్టా మంజూరు చేసిన భూములను కబ్జా చేశారని ఆదివాసీయులను దోషులుగా తేల్చారు. మహాత్మా గాంధీ దండి వైపు సత్యాగ్రహ యాత్ర జరుపుతున్న సమయంలోనే ఇది జరిగింది. తమ పురాతన దేవుళ్ల ఆవాసాల నుండి స్థానభ్రంశం చెంది, జంగు, అతని గూడెం ప్రజలు కొత్త ఇంటిని వెతుక్కుంటూ కొండ అడవిని ట్రెక్కింగ్ చేసి చివరకు దట్టమైన అడవి మధ్యలో ఉన్న ప్రదేశంలో స్థిరపడ్డారు.
 
అప్పటి నుండి ఆ చిన్న గిరిజన కుగ్రామాన్ని `ఉట్నూర్’ అని పిలవడం ప్రారంభించారు. ఇప్పుడు అది ఆదిలాబాద్ జిల్లా గిరిజన అభివృద్ధి ఏజెన్సీ (ఐటిడిఎ) ప్రధాన కార్యాలయంగా ఉంది.
 
వృద్ధాప్యంతో జంగు తన బంధువులతో పొదలను నరికి అడవిని తొలగించి, తమ కనీస అవసరాలు తీర్చుకోవడం కోసం చిన్న చిన్న పొలాలను సాగు చేయడం ప్రారంభించాడు. ఆ వెంటనే జంగు, అతని సహచరులు గిరిజనులు సాగుచేసే భూములతో సహా వేలాది ఎకరాల భూమిపై తమకు సంపూర్ణ హక్కులు కల్పించే ‘సనద్’తో గుర్రంపై నిజాం రక్త సంబంధీకులు అక్కడకు వచ్చారు.
 
ఆ విధంగా ఒక ఇజారా గ్రామం (8) ఏర్పడింది. జంగు, అతని తోటి గిరిజనులు ఇజార్దార్ కౌలుదారులయ్యారు. అప్పటి 2వ తాలూకదార్ దయతో వారి పేర్లు `రక్షిత కౌలుదారులు’గా నమోదయ్యాయి. 1950వ దశకంలో స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఆ విధంగా ‘భూ యజమానులు’ హోదా నుండి గిరిజన సాగుదారులు ‘సెర్ఫ్స్’ స్థితికి దిగజారారు.
 
విధి మళ్లీ జంగుకు అన్యాయం చేసింది.‘నిష్క్రియ కర్మ’ అన్నట్లుగా ఇజార్దార్ అప్పటికే గిరిజన కౌలుదారుల సాగులో ఉన్న ఈ భూములను సంపద కూడదీసుకోవడం కోసం నాందేడ్ (మహారాష్ట్ర) నుండి పచ్చని పచ్చిక బయళ్లను వెతుక్కుంటూ వచ్చిన ఒక భూస్వామికి విక్రయించాడు. గుండె పగిలిన జంగు మరణించాడు.
 
ఎడతెగని భారం అతని కొడుకు `సోము’పై మోపింది. అందువలన, అతను ఒక రోగలక్షణంతో తప్పని పరిస్థితుల వలయంలో చిక్కుకున్నాడు! నిరాశ్రయులైన, భూమిలేని, సోము, అతని వంశం ఒక అడవిని తొలగించి, జీవనోపాధి కోసం చంద్రాపూర్ నుండి వచ్చిన మహర్‌లతో కలిసి మళ్లీ సాగు ప్రారంభించారు.
 
అంతలోనే,  పట్టీ (పన్ను) వసూలు చేసుకునేందుకు ఫారెస్ట్ గార్డు అక్కడకు  చేరుకున్నాడు. సోము, ఇతరులు `రిజర్వ్ అటవీ భూమి’ సాగు నుండి బలవంతంగా తొలగించబడే వరకు దశాబ్దాలుగా వారి కథ అలాగే సాగింది.  విచిత్రం ఏమిటంటే, గిరిజనేతర సాగుదారులు మాత్రం తమ హక్కులను అనుభవిస్తూనే ఉన్నారు.
 
రిజర్వ్ ఫారెస్ట్ పరిధిని వారి విధిరేఖ మాదిరిగా అలా గీసుకున్నారని సోము తదితరులకే చెప్పారు. అంతులేని దుఃఖం, వినాశనంల మధ్య, నిజాం రాష్ట్రానికి ప్రత్యేకమైన కౌలు చట్టం ప్రకారం అద్దె ధృవీకరణ పత్రాల రూపంలో వారికో ఆశాకిరణం కనిపించింది. భూమిపై భౌతికంగా వారి భూమిని గుర్తించకుండానే వారికి కౌలు పట్టాలను నోషనల్‌గా మంజూరు చేశారు.
 
దానితో ఆయా భూముల యాజమాన్యంపై రెవెన్యూ (అటవీ) కోర్టుల నుండి హైకోర్టు, ఆపై సుప్రీంకోర్టు వరకు ఎడతెగని న్యాయ పోరాటాలు జరిగాయి. అసలు సాగుదారులకు భూమి హక్కులు అంతంతమాత్రంగానే ఉన్నాయి. తన విధిని నిందిస్తూ సోము ఆశలన్నీ వదులుకున్నాడు. ఈ చారిత్రక దశలో, ఒక తెలివైన తహశీల్దార్ ఒక కాగితాన్ని ఇచ్చాడు.  దానిని ‘లావోని’ పట్టా అని పిలుస్తారు, 
 
దీని ఫలితంగా ప్రభుత్వపు మరో భూమి హక్కు కల్పన ప్రవాసంకు దారితీసింది. కానీ వాగ్దానం చేసిన భూమి మాత్రం కనుచూపు మేరలో కనిపించలేదు. సోము తమ పురాతన ప్రాంతం నుంచి పలాయనం చిత్తగించి సొంత భూమికి దూరమయ్యాడు. ప్రభుత్వపు ‘ప్రధాన స్రవంతి’ కార్యక్రమం సంపూర్ణమైంది!!
 
సంక్షిప్తంగా చెప్పాలంటే ఆత్రం జంగు, సోముల కథ ఆదిలాబాద్ జిల్లాలో ఆదివాసీల పరాయీకరణ సుదీర్ఘ చరిత్ర. గిరిజనుల భూమిని ఇలా అన్యాక్రాంతం చేయడం వామపక్ష తీవ్రవాదానికి ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా భూమికను అందించింది. అయితే ఈ అంశం మాత్రమే దాని ఆవిర్భావానికి కారణమని చెప్పుకోవడం చాలా అమాయకత్వం కాగలదు.
(ముట్నూరులో గతంలో సబ్ కలెక్టర్ గా రచయిత పనిచేశారు)