ప్రధానిపై అనుచిత వాఖ్యలు .. రాహుల్ దిష్టి బొమ్మ దగ్ధం

 జోడో న్యాయ యాత్రలో భాగంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు ఖండిస్తూ  బిజెపి ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు గంధమల ఆనంద్ గౌడ్ ఓబీసీ నాయకులతో కలిసి బిజెపి రాష్ట్ర కార్యాలయం వద్ద శుక్రవారం రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దహనం చేశారు. 

ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశ విదేశాలలో నరేంద్ర మోదీ  భారతదేశాన్ని అగ్రస్థానానికి తీసుకెళ్తున్న విషయాన్ని ప్రపంచ దేశాలే గుర్తిస్తున్నప్పుడు తరుణంలో దేశంలో స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత దేశాన్ని సుదీర్ఘకాలం పాలించిన కాంగ్రెస్ పార్టీ బీసీల పట్ల ఎప్పుడు నిర్లక్ష్య వైఖరినే ప్రదర్శించిందని ధ్వజమెత్తారు.  కానీ మోదీ ప్రధాని అయిన తర్వాత రాజకీయంగా, బడుగు బలహీన వర్గాల సంక్షేమం గురించి చేసిన పనులు ఈ దేశ చరిత్రలో మరెవ్వరు చేయలేదని స్పష్టం చేశారు. 

అలాంటి ప్రధానిని `మీరు బిసి కాదు..  బిసి అని దేశాన్ని మోసం చేశారు’ అని పేర్కొన్న రాహుల్ గాంధీ వెంటనే ప్రధానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్  చేశారు. చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో ఓబీసీ మోర్చా ముఖ్య నాయకులు సంజయ్ ఘనటే, పిట్టల చంద్రశేఖర్, శరద్ సింఘ్ ఠాకూర్, రవికుమార్ శంకరోళ్ల , వెంకట్ జన్ను తదితరులు పాల్గొన్నారు.

అంతకు ముందు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు మీడియాతో మాట్లాడుతూ  రాహుల్ గాంధీ  భారత్ జోడో యాత్రలో చేస్తున్న ప్రసంగాలు సభ్యసమాజం సిగ్గుపడేలా ఉన్నాయని, స్థాయిని మించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు.  అవగాహనా రాహిత్యంతో భారత రాజకీయ వ్యవస్థ గురించి, భారత కులవ్యవస్థ గురించి ఏ మాత్రం తెలియకుండా అజ్ఞానంతో మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు.

ప్రధాని  మోదీని ఓబీసీ కాదని ఇష్టానుసారంగా మాట్లాడడం సిగ్గుచేటని విమర్శించారు. ఇదే ధోరణితో గతంలో రాహుల్ గాంధీ పార్లమెంటు నుండి సభ్యంతం కోల్పోయారని గుర్తు చేశారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ కుల వ్యవస్థ గురించి, భారతదేశంపై రాహుల్ గాంధీ గారికి అసలు అవగాహన ఉందా? అని ప్రశ్నించారు.
మోదీ ముఖ్యమంత్రి కాకముందే వారి కులం ఓబీసీలో చేరిన విషయం రాహుల్ గాంధీకి తెలియదా? అంటూ నిలదీశారు.

అసలు రాహుల్ గాంధీ ఎవ్వరో ఆయన జన్మ రహస్యాన్ని వివరించాలని వెంకటేశ్వర్లు సవాల్ చేశారు. రాహుల్ తల్లిదండ్రులు నిజంగా హిందువులేనా? సమాధానం చెప్పాలని నిలదీశారు.  మొన్ననే మహాత్మా గాంధీ గారి మనవడు గాంధీ వారసత్వాన్ని కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ  వాడుకోవద్దని స్పష్టంగా చెప్పారని గుర్తు చేశారు.