
పిషిన్ జిల్లాలో స్వతంత్ర ఎన్నికల అభ్యర్థి కార్యాలయంలో జరిగిన మొదటి దాడిలో 14 మంది మరణించారు. ఆ తర్వాత ఆఫ్ఘాన్ సరిహద్దుకు సమీపంలోని ఖిల్లా సైఫుల్లాలో మరో పేలుడు జరిగింది. అయితే జమియాత్ ఉలేమా ఇస్లాం (జేయుఐ) కార్యాలయాన్ని లక్ష్యంగా చేసుకుని ఈ దాడి జరిగినట్లు తెలుస్తోంది. ఇక్కడ జరిగిన దాడిలో కనీసం 10 మంది చనిపోయినట్లు సమాచారం.
ఈ పేలుళ్లపై ఎన్నికల సంఘం స్పందిస్తూ బలూచిస్థాన్ చీఫ్ సెక్రటరీ, ఇన్‌స్పెక్టర్ జనరల్‌ను తక్షణ నివేదికలను ఇవ్వాలని కోరింది. సంఘటనల వెనుక ఉన్న వారిపై చర్యలు తీసుకోవాలని సూచించింది. మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. శక్తిమంతమైన మిలిటరీ మద్దతు షరీఫ్‌కు ఉందని భావిస్తున్నారు.
మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ జైలులో ఉండడంతో షరీఫ్ సారథ్యంలోని పాకిస్తాన్ ముస్లిం లీగ్ -నవాజ్ (పిఎంఎల్-ఎన్) ఈ ఎన్నికల్లో ఏకైక పెద్ద పార్టీగా అవతరించవచ్చునని భావిస్తున్నారు. ఇమ్రాన్ ఖాన్‌కు చెందిన పాకిస్తాన్ తెహ్రీక్ ఎ ఇన్సాఫ్ (పిటిఐ) అభ్యర్థులు స్వతంత్రంగా ఎన్నికలలో పోటీ చేస్తున్నారు.
పార్టీ ఎన్నికల చిహ్నం ‘బ్యాట్’ వినియోగానికి ఎన్నికల కమిషన్ విధించిన ఆంక్షలను సుప్రీం కోర్టు సమర్థించడం ఇందుకు కారణం. 74 ఏళ్ల షరీఫ్ గురువారం ఎన్నికల్లో రికార్డు స్థాయిలో నాలుగవ సారి ప్రధాని పదవి చేపట్టాలని ఆశిస్తున్నారు. పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ (పిపిపి)కి చెందిన బిలావల్ భుట్టో జర్దారి కూడా బరిలో ఉన్నారు. ఆయనను పిపిపి ప్రధాని అభ్యర్థిగా ప్రకటించింది.
More Stories
ఏప్రిల్ 5న ప్రధాని మోదీ శ్రీలంక పర్యటన
ఒక్క రోజులోనే 1000 ట్రంప్ గోల్డ్ కార్డుల విక్రయం
తాలిబన్లు బాలికల విద్యపై నిషేధం ఎత్తేయాలి