ఎస్సి, ఎస్టీ, బిసిల సంక్షేమంకు ఏపీలో భారీ కోత

ఓట్‌ ఆన్‌ ఎకౌంట్‌ బడ్జెట్‌లో షెడ్యూలు కులాలు, తెగలు, ఇతర వెనుకబడిన తరగతుల సంక్షేమంకు ఏపీ ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కేటాయింపులు భారీగా తగ్గించారు. షెడ్యూలు కులాలు, తెగలు, ఇతర వెనుకబడిన తరగతుల సంక్షేమంకు 2023-24లో రూ.50888.20 కోట్లు కేటాయించగా సవరణ బడ్టెట్‌లో రూ.50,792.02 కోట్లు ఖర్చు అవుతాయని అంచనా వేశారు. 2024-25లో రూ.44104.20 కోట్లను మాత్రమే కేటాయించారు. 

అలాగే నీటిపారుదల రంగానికి పెద్దగా ప్రాధాన్యత లభించలేదు. 2023-24లో రూ. 755.76 కోట్లు కేటాయించగా సవరణ బడ్టెట్‌లో రూ.871.27 కోట్లు ఖర్చు అవుతాయని అంచనా వేశారు. 2024-25లో రూ.824.24 కోట్ల మాత్రమే కేటాయించేందుకు అంచనాలను రూపొందించారు. 

అయితే వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమానికి 2023-24లో రూ. 14,469.13 కోట్లు కేటాయించగా సవరణ బడ్టెట్‌లో రూ.13,887.63 కోట్లు ఖర్చు అవుతాయని అంచనా వేశారు. 2024-25లో రూ.15,406.59 కోట్లు ఖర్చు చేయాలని నిర్ణయించారు. కార్మికులు,కార్మిక సంక్షేమం, నైపుణ్య అభివృద్ధికి 2023-24లో రూ. 792.32కోట్లు కేటాయించగా సవరణ బడ్టెట్‌లో రూ.518.37 కోట్లు ఖర్చు చేస్తున్నట్టు అంచనా వేశారు. 2024-25లో రూ.816.93 కోట్లు ఖర్చు చేయనున్నట్టు బడ్జెట్‌ అంచనాల్లో పేర్కొన్నారు. 

సాంఘీక సంక్షేమంలో 2023-24లో రూ.10,894.93 కోట్లు కేటాయించగా సవరణ బడ్టెట్‌లో రూ.10,620 కోట్లు ఖర్చు అవుతాయని అంచనా వేశారు. 2024-25లో రూ.11,381.19 కోట్లు ఖర్చు చేశారు.వ్యవసాయ అనుబంధ రంగాలకు 2023-24లో రూ.13,156.15 కోట్లు కేటాయించగా సవరణ బడ్టెట్‌లో రూ.11,681.43 కోట్లు ఖర్చు అవుతాయని అంచనా వేశారు. 

2024-25లో రూ.13,562.80 కోట్లను కేటాయించారు. గ్రామీణాభివృద్ధికి, ఉపాధిహామీకి కేటాయించిన నిదుల కన్నా 2023-24లో ఖర్చు చేసినవి బాగా తగ్గాయి. 2023-24లో రూ. 14,282.07 కోట్లు కేటాయించగా సవరణ బడ్టెట్‌లో రూ.12,459.87 కోట్లు ఖర్చు అవుతాయని అంచనా వేశారు. 2024-25లో రూ.14,566.15 కోట్లను మాత్రమే కేటాయించారు. 

ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో గ్రామీణ ఉపాధికి 5115.38 కోట్లు ఖర్చు చేస్తామని చెప్పి కేవలం 3235.10 కోట్లు మాత్రమే ఖర్చు చేస్తున్నట్టు సవరణ బడ్జెట్‌లో పేర్కొన్నారు. విద్యుత్‌శ్చక్తి సంబంధించి ఇంధన రంగంలో 2023-24లో రూ.5858.73 కోట్లు కేటాయించగా సవరణ బడ్టెట్‌లో రూ.8482.13 కోట్లతో ఖర్చును భారీగా పెంచారు. 2024-25లో రూ. 6457.99 కోట్లను కేటాయించారు. 

పరిశ్రమలకు 2023-24లో రూ.1402.78 కోట్లు కేటాయించగా సవరణ బడ్టెట్‌లో రూ.1651.86 కోట్లు ఖర్చు అవుతాయని అంచనా వేశారు. 2024-25లో రూ.1480. 98 కోట్లను కేటాయించారు.