కర్నాటకలో హనుమాన్ జెండా తొలగింపు అంశం వివాదాస్పదమైంది. మాండ్యలోని కేరగోడు గ్రామంలో హనుమాన్ జెండాను తొలగించారు. దీంతో బీజేపీ ఆందోళనకు దిగింది. నిరసనకారుల్ని చెదరగొట్టేందుకు పోలీసులు రంగ ప్రవేశం చేశారు.
సుమారు 108 అడుగుల ఎత్తు ఉన్న ఓ పోల్‌పై హనుమాన్ జెండాను ఎగురేశారు. దీనిపై వివాదం చెలరేగింది. అయితే జెండాను తీసివేయడం పట్ల అక్కడ ఆందోళన మొదలైంది. దీంతో ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో సెక్షన్ 144ను విధించారు. గ్రామ పంచాయతీ ఆదేశాల మేరకు భారీ జెండాను పాతారు. కానీ ఆ జెండాకు విరుద్ధంగా ఫిర్యాదులు నమోదు అయ్యాయి.
కానీ గ్రామస్థులు మాత్రం ఆ జెండా ఉండాలని పట్టుపట్టారు. కొందరు రాజకీయం చేస్తున్నట్లు ఆరోపించారు. ఆ జెండాను తొలగించేందుకు భారీ సంఖ్యలో పోలీసులు వచ్చారు. ఆ సమయంలో బీజేపీ, జేడీఎస్, భజరంగ్ దళ కార్యకర్తలు కూడా నిరసనలో పాల్గొన్నారు. జెండా తొలగింపును వ్యతిరేకిస్తూ శనివారం గ్రామస్థులు ఆందోళన చేశారు. ఆదివారం కూడా ఆందోళన కొనసాగింది.
స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యే రవికుమార్ బ్యానర్లను ధ్వంసం చేయడం వల్లే జెండా తొలగింపు అంశం రాజకీయ రంగు పులుముకున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. హనుమాన్ జెండాను తొలగించడాన్ని బీజేపీ నేతలు, హిందూ కార్యకర్తులు తీవ్రంగా వ్యతిరేకించారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో నిరసనలు చేపట్టనున్నట్లు బీజేపీ తన ప్రణాళికలు ప్రకటించింది.
కర్నాటక ప్రతిపక్ష నేత అశోక మీడియాతో మాట్లాడుతూ ఎందుకు రాముడిని, హనుమాన్‌ను కాంగ్రెస్ పార్టీ ద్వేషిస్తోందని ప్రశ్నించారు. టిప్పు సుల్తాన్‌పై ఆ పార్టీ ప్రశంసలు ఎందుకు కురిపిస్తోందని నిలదీసేరు.
ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తన పేరుతో రాముడు ఉన్నట్లు పేర్కొన్నారని, ఇక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ తన పేరుతో శివుడు ఉన్నట్లు పేర్కొన్నారని, కానీ పోలీసు దళంతో ఎందుకు హనుమాన్ జెండాను తొలగించారని విస్మయం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నేతలకు హిందువులపై నిజమైన ప్రేమ లేదని ప్రతిపక్ష నేత అశోక్ ఆరోపించారు.
More Stories
ర్యాగింగ్‌పై కఠిన చర్యలు చేపట్టండి
క్యూఎస్ వరల్డ్ ర్యాంకింగ్స్ లో ఐఐటీ ఢిల్లీ, ఐఐఎస్సీ బెంగళూరు
ఉచిత రేషన్ కార్డుల జారీపై`సుప్రీం’ అభ్యంతరం