
వచ్చే 25 సంవత్సరాలు భారతదేశపు అమృతకాలమని చెబుతూ భారతదేశంలోని యువత ప్రపంచమంతా రాణిస్తున్నారని థెయ్ల్పారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం అభివృద్ధి ఫలాలు ప్రతి పేదవాడికి అందేలా కృషి చేస్తోందని, ప్రభుత్వ పథకాలు ప్రతి ఒక్కరికి చేరువ చేయడమే వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర లక్ష్యమని పేర్కొన్నారు. మోదీ నాయకత్వంలో భారత్ తొందర్లోనే విశ్వగురువు స్థానంలో నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
కాగా, తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వ దుకాణం బంద్ అయ్యిందని, కాంగ్రెస్ పార్టీ అమలు సాధ్యంకాని హామీలు ఇచ్చి అధికారాన్ని దక్కించుకుందని శివరాజ్ సింగ్ చౌహాన్ విమర్శించారు. దేశంలో కొన్ని కుటుంబ పార్టీలు ప్రజాధనాన్ని దోపిడీ చేస్తున్నాయని, అలాంటి కుటుంబ పార్టీ నుంచి విముక్తి చెందేలా సమాజంలో మార్పు రావాల్సిన అవసరం ఉందని పిలుపిచ్చారు.
తెలంగాణలో బీజేపీ బలం, బలగం, బాధ్యత పెరిగాయని చెబుతూ వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పని చేయాలని పార్టీ నేతలకు సూచించారు. దేశంలో ప్రధాని నరేంద్ర మోదీ సుపరిపాలనను అందిస్తూ మహిళల ఆత్మగౌరవాన్ని పెంచేలా పాలనసాగిస్తున్నారని, యువతను ప్రోత్సహించడంతో పాటు భారతీయ సంస్కృతి, జీవన విధానాలను భావితరాలకు అందించేందుకు పాటుపడుతున్నారని వివరించారు.
More Stories
హైదరాబాద్ శివాలయంలో మాంసపు ముద్దలు
బీజేపీలోకి ఇద్దరు కాంగ్రెస్ నేతలు ప్రవేశం
కుంభమేళాకు వెళ్లి వస్తుండగా 8 మంది తెలంగాణ వాసుల మృతి